1954-1991: రష్యాతో బాలివుడ్ లవ్ స్టోరీ...
x
source: Disco Dancer imdb.com

1954-1991: రష్యాతో బాలివుడ్ లవ్ స్టోరీ...

1954-1991 మధ్య కాలం రష్యాలో బాలివుడ్ సినిమాలకు స్వర్ణయుగమని చెప్పాలి. ఇందులో కొన్ని చిత్రాలు ఆల్ టైం హిట్. ఇండియన్ చిత్రాలకు కోట్లాది అభిమానులను ఆర్జించి పెట్టాయి.


భారత్ రష్యాల అనుబంధం కేవలం రక్షణావసరాలకే పరిమితం కాలేదు. అది అన్ని రకాలుగా సాంస్కృతిక, సాంఘిక జీవితంలోకి చొరబడింది. ఈ రెండు దేశాల సంబంధాలకు సోవియట్ యూనియన్ కాలం స్వర్ణ యుగం. సోవియట్- భారత్ స్నేహ ముద్ర లేని భారతీయ రంగం లేదు. సైన్స్, టెక్నాలజీ, స్పేస్, అణుశక్తి, ఎరువులు, ఇలా అన్ని రంగాలలో రెండు దేశాలు సహకరించుకున్నాయి. ఈ సహకారం పతాక స్థాయి బాలివుడ్ లో కనిపిస్తుంది. 1954-1991 మధ్య కాలం రష్యాలో బాలివుడ్ సినిమాలకు స్వర్ణయుగమని చెప్పాలి. ఇందులో కొన్ని చిత్రాలు ఆల్ టైమ్ హిట్. ఇండియన్ చిత్రాలకు కోట్లాది అభిమానులను ఆర్జించి పెట్టాయి.

భారతీయ సినిమాలు సూపర్ హిట్టయ్యేవి. 1983లో ఒక సంఘటన జరిగింది. ఆ యేడాది మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ కుడా మిధున్ చక్రవర్తి నటించిన డిస్కోడాన్సర్ (1982)కు ఆహ్వానం వచ్చింది. సాధారణంగా అభ్యుదయ భాావాలున్న ‘దో బిగా జమీన్’ వంటి సినిమాలనే కమ్యూనిస్టు రష్యా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉండేది. చిత్ర దర్శకుడు బబ్బర్ సుభాష్ కూడా ఇలాగే భావించారు. చిత్రాన్ని మాస్కో పంపడానికి జంకారు. అయితే, స్నేహితుల ప్రోద్బలంతో సుభాష్ ‘డిస్కో డ్యాన్సర్’ ను మాస్కో పంపించారు. మాస్కో ఆడిటోరియంల్ సినిమా ప్రదర్శన కాాగానే...అద్భుతం కనిపించింది. హాల్లో ఉన్న 3000 మంది ప్రేక్షకులు లేచి టైటిల్ సాంగ్ కు డ్యాన్స్ (ఫీఛర్ ఫోటో) చేయడం మొదలుపెట్టారని ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.

ఆ దృశ్యం నా జీవితంలో మరపురాని సంఘటన అని సుభాష్ తర్వాత వ్యాఖ్యానించారు. తర్వాత సినిమా రష్యాలో విడుదలయింది. 12 కోట్ల టికెట్లు అమ్ముడు వోయాయి. యుక్రెయిన్ ప్రాంతంలో కూడా సూపర్ హిట్. వాట్సాప్ యుక్రెయిన్ కో ఫౌండర్ జాన్ కౌమ్ తను చిన్నపుడు ఈచిత్రాన్ని 20 సార్లు చూసినట్లు చెప్పారు.

అమెరికా, సోవియట్ యూనియర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నపుడు రష్యా హాలివుడ్ సినిమాలను నిషేధించింది. ఈ గ్యాప్ భారత్ నింపింది. అంతే, భారతీయ సినిమాలను రష్యన్లు కూడా గొప్పగా ఆదరించారు. 1991 దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆయేడాది కమ్యూనిజం కూలిపోయాక పరిస్థితి మారిపోయింది. అయితే, భారతీయ సినిమాలను రష్యన్లు చూడటం మానేయలేదు. క్యాసెట్లు, వీడియో, ఇపుడు ఇంటర్నెట్ ద్వారా రష్యన్లు భారతీయ సినిమాలను చూస్తూనే ఉన్నారు.

రాజ్ కపూర్ ‘ఆవారా’ ‘శ్రీ 420’, ‘ధూల్ కా ఫూల్’, ‘లవ్ ఇన్ సిమ్లా’, బాబీ, బారూద్ , సీతా ఔర్ గీతా, ముకద్దర్ సికందర్ చిత్రాలు విపరీతమైన పాపులర్. ఆవారాతో రాజ్ కపూర్ పాపులరయితే, బాబీ (1971 తో రిషికపూర్ కు రష్యాలో స్టార్ డమ్ వచ్చింది. ఇక డిస్కోడ్యాన్సర్ 60 మిలియన్ రూబల్స్ ఆర్జించి పెట్టి ఆవారాను మించిపోయింది. ఇక సీతా ఔర్ గీతా 5.5 కోట్ల మంది రష్యన్లు తికలించారు. అంతేకాదు, సీతా గీతా అనే పేర్లు కూడా పెట్టుకోవడం మొదలయింది. 1966లో వచ్చిన ’మమతా‘ మరొక సూపర్ హిట్.

రాజ్ కపూర్ ‘ఆవారా’ 1951లో నిర్మాణమయింది. నాలుగేళ్ల తర్వాత రష్యాలోప్రవేశించింది. ఆయనకు ఎనలేని అభిమానులను తెచ్చెపెట్టింది.

రాజకపూర్ ఆల్ టైమ్ హిట్. 6.4 కోట్ల టికెట్లు అమ్మడువోయాయి. 1954-91 మధ్య సోవియట్ యూనియన్ లో210 సినిమాలను ప్రదర్శించారు. ఆ రోజుల్లో రష్యన్ సినిమాల కంటే కూడా భారతీయ చిత్రాలే బాగా పాపులర్. రష్యాలో హిందీ చిత్రాలు విజయవంతమవుతూ ఉండటంతో భారత్ -రష్యా సంయుక్తంగా చిత్ర నిర్మాణం చేపట్టాయి. ఆలీబాబా ఔర్ 40 చోర్, సోహ్నీ మహీవాల్ అలా తయారయినవే. ఇప్పటీకి సోవియట్ ప్రాంతంలో టాక్సీలలో రాజ్ కపూర్ సినిమాలు వినబడుతూ ఉంటాయి.

క్వాజా అహ్మద్ అబ్బాస్ ‘ధర్తీ కె లాల్’ 1949లో హిందీ నుంచి రష్యన్ లోకి డబ్ అయిన మొదటి భారతీయ చిత్రం.

అవారా వచ్చే నాటికి రష్యాలో రెండే విదేశీ చిత్రాలు పాపులర్, అందులో ఒకటి మాగ్ని ఫిషెండ్ 7 (67 మిలియన్ టికెట్లు), మెక్సికన్ చిత్రం యెసీనియా (91 మిలియన్ టికెట్లు). ఆతర్వాత మూడో స్థానం ఆవారా దే. తర్వాత ఆవారా దరిదాపుల్లోకి బాబీ (62.6 మిలలియన్ టికెట్ల ఆమ్మకంతో) వచ్చింది. తర్వాత డిస్కోడ్యాన్సర్ అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. సోవియట్ కాలంలో పుట్టి పెరుగుతున్న రష్యన్ యువత మనసు దోచుకున్న చిత్రంగా పేరొచ్చింది. ఈచిత్రాన్ని రికార్డు స్థాయిలో ఆరు కోట్ల మంది చూశారు. ఇక సీతా ఔర్ గీతా రష్యా కంటనీరు తెప్పించింది. ఈ చిత్రాన్ని అయిదున్నర కోట్ల మంది చూశారు.ఇక ఇతర చిత్రాలకు సంబంధించిన 1969లో విడుదలయిన మమతా (1963) ని 52.1 మిలియన్ల మంది తిలకిస్తే, ఫూల్ ఔర్ పత్తర్ ని 45.4 కోట్ల మంది చూశారు. రష్యలో పాపులర్ అయిన పది సినిమాలు చెప్పాలంటే వీటితో పాటు దునియా, హమ్రాజ్ పేర్లు కూడా చెప్పాలి. దునియా చిత్రాన్ని 45.4 మిలియన్లుమంది చూస్తే హమ్రాజ్ ని 42.4 మిలియన్ల మంది చూశారు.

Read More
Next Story