ఉత్తమ నటుడిగా ‘యానిమల్’ హీరో, ఉత్తమ నటిగా..
x

ఉత్తమ నటుడిగా ‘యానిమల్’ హీరో, ఉత్తమ నటిగా..

ఫిలింఫేర్ అవార్డులలో పెద్ద సినిమాలను పక్కకు నెట్టి, ఓ సినిమా అవార్డులన్నీ కొల్లగొట్టింది. యానిమల్ లో నటనకు గాను రణ్ బీర్ కపూర్ ఉత్తమనటుడిగా అవార్డు అందుకున్నారు.


గుజరాత్ లో అట్టహాసంగా జరుగుతున్న 69 వ ఫిలింఫేర్ అవార్డులలో రణ్ బీర్ కపూర్ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా అలియా భట్ నిలిచారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో రణ్ బీర్ నటనకుగాను ఈ పురస్కారం దక్కింది. అలాగే రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహనీలో నటనకు గాను అలియభట్ ఈ అవార్డును గెలుచుకున్నారు. యానిమల్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 కోట్ల వసూళ్లను రాబట్టింది. అల్పామేల్ క్యారెక్టర్ తో రణ్ బీర్ చేసిన యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ గా 12 ఫెయిల్ సినిమా అవార్డులు కొల్లగొట్టింది. విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. విక్రాంత్ మాస్సే క్రిటిక్స్ విభాగంలో కూడా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అలాగే ఉత్తమ క్రిటిక్స్ నటిగా రాణి ముఖర్జీ, షెఫాలీ షా పంచుకున్నారు. రాణి ముఖర్జీ ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేకి రాణీ’, షెఫాలీ ‘త్రీ ఆఫ్ అస్’ చిత్రంలో నటించారు. ఉత్తమ సహయనటుడిగా విక్కీ కౌశల్ ‘డంకీ’ చిత్రానికి గాను అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ ను ఫిల్మ్ మేకర్ డేవిడ్ ధావన్ కు అందించారు.

విజేతల వివరాలు:

ఉత్తమ నటుడు: రణ్ బీర్ కపూర్, (యానిమల్ చిత్రం)

ఉత్తమ నటి: అలియా భట్, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహనీ

ఉత్తమ చిత్రం: 12 ఫెయిల్

ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా, 12 ఫెయిల్

ఉత్తమ క్రిటిక్స్: జోరామ్

ఉత్తమ నటుడు క్రిటిక్స్: విక్రాంత్ మాస్సే, 12 ఫెయిల్

ఉత్తమనటి: రాణీ ముఖర్జీ( మిసెస్ ఛటర్జీ వర్సెన్ నార్వే), షెఫాలీ షా(త్రి ఆఫ్ అస్)

ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్(డంకీ)

ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ( రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహనీ)

ఉత్తమ సంగీత ఆల్బమ్: యానిమల్( ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, భూపిందర్, అషిమ్, హర్షవర్ధన్, గురీందర్ సీగల్)

ఉత్తమ సాహిత్యం: అమితాబ్ భట్టాచార్య( తేరే వాస్తే- జరా హట్కే జరా బచ్కే)

ఉత్తమ నేపథ్య గాయకుడు : భూపిందర్ బబ్బల్( అర్జన్ వైలీ- యానిమల్)

ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావు( బేషరం రంగ్- పఠాన్)

ఉత్తమకథ: అమిత్ రాయ్, ఓ మైగాడ్

ఉత్తమ స్క్రీన్ ప్లే: విధు వినోద్ చోప్రా, 12 ఫెయిల్

ఉత్తమ డైలాగ్: ఇషితా మోయిత్రా, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహనీ

బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్: హర్షవర్థన్ రామేశ్వర్, యానిమల్

ఉత్తమ సినిమాటోగ్రఫి: అవినాష్ అరుణ్ ధావరే, త్రీ ఆఫ్ అస్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే సామ్ బహదూర్ చిత్రానికి

ఉత్తమ ఎడిటింగ్: జస్కున్వర్ సింగ్ కోహ్లి, విధు వినోద్ , 12 ఫెయిల్

ఉత్తమ కొరియో గ్రఫీ: గణేష్ ఆచార్య, రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహనీలోని వాట్ ఝూమ్కా.. పాటకు

ఉత్తమ వీఎఫ్ఎక్స్: రెడ్ చిల్లీస్, జవాన్ చిత్రానికి గాను.

Read More
Next Story