కూటమి గెలుపు: కల్కి కి కలిసి వస్తే...పుష్ప పై  పగ సాధిస్తుందా?
x

కూటమి గెలుపు: 'కల్కి' కి కలిసి వస్తే...'పుష్ప' పై పగ సాధిస్తుందా?

2024 ఎన్నిక‌ల్లో నీవినీ ఎరుగ‌ని స్దాయిలో కూటమి విజయం సాధించింది. తెలుగుదేశం ఒంట‌రిగానే మేజిక్ ఫిగ‌ర్ దాటిపోయింది.


2024 ఎన్నిక‌ల్లో నీవినీ ఎరుగ‌ని స్దాయిలో కూటమి విజయం సాధించింది. తెలుగుదేశం ఒంట‌రిగానే మేజిక్ ఫిగ‌ర్ దాటిపోయింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనే విషయం తేలిపోయింది. అందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెవిలో అమృతం పోసిన ఫీలింగ్ కలుగ చేస్తోంది. ఎందుకంటే సిని పరిశ్రమలో ఎక్కువ శాతం తెలుగుదేశం మద్దతు దారులు. అలాగే పవన్ అభిమానులు. ఈ నేపధ్యంలో సిని పరిశ్రమలో ఈ కొత్త ప్రభుత్వంతో ఏ తరహా మార్పులు వస్తాయనే విషయం ప్రక్కన పెడితే ..ఇమ్మిడియట్ గా అయితే రెండు పెద్ద సినిమాలపై ఇంపాక్ట్ పడనుంది. ఆ సినిమాలే కల్కి, పుష్ప 2. ఇప్పుడు నెట్టింట ఇవే చర్చ జరుగుతున్నాయి.

మొదట ప్రభాస్ తో కల్కి చిత్రం నిర్మిస్తున్న అశ్వనీదత్ చాలా హ్యాపీగా ఉండి ఉంటారనేది నిజం. అశ్వనీదత్.. మొదటి నుంచి టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ స్పందించారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని ఆకాంక్షిస్తూ "నారా చంద్రబాబు నాయుడు గారి విజయం.. రేపటి విద్యార్థుల భవిష్యత్ కోసం.. రేపటి యువత ఉపాధి కోసం.." అనిపోస్ట్ కూడా పెట్టారు. ఈ పోస్ట్ పెట్టగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే కల్కి రిలీజ్ కు ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. కానీ ఇప్పుడు పండగే అంటున్నారు.

ఇప్పుడు కల్కి మూవీ టికెట్ రేట్ల పెంపు జీవోలు ఈజీగా వస్తాయి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఫర్మిషన్ వస్తుంది. ఫ్యాన్స్ షోలు, ఎక్స్ ట్రా షో పర్మిషన్ లు.. దేనికి లోటు ఉండదు. ఇవన్నీ కల్కి సినిమా సక్సెస్ కు పనికి వచ్చేవే.

ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాకు ప్రభుత్వం తరుపు నుంచి ఏ సమస్యా ఉండదు కానీ...పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని బహిష్కరించాలని సోషల్ మీడియాలో పిలుపు ఇస్తున్నారు. ఎలక్షన్స్ ప్రచారం సమయంలో తన ప్రాణ స్నేహితుడనే కారణంతో వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళారు. దాంతో పెద్ద దుమారమే లేచింది. క్యాంపైన్ చివరి రోజు పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకుండా అదే రోజు ఫ్రెండ్ తో సీమకు వెళ్లడంతో పవన్ ఫ్యాన్స్ బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేశారు.

చివరకు తెలంగాణ లోక్ సభ పోలింగ్ రోజు బన్నీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన సపోర్ట్ పవన్ కు ఖచ్చితంగా ఉంటుందని నొక్కి చెప్పాడు. అయినా పవన్ ఫ్యాన్స్ మర్చిపోలేదు. ప్రచారానికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ తను కేవలం రవిచంద్ర గెలవాలని కోరుతూ సంఘీభావం తెలిపానని అన్నాడు. ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చిన రవిచంద్ర ఓడిపోయారు. జనసేన పార్టీ అభ్యర్ది భారీ మెజార్టీతో గెలిచారు. దాంతో పవన్ ప్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. దాంతో పుష్ప 2 ది రూల్ విడుదల టైంలో మాత్రం తాము దూరంగా ఉంటామని చెబుతున్న సోషల్ మీడియా పోస్ట్ లు, ట్వీట్లు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి.

అయితే కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే పుష్ప2 ని దూరం పెడతారా లేక చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు కూడా అందుకుంటారా.. , అనేది క్వచ్చిన్ గా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుని ట్రోల్ చేశారు, వాళ్ళు కూడా అల్లు అర్జున్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైమైనా 'పుష్ప 2' అల్లు అర్జున్ కెరీర్ లో ఒక కీలక సినిమా ని చెప్పొచ్చు. ఇలా ఫ్యాన్స్ అంతా రివర్స్ అయితే ఓపినింగ్స్ కు మాత్రం పెద్ద దెబ్బే. ఇలా రాజకీయాలు సినిమాలకు ఎలా ప్లస్సో ...మైనస్ కూడా అని నిరూపించినట్లు అయ్యింది.

Read More
Next Story