గ్లామర్ దెయ్యం తెచ్చిన 100 కోట్లు : ఫ్లాఫ్ టాక్, కానీ కలెక్షన్స్ సూపర్ హిట్
x

గ్లామర్ దెయ్యం తెచ్చిన 100 కోట్లు : ఫ్లాఫ్ టాక్, కానీ కలెక్షన్స్ సూపర్ హిట్

కొన్ని సినిమాల భాక్సాఫీస్ లెక్కలు ట్రేడ్ పండితులకు షాక్ ఇస్తాయి. సీనియర్స్ కు మైండ్ పోయేలా చేస్తాయి.


కొన్ని సినిమాల భాక్సాఫీస్ లెక్కలు ట్రేడ్ పండితులకు షాక్ ఇస్తాయి. సీనియర్స్ కు మైండ్ పోయేలా చేస్తాయి. తాము వర్కవుట్ కాదని రివ్యూ రాసిన సినిమా ఆడేస్తూంటే నోరు వెళ్ళబెట్టి చూడటం తప్పించి ఏమి చేయగలుగుతారు రివ్యూయర్లు. అదే ఇప్పుడు తమిళంలో వచ్చిన అరణ్మనై4(Aranmanai4 Movie)పరిస్దితి. తమిళ దర్శకుడు, నటుడు సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie).దాని తమిళ పేరే అరణ్మనై4. ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలో జస్ట్ యావరేజ్ టాక్‌నే సొంతం చేసుకుంది. తెలుగులో ‘బాక్‌’ పేరుతో విడుదలైన ఈ సినిమా ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ యేడాది తమిళం నుంచి చెప్పుకోదగ్గ సినిమానే రాలేదు. వచ్చిన ప్రతీసినిమా వచ్చినట్లే వెళ్లిపోతోంది. తెలుగు,మళయాళ, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీలు సినిమా బాగానే ఆడుతున్నా తమిళంలో మాత్రం ఒక్కటీ సరైన సినిమా పడలేదు. ఇలాంటి టైంలో సమ్మర్ రేసులో నిలిచిన అరణ్మనై4(Aranmanai4 Movie) అనే హర్రర్ కామెడీ మూవీ….రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. దాంతో ఇదీ పోయినట్లే అని ఫిక్స్ అయ్యారు. అయితే గమ్మత్తుగా మెల్లిగా పుంజుకుంది. కానీ మెల్లిగా తమిళ్ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను చూడటానికి ఎగబడ్డారు. ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేసింది.

టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ గమనిస్తే….

👉 తమిళనాడు – 67.40Cr

👉తెలుగు రెండు రాష్ట్రాలు- 5.60Cr

👉కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 7.95Cr

👉ఓవర్ సీస్ – 19.65Cr

మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్ –100.60CR(47.50CR~ Share) అప్ప్రోస్


అంటే టోటల్ రన్ లో అక్షరాలా 100 కోట్ల మార్క్ ని దాటేసింది సినిమా . ఈ ఏడాది తమిళ్ ఇండస్ట్రీ నుంచి మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఇదే కావటం విశేషం. టోటల్ రన్ లో 18 కోట్ల బిజినెస్ మీద ఊహకందని లాభాలను అందుకుని సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఓటిటి లోనూ మంచి రేటే పలికిందని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 (Aranmanai 4 ott release date) నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

అయితే ఇంత సక్సెస్ కు కారణం. తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించటమే. వీళ్లిద్దరు పోస్టర్ మీద కనపడటం, హారర్ కామెడీ కావటంతో ఈ సినిమాకు స్టడీగా అయినా మంచి కలెక్షన్స్ దక్కాయి. నిజానికి ఈ చిత్రంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆకారాన్ని మార్చుకుంటూ భ‌య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించే ఓ దుష్ట శ‌క్తి త‌ప్ప... స్పెషాలిటీ ఏమీ లేదు. అస్సామీ జాన‌ప‌దాల నుంచి తీసుకొచ్చాం అని చిత్ర‌టీమ్ చెప్పినా ఈ కథలో దెయ్యం గ‌తంలో తెర‌పై క‌నిపించిన ఆత్మ‌ల్నే పోలి ఉంటుంది త‌ప్ప... దాని వెన‌క కొత్త క‌థ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హార‌ర్ ఎలిమెంట్స్ కానీ పెద్ద‌ గొప్పగానూ. ప్ర‌తీకారంతో కూడిన ఓ సాధార‌ణ హార‌ర్ కామెడీ చిత్ర‌మిది. అతీంద్రీయ శ‌క్తులు, సెంటిమెంట్ అంశాలు కీల‌కంగా నిలిచాయి. ఆత్మగా క‌నిపిస్తూ తమన్నా చేసే హంగామా కూడా చిత్రానికి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. మాయ అనే ఓ డాక్టర్ గా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది రాశీఖ‌న్నా.

ఇంతకీ ఈ సినిమా కథేంటంటే: శివశంక‌ర్ (సుంద‌ర్‌.సి) ఓ లాయర్. అత‌ని సోద‌రి శివాని (త‌మ‌న్నా). త‌న మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అది వాళ్ల అమ్మా,నాన్నకు నచ్చదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమంటారు. శివాని భ‌ర్త, పిల్ల‌ల‌తో క‌లిసి వారికి దూరంగా వెళ్లిపోతుంది. ఇంతలో ఉన్న‌ట్టుండి ఆత్మహ‌త్యకు పాల్ప‌డుతుంది. ఆమె భ‌ర్త కూడా అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణిస్తాడు. ఈ ప‌రిణామాలపై శివ‌శంక‌ర్‌కు అనుమానాలు రేకెత్తుతాయి. త‌న సోద‌రి ఆత్మహ‌త్య చేసుకోద‌ని గ‌ట్టిగా న‌మ్ముతాడు. ఆ ఇద్దరి మ‌ర‌ణాల వెన‌క కార‌ణాల్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి విష‌యాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మ‌హ‌త్య చేసుకుందా లేక హ‌త్య‌నా?ఈ ప‌రిణామాల వెన‌క బాక్ అనే దుష్ట‌శ‌క్తి ప్ర‌మేయం ఏమిటి? త‌న చెల్లెలు మ‌ర‌ణానికి కార‌కులైన‌ వాళ్ల‌పై శివ‌శంక‌ర్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

Read More
Next Story