‘అమెరికన్ ఫిక్షన్’  మూవీని తప్పకుండా చూాడాలి, ఎందుకంటే...
x

‘అమెరికన్ ఫిక్షన్’ మూవీని తప్పకుండా చూాడాలి, ఎందుకంటే...

నువ్వింతే, నీబతుకింతే, నువ్విలాగే ఉండాలని మనలని శాసించి,జడిపించి, ఒప్పించిన నడిపించిన శక్తుల అసలు స్వరూపం తెలిస్తే ఏమవుతుంది? ‘అమెరిక ఫిక్షన్’ సినిమాఅవుతుంది



--రామ్.సి

మీరు మాంసం తినన్నారంటే మీ కులం ఏదో చెప్తారు.మీ ఇంటి పేరు చెబితే మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతిస్తారో ,మీరు ఇంట్లోకి ఆహ్వాన అర్హులో కాదో చెప్తారు. మీరు ఎలాంటి ఆర్థిక ,సామాజిక నేపథ్యం నుండి వచ్చారో చెప్పేస్తారు.మీ ర్యాంకు ఏదైనా కానీ,మీకు ఉన్నతమైన విద్యాలయాల్లోనో, ఉద్యోగాల్లోనో ప్రవేశం దొరికిందంటే,మీ అటు ఇటు ఏడు తరాల జాతకం చెప్పేస్తారు.అపార్టుమెంట్లోనో, వీధిలోనో అందర్నీ పిలిచి మిమ్మల్ని పేరంటానికి పిలవలేదంటే మీ కులం తక్కువతనాన్ని గుర్తించినట్టే. ఇవ్వన్నీ నమ్మారా మీరు. అదే అని నమ్మబలికించారనుకోండి. అంతే సంగతులు. తెలుగు వాళ్లు అమెరికా వెళ్లినా అదే భావ దారిద్య్ర వ్యథే.

శారీరకంగా, మానసికంగా మనమెంటో బాహ్య ప్రపంచం కనిపెడుతుంది, పసిగడుతుంది.అలా ఉండడమే సరైనదని మనచే వప్పించే నడిపించే సమాజ ధోరణులను ఎండగట్టి, దాని మూలాలు ఏంటి అని పరిశోధించి గూబ గుయ్ మనిపిస్తూ, మొట్టికాయలు వేసి, చెవులు పిండి, తొడ పాయసం పెట్టి, గోడ కుర్చీ వేయించి, తోలు వొలిచేసి, తట్టి లేపే సినిమా ఇది అమెరికన్ ఫిక్షన్ (American Fiction).

మనం ఇదే, మనం ఇంతే, అలా కాదు ఇలా అంటూ సాగిపోయే మనం ఆకస్మికంగా అది కాదు అని తెలిస్తే ఏమౌతుంది అంటే ‘అమెరికన్ ఫిక్షన్’ గా ఆవిష్కరింపబడుతుంది.కొన్ని సినిమాలు కనువిప్పు కలిగిస్తాయి. అప్పటి వరకు పేరుకు పోయిన మలినాన్ని ఎలుగెత్తి చాటుతాయి, కడిగి పారేస్తాయి.

తర తరాలుగా మష్తిష్కంలో ఓ సంస్కృతీ, వ్యక్తి, వ్యవస్థ, సమూహం, కులం, మతం, ప్రాంతం, భావజాలం నాటిన లేదా అలవాటు చేసిన కొన్ని విషయాలో సంగతులో, మనకు ఎప్పుడైనా ఎదురుపడ్డప్పుడు తలచుకొంటే ఎమనిపిస్తుంది. వాటికి భిన్నంగా ఇపుడు ఉంటే ముందు ఆశ్చర్యమేస్తుంది. తరువాత మనం ఎంత మూర్ఖంగా తయారయ్యామో తెలిసి సిగ్గుపడతాం. అయితే, మూస ఆలోచనలపై ఏర్పర్చుకున్న మేధావితనం కొట్టుకుపోవడమనేది చాలా తక్కువగా జరుగుతుంది.

అటువంటి కోవలోని సినిమాయే 'అమెరికన్ ఫిక్షన్'. మనిషిని కొందరు మనుషులు 'నువ్వు ఇది' అని నిర్ణయించి ,ఆ నిర్ణయానికి పలు ప్రక్రియలు, సాహిత్యం, మాధ్యమాల ద్వారా ప్రచారం చేయింది, చివరికి ‘అవును మేము అదే’ అని అంగీకరించే స్థాయికి ఆ మనుషులను సిద్ధం చెయ్యడం ఈ వ్యవస్థ చేసే అమానుషం.

ఓ నల్ల జాతి అమెరిన్ ప్రొఫెసర్, రచయిత సాహిత్య వ్యాపార సామ్రాజ్యం పై చేసిన వ్యంగ్యమే ఈ సినిమా.

నల్ల జాతీయులన్నా, వారి కథలు, వారి రాసే రచనలు, కవిత్వం, వారి సామాజిక జీవనం, శారీరిక, మానసిక, కుటుంబ స్థాయిలను మూస పద్దతిలోనే హర్షించి,గుర్తిస్తూనే తెల్లవారి ఆలోచనలను ఏకిపారేసిన సినిమా.

ఓ సందర్భంలో తన ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు తనకు నచ్చక పోయినా నల్ల జాతీయుల కథాంశాన్ని తీసుకొని, నల్ల సాహిత్యం పట్ల తెల్లవారికి ఉన్న సహజ దృక్పథం రాసిన ఓ పుస్తకం అమెరికన్ నల్ల జాతీయుల సాహిత్య చరిత్రలో చాల గొప్ప రచనే పోవడంతో అసలు కథ మొదలుతుంది. కాదు కథ అడ్డం తిరుగుతుంది.

మేము ఇది కాదు మొర్రో అంటున్నా, మాలో చాలా ఉన్నతమైన మనుషులని, పురోగమించే తత్వం ఉన్న వారమని,తరం మారితోందని, ఇంట్లో స్థితిగతులు, చదువులు, ఉద్యోగాలు అన్నిట్లో మార్పులు జరుగుతున్నా అంటే, తోటి నల్ల జాతీయులే గుర్తించని ఈ పార్స్యాన్ని, ఎలా తెల్లవారి ధోరణి, ఆలోచనల పై సరికొత్త పద్దతిలో ఎలా ప్రయత్నం చేస్తాడు, ఎదుర్కొన్నాడు అని వినూత్నంగా తెరకెక్కించిన కథ.

ఎవరో నిర్దేశించినట్టుగా నిన్ను నువ్వుగా అంగీకరిస్తే అది నీ అస్థిత్వం (Idenity) కాదు, వేరేవరో నిర్ణయించిన దాన్ని నువ్వు ఒప్పుకున్నట్టే అంటూ సెటైరికల్ గా ( satirical) చెబుతూ, క్లైమాక్స్ తో నిర్ఘాంతపోయేట్టు చెయ్యడం ఈ సినిమా బలం. భావానికి దొరికిన కొత్త నీరు.

దర్శకుడు కార్డ్ జెఫర్సన్ (Cord Jefferson) తన తొలి ప్రయత్నంలోనే చేసిన గొప్ప ప్రయోగం. జెఫ్రీరైట్ (Jeffery Wright) ప్రధాన పాత్రలో ఈ విస్తృతమైన మూస అభిప్రాయాన్ని పటాపంచలు చేసి చూపించే విభిన్నమైన కోణం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.

ఆసాంతం మనల్ని జరగబోతున్న దాని పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. భావ దారిద్య్రాన్ని ఇంత గొప్పగా చూపించిన సినిమాలు ఉన్నా, జాత్యహంకారం ఎంత లోపలి చొచ్చుకుపోయింది, వాటి వేర్లు ఎక్కడి వరకు చేరిపోయాయో చెప్పిన వైనం అభినందనీయం.

ఎంత ప్రయత్నం చేసినా మారడం చేతకాని సంఘాన్ని చూసి ,’మీ చావు మీరు చావండని. నా చావు నేను చస్తాను' అని ఓ నిస్పృహ, నిస్తేజం ఆవహిస్తాయి.

ఆస్కార్ అవార్డు ఉత్తమ నటుడిగా కిచ్చితంగా సిలియన్ మర్ఫీ (Cilian Murphy)నే అని అనుకొంటున్నా, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా జెఫ్రీ రైట్ నే వరిస్తుందని నా నమ్మకం."నేను ఆలోచనను మాత్రమే ప్రేరేపించగలను, ఈ చుట్టూ అలుముకున్న విశృంఖలత్వాన్ని చేధించే ప్రయత్నం, నిర్ణయం మీకే వదిలేస్తున్నాను,’’ అంటూ చెప్పే దర్శకుడు చాలా అరుదుగా దొరికే ముత్యం.




Read More
Next Story