
Oscars 2025:ఆస్కార్ బెస్ట్ పిక్చర్ ‘అనోరా’ కథేంటి, ఏ ఓటీటీ లో ఉంది?
ఈ సినిమా అంతగా ఆకట్టుకోవటానికి ఏముంది, అసలు సినిమాలో ఏముంది? వివరాలు చూద్దాం.
ఎవరూ ఊహించని విధంగా ఈ సారి ఆస్కార్ లో బెస్ట్ ఫిల్మ్ క్యాటగిరి లో అనేక చిత్రాలు పోటీపడగా ‘అనోరా’ సినిమాను ఆస్కార్ 2025 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 97వ అకాడమీ అవార్డ్స్‌లో ‘అనోరా’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకోవడం మాత్రమే కాదు, ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ దర్శకత్వ విభాగం ఆస్కర్ గెలుచుకోవడంతో పాటుగా, ఈ చిత్రం మొత్తం ఐదు విభాగాల్లో గెలుపొందింది. ఈ ఏడాది 5 ఆస్కార్లు గెలుచుకున్న సినిమాగా ‘అనోరా’ చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆస్కార్ జడ్జిలను ఈ సినిమా అంతగా ఆకట్టుకోవటానికి ఏముంది, అసలు సినిమాలో ఏముంది? ఏ ఓటీటీలో ఈ సినిమా చూడచ్చు ..వివరాలు చూద్దాం.
చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే...
‘అని’ చిత్రం... అనే అనే 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరుగుతుంది. బ్రూక్లిన్‌లో నివసించే ఆమె తన వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఒలిగార్క్ కుమారుడు వన్యను కలుస్తుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమెను వదులుకోలేక ఆమె చుట్టూ ప్రతిక్షణాలు చేస్తాడు. ఆ తర్వాత అనిని అతను ఒప్పించి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటాడు. అయితే బాగా డబ్బున్న వన్య ఓ వేశ్యను వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. పెద్ద డిస్కషన్ గా మారుతుంది.
కొద్ది రోజులుకి రష్యాలో ఉంటున్న వన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది. తమ కుమారుడు అమాయకుడని.. మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నావంటూ వారు ఆమెను బెదిరించి వదిలేయమని చెప్తారు. అంతేకాదు తమ కుమారుడిని వదిలేస్తే 10 వేల డాలర్లు ఇస్తామని ఆశ చూపిస్తారు. మరి, అని వారిచ్చిన ఆఫర్‌ను స్వీకరించిందా? వన్యను వదిలేసిందా? ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే కథతో ఈ సినిమా తయారైంది.
ఎంత పెడితే ఎంత వచ్చింది
ఈ చిత్రం గతేడాది అక్టోబర్ నెలలో ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్టైంది. సుమారు 6 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.52 కోట్లు)తో దీనిని రూపొందించగా.. 41 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.358కోట్లు) సాధించింది. ఇదిగో ఇప్పుడు ఆస్కార్ అందుకుంది. దర్శకుడు సీన్ బేకర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు (గ్రాస్) రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది.
అవార్డ్ ల వర్షం
ఈ సినిమా రిలీజ్ కు ముందే అవార్డులు, రివార్డులు అందుకుంది. గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీనిని ప్రదర్శించగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా కేన్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పామ్ డి ఓర్’ అవార్డును సీన్ బేకర్ అందుకున్నారు.
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా-2024 లో ఇది చోటు దక్కించుకుంది. రెండు బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌ను అందుకుంది. ఇక తాజాగా జరిగిన ఆస్కార్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకుంది.
అలాగే బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న ఆనోరా దర్శకుడు సీన్ బేకర్ తన తొలి సినిమాను 2015 లో టాన్జరిన్‌తో ప్రారంభించాడు. ఈ మూవీని తన ఐఫోన్‌లో చిత్రీకరించాడు. అందుకున్నాడు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఆస్కార్ ను గెలుచుకున్నాడు సీన్ బేకర్. పెద్ద బడ్జెట్‌లు, చిత్రాలను చిత్రీకరించడానికి ఫ్యాన్సీ కెమెరాలు అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే ప్రశంసలు,అవార్డులు వాటంతట అవే వస్తాయని మరోసారి నిరూపించాడు ఆస్కార్ విన్నర్ సీన్ బేకర్.
ఏ ఓటీటీ లో ఉంది, ఎక్కడ చూడొచ్చు:
ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ+లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. అయితే రెంట్ పే చేసి ఈ సినిమాని చూడాల్సి ఉంది.