సైక్లాజికల్ థ్రిల్లర్ :  ‘బోగన్ విల్లా’Ott రివ్యూ
x

సైక్లాజికల్ థ్రిల్లర్ : ‘బోగన్ విల్లా’Ott రివ్యూ

నవలా ఆధారిత చిత్రాలు ఈ మధ్యన బాగా తగ్గాయి. సక్సెస్ ఫుల్ నవలలు రాసే వాళ్ళు అరుదైపోవటం ఓ కారణం అయితే, వాటిని ఆదరించేవాళ్లు మరీ తగ్గిపోవటం మరో కారణం.

నవలా ఆధారిత చిత్రాలు ఈ మధ్యన బాగా తగ్గాయి. సక్సెస్ ఫుల్ నవలలు రాసే వాళ్ళు అరుదైపోవటం ఓ కారణం అయితే, వాటిని ఆదరించేవాళ్లు మరీ తగ్గిపోవటం మరో కారణం. అయితే తాజాగా లాజో జోస్ రచించిన ప్రముఖ మలయాళ థ్రిల్లర్ నవల ‘రుథింథె లోకమ్’ (Ruthinte Lokam) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. నవలకు తగ్గ స్దాయిలో సినిమా లేదని కామెంట్స్ వచ్చిన, సినిమాగా మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనే పేరు తెచ్చుకుంది. . జ్యోతిర్మయి, ఫహద్‌ ఫాజిల్‌( Fahadh Faasil) , కుంచకో బోబన్‌ (Kunchacko boban) కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబరు 17న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటీటీలోకి దిగింది. ఇంతకీ ఈ చిత్రం కథేంటి, తెలుగు వాళ్లకు నచ్చే కథనమేనా చూద్దాం.

స్టోరీ లైన్

రాయిస్‌ (కుంచకో బోబన్‌) భార్య రీతూ (జ్యోతిర్మయి) అన్యోన్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రీతూ గతం మర్చిపోతుంది. తన భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ, డాక్టర్ గా తన వృత్తిని కొనసాగిస్తుంటాడు రాయిస్. రీతూ పెయింటింగ్స్ వేస్తూ కాలక్షేపం చేస్తూంటుంది. ఆ పెయింటిగ్స్ లో ఎప్పుడూ బోగన్ విల్లాలు, ఎర్రటి రక్తం లాంటి విజువల్స్ కనపడుతూండటం ఆశ్చర్యపరుస్తూంటాయి. ఆ పెయింటింగ్స్ ఎప్పటికప్పుడు అమ్ముడైపోతూంటాయి. ఎవరు అంత ఆసక్తిగా ఆ పెయింటింగ్స్ కొంటున్నారో అర్దం కాదు.

మరో ప్రక్క యాక్సిడెంట్ తో రీతూ ఆమ్నీషియా బారిన పడటం ఆమెకు రెగ్యులర్ లైఫ్ కు ఇబ్బందిగా మారుతుంది. తలరా స్నానం చేస్తే అంతకు ముందు రోజు జరిగినవి గుర్తు ఉండవు. ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా ఆమె వల్ల కాదు. దాంతో ఆమె తన చుట్టూ జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు కొన్ని కాగితాలపై రాసుకుని చదువుకుంటూ ఉంటుంది. అలా గడుస్తున్న సమయంలో వాళ్ల జీవితాల్లోకి మరో పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అతనే ఏసీపీ డేవిడ్ ఖుషి(ఫహాద్ ఫాజిల్). కేరళలో టూరిస్టుల సీరియల్ మిస్సింగ్ కేసులు సంచలనంగా మారటంతో వాటి ఇన్విస్టిగేషన్ చేస్తూంటాడు.

ఈ కేసులకు రీతూకూ సంబంధం ఉందనేది ఏసీపీ డేవిడ్‌ డౌట్. దాంతో ఆమెను అనుమానించి, వెంబడిస్తాడు. పోలీస్ స్టేషన్ కు పిలుస్తాడు. అతను అనుమానించినట్లుగానే టూరిస్టుల మిస్సింగ్‌కు రీతూనే కారణం అన్నట్లు డేవిడ్‌కు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అయితే రీతూ నుంచి నిజాలు చెప్పించటానికి చాలా కష్టమవుతుంది. ఆమె ఆమ్నీషియా ఇన్విస్టిగేషన్ కు అడ్డంగా నిలుస్తుంది. అయితే చివరకు ఆ ముడి విప్పగలుగుతారు. ఇంతకీ ఆ మిస్సింగ్స్‌ కి రీతూకి ఉన్న సంబంధం ఏంటి? ఏసీసీ డేవిడ్‌ కి దొరికిన క్లూలు ఏమిటి, వాటికి ఆమె గీసే పెయింటింగ్స్ కు సంబంధం ఉందా? అన్నది చిత్ర కథ.

ఎలా ఉంది

డైరెక్టర్, కో రైటర్ అయిన అమల్ నీరద్ ఈ సినిమాని ఓ మిస్టరీ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో చేసారు. అది మనకు మొదటి షాట్ నుంచి అర్దమవుతూనే ఉంటుంది. మెల్లిగా మనకు పాత్రలను పరిచయం చేస్తూ కథనం కదులుతుంది. అయితే ఆ క్రమంలో ఇంత స్లో సినిమా ఏంట్రా బాబు అనిపిస్తుంది. జరిగిందే జరిగినట్లు అనిపిస్తుంది. ఇందులో ప్రధాన పాత్ర లాగా మనకు ఆమ్నీషియా లేదు కదా..ఎందుకు ఇలా రిపీట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ మిస్టరీ థ్రిల్లర్ కాస్తా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా టర్న్ తీసుకుంటుందో అప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది. అయితే సినిమా చివరకు వచ్చేసరికి ప్రెడిక్టబులిటీగా అనిపిస్తుంది. దాంతో ఎంత బాగా మిస్టరీని బిల్డ్ చేసినా ఒక్కసారిగా అదంతా కూలిపోయిన ఫీలింగ్ వస్తుంది.

ఈ సినిమాలో ప్లాట్ డివైజ్ లు బోగన్ విల్లా, సన్ ఫ్లవర్, పెయింటింగ్స్ ఇవన్నీ చూసేవారిని కనెక్ట్ చేస్తాయి. ఒక్కొక్క చుక్కా కలుపుకుంటూ వెల్లే లా చేసి, తామే కథలో విలన్ ఎవరో ..రివీల్ కాకముందే తెలిసేలా చేస్తాయి. లాల్ జోస్ ..రైటర్ గా ఇన్వాల్వ్ అవటం కూడా కలిసి వచ్చిన విషయం. కాకపోతే ఇంకొంచెం సినిమాని క్రిస్పీ గా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. అలాగే స్లో గా నడపడం మన ఎక్సైట్మెంట్ ని లాగేసుకున్న ఫీలింగ్ తెస్తుంది.

ఎవరెలా చేశారు

టెక్నికల్ గా ఈ సినిమా చాలా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే నెక్ట్స్ లెవెల్ లో ఉంది. అమల్ సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకుడిగా మారి చేసిన సినిమా కావడంతో ఆ స్టైల్ కనబడుతుంది. గతంలో అమల్... దుల్కర్ సల్మాన్ తో ‘సి.ఐ.ఎ’, మమ్ముట్టితో ‘బిగ్ బి’, ‘భీష్మ పర్వమ్’ లాంటి థ్రిల్లర్ సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అయితే మరీ అద్బుతం అనిపించదు. అయితే మొదటి నుంచి చివరి దాకా అయితే తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలగచేసారు.క్లైమాక్స్ తేలిపోయింది. డైరెక్టర్‌ క్వెంటిన్‌ టరంటినో చిత్రం డెత్ ఫ్రూఫ్ గుర్తుకు వస్తుంది. అయితే ఎండ్ ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే....

పుష్ప తో తెలుగులోనూ బాగా పాపులర్ అయిన ఫహద్‌ ఫాజిల్‌ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ సినిమా నిరాశ వస్తుంది. ఇందులో ఫహద్ ఓ స్టయిలిష్ పోలీసాఫీసర్ రోల్ మాత్రమే ఇచ్చారు దర్శకుడు అమల్ నీరద్. అంతకు మించి ఏమీ లేదు. ‘నాయట్టు’, ‘2018’, చిత్రాల ఫేమ్ కుంచాకో బోబన్(Kunchacko Boban), జ్యోతిర్మయి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. వారిద్దరూ పోటీపడి చేశారు. ముఖ్యంగా జ్యోతిర్మయి సినిమాకు ప్రాణం పోసింది.

చూడచ్చా

సైకలాజికల్ థ్రిల్లర్ చూసే ఇంట్రెస్ట్ ఉన్నవారికి మంచి ఆప్షన్. చివరిదాకా ఎంగేజ్ చేస్తుంది. అలాగే కొంత హింస ఉండటంతో ప్యామిలీతో చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కడ చూడచ్చు

మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సోనీ లివ్ లో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఉంది కాబట్టి హ్యాపీగా చూసేయొచ్చు.

Read More
Next Story