అల్లు అర్జున్‌పై బాలీవుడ్ ‘కుట్ర’? అసలేం జరిగింది?
x

అల్లు అర్జున్‌పై బాలీవుడ్ ‘కుట్ర’? అసలేం జరిగింది?

‘షీర్ లూజర్స్’ అంటూ నోరుపారేసుకున్న పోడ్‌కాస్టర్


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చుట్టుముట్టిన తాజా వివాదం సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. ముంబైకి చెందిన ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ టీమ్ ప్రవర్తనపై వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ‘బన్నీ వర్సెస్ బాలీవుడ్ పోడ్‌కాస్టర్స్’ అన్నట్లుగా తయారయ్యాయి.

అసలు అల్లు అర్జున్ టీమ్ ఇంటర్వ్యూల కోసం షాకింగ్ రూల్స్ పెడుతుందా? అనే కోణంలో జరుగుతున్న ఈ రచ్చ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కబోతోంది. ఈ వివాదం వెనుక ఉన్న అసలు విషయాలను, బన్నీ టీమ్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏమిటో చూద్దాం.

అసలేం జరిగింది... 42 నిబంధనలు.. కళ్లలోకి చూడకూడదా?

ఈ వివాదానికి కేంద్ర బిందువు 'స్వీకృతి టాక్స్' (Sweekriti Talks) అనే బాలీవుడ్ పోడ్‌కాస్ట్. ఇందులో అతిథిగా పాల్గొన్న బ్రాండ్ మేనేజర్ కావేరి బారువా, అల్లు అర్జున్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బన్నీని కలవడానికి ముందే తమకు 42 నిబంధనలతో కూడిన ఒక నోట్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా..


అల్లు అర్జున్ కళ్లలోకి నేరుగా చూడకూడదు.

ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు.

మేనేజర్ల మీద మేనేజర్లు ఉంటారు, చాలా కఠినంగా వ్యవహరిస్తారు.

ఈ క్లిప్ వైరల్ కావడంతో నెటిజన్లు అల్లు అర్జున్‌పై విమర్శలు మొదలుపెట్టారు. సక్సెస్ తలకెక్కి బన్నీ ఇంత అహంకారంగా ప్రవర్తిస్తున్నారా? అని ప్రశ్నించారు.

రంగంలోకి దిగిన బన్నీ టీమ్.. పరువు నష్టం దావా!

వివాదం ముదురుతోందని గమనించిన అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించింది. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని, అబద్ధమని కొట్టిపారేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారని స్పష్టం చేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. కేవలం క్లారిటీ ఇవ్వడమే కాకుండా, సదరు బ్రాండ్ మేనేజర్‌పై పరువు నష్టం (Defamation Suit) దావా వేయాలని నిర్ణయించుకున్నారు. తప్పుడు సమాచారంతో నటుడి ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

‘షీర్ లూజర్స్’.. పోడ్‌కాస్టర్ ఎదురుదాడి!

బన్నీ టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పగానే, పోడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి ఆ వీడియోను డిలీట్ చేశారు. అయితే, అక్కడితో ఆపకుండా సోషల్ మీడియాలో మరో బాంబు పేల్చారు. అల్లు అర్జున్ టీమ్ తన గెస్ట్‌ను వేధిస్తోందని, బాట్ అకౌంట్లతో దాడి చేయిస్తోందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకేసి అల్లు అర్జున్, ఆయన టీమ్‌ను “షీర్ లూజర్స్” (Sheer Losers), “పవర్ హంగ్రీ” (అధికార దాహం కలిగిన వారు) అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఇది బన్నీ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది.

లీగల్ టీమ్ నెక్స్ట్ స్టెప్: ‘నో కాంప్రమైజ్’

అల్లు అర్జున్ టీమ్ ఈసారి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ముంబైకి చెందిన ఆ బ్రాండ్ మేనేజర్ కావేరి బారువా, పోడ్‌కాస్టర్ స్వీకృతిపై క్రిమినల్ డెఫమేషన్ (పరువు నష్టం) కేసు దాఖలు చేయడానికి పేపర్స్ సిద్ధం చేస్తున్నారు. కేవలం వీడియో డిలీట్ చేస్తే సరిపోదని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది.

బన్నీ రియాక్షన్: మౌనమే సమాధానమా?

సాధారణంగా ఇలాంటి వివాదాలపై అల్లు అర్జున్ స్వయంగా స్పందించరు. తన 'పిఆర్' (PR) మరియు 'లీగల్' విభాగాలే వీటిని డీల్ చేస్తాయి. అయితే, తన ఇమేజ్‌ను కావాలని దెబ్బతీస్తున్నారని భావిస్తే.. ఏదైనా ఇంటర్వ్యూలో లేదా ఈవెంట్‌లో ఇన్-డైరెక్ట్ గా సెటైర్లు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా తన తర్వాతి ప్రాజెక్టులపైనే ఉంది.

బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్?

ఈ వివాదం ఇప్పుడు వ్యక్తిగత స్థాయి నుండి ఇండస్ట్రీ స్థాయికి వెళ్తోంది. సౌత్ స్టార్ల ఎదుగుదలను ఓర్చుకోలేకనే బాలీవుడ్‌లో ఇలాంటి 'పెయిడ్ నెగటివిటీ'ని ప్రోత్సహిస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే సదరు పోడ్‌కాస్టర్లపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

తగ్గేదే లే.. ఇమేజ్ మేనేజ్‌మెంట్‌లో బన్నీ నయా స్టైల్!

అల్లు అర్జున్ ఈ విషయంలో పక్కా ఆలోచనతో, ప్లాన్‌తో వెళ్తున్నారు. పుష్ప-2 స్టాంపిడ్ ఘటన తర్వాత, పబ్లిక్ పర్సెప్షన్ విషయంలో అల్లు అర్జున్ టీమ్ అస్సలు రిస్క్ తీసుకోవడం లేదు. ఏ చిన్న తప్పుడు వార్త వచ్చినా వెంటనే లీగల్ వార్నింగ్‌లతో చెక్ పెడుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌లో తన క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి బన్నీ అనుసరిస్తున్న ఈ ‘ప్రోయాక్టివ్ అప్రోచ్’ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

ఒకవైపు ఈ వివాదాలు నడుస్తున్నా, అల్లు అర్జున్ తన తదుపరి సినిమా అట్లీ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. వివాదాల వల్ల పనులు ఆగకూడదని ఆయన టీమ్ కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.

Read More
Next Story