బాహుబలి ఎదుర్కోవాల్సిన  విలన్ రానా కాదు ..మరి?
x

'బాహుబలి' ఎదుర్కోవాల్సిన విలన్ రానా కాదు ..మరి?

రానా కాదు… తుపాన్!

సాధారణంగా తుపాన్ అంటే మనం ప్రకృతిలోని ఒక రౌద్ర రూపం అని భావిస్తాం. కానీ సైక్లోన్ మోంథా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సినిమా రంగం మీద చూపిస్తున్న ప్రభావం చూస్తే, ఇది కేవలం వాతావరణ పరిణామం కాదు — ఇది ఎకానమిక్ మరియు కల్చరల్ డిజ్రప్షన్ కూడా అని అర్దమవుతోంది.

భారత వాతావరణ శాఖ (IMD) ఇచ్చిన హెచ్చరికలతో, సాయంత్రం కాకినాడ సమీపంలో తుపాన్ భూమిని తాకబోతోందని అధికారికంగా వెల్లడైంది. వెంటనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లను మూసివేయమని ఆదేశించింది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు విరుచుకుపడే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లను ఈరోజు మూసివేసింది. సైక్లోన్ ప్రభావం తగ్గిన తర్వాతే థియేటర్లు తిరిగి తెరవాలి, అది ఎప్పుడు అనే నిర్ణయం తర్వాత తీసుకోనున్నారు అధికారులు.

ఇది కేవలం సేఫ్టీ మేజర్ కాదు — ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ లాస్ కి దారితీస్తుంది. ఒక రోజు థియేటర్లు మూసివేయడం అంటే స్క్రీన్లు షట్ డౌన్,

కోట్ల లాస్ (డిస్ట్రిబ్యూటర్ల అంచనా ప్రకారం), అలాగే ఆ రోజు పని కోల్పోయిన సిబ్బంది — టికెట్ చెకర్లు, కౌంటర్ సిబ్బంది, క్లీనర్లు, స్నాక్ వెండర్స్ ఇబ్బంది. అంటే ఇది కేవలం స్టార్ హీరోల ఫిల్మ్ బిజినెస్ కు మాత్రమే దెబ్బ కాదు. ఇది గ్రాస్‌రూట్ ఎకానమీకి దెబ్బ.

ప్రస్తుత రన్‌లో ఉన్న చిత్రాల పరిస్థితి

థియేటర్ల మూతతో కిరణ్ అబ్బవరం నటించిన K Ramp, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన Dude వంటి చిత్రాల బాక్సాఫీస్ రన్‌కి పెద్ద షాక్ తగిలింది. ‘K Ramp’, ‘Dude’ సినిమాలు వర్క్‌డేస్‌లో డీసెంట్‌గా నడుస్తున్నాయి. కానీ ఈ తుపాన్‌ వీటికి అన్‌ప్లాన్డ్ ఇంటర్వెల్ వచ్చింది.ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ ఏరియాస్‌ లు ఎక్కువగా ప్రభావితమవుతాయి.

ఒక రోజు షో ఆగిపోతే అది కేవలం ఆ రోజు నష్టమే కాదు; “బజ్” కోల్పోవడం, వీకెండ్ రీకవరీ తగ్గిపోవడం — ఇవి బాక్సాఫీస్ లైఫ్‌స్పాన్‌ని కుదిస్తాయి.

డిజిటల్ ట్రాన్సిషన్ వేగం పెరుగుతుంది

ఇక కాంతారా: చాప్టర్ 1 ఈ వారాంతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది. ఇది ఒక నారేటివ్ ట్రాన్సిషన్ పాయింట్ —

తుపాన్ వంటి ఫిజికల్ అంతరాయాలు ప్రేక్షకులను మళ్ళీ ఓటీటీ వైపు లాగుతాయి. సైక్లోన్ డేస్‌లో ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వీక్షణలు సడన్‌గా పెరుగుతాయి. అంటే తుపాన్‌ సమయంలో థియేటర్ బిజినెస్ పడిపోతే, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లాభపడతాయి — ఇది సినిమా వ్యాపారంలో సైక్లికల్ షిఫ్ట్.

కొత్త రిలీజ్ లకు దెబ్బ

మరోవైపు ఈ శుక్రవారం విడుదల కానున్న బాహుబలి: ది ఎపిక్ మరియు రవితేజ మాస్ జాత్రా సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి: ది ఎపిక్ కు ఇప్పటికే ఆకట్టుకునే అడ్వాన్స్ బుకింగ్స్ రావగా, మాస్ జాతర టికెట్ బుకింగ్స్ ఈరోజే ప్రారంభం కానున్నాయి. ట్రైలర్‌ ఇప్పటికే మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.

అయితే సైక్లోన్ మోంథా ఈ రిలీజ్ సీజన్‌ని పూర్తిగా డిస్రప్ట్ చేయవచ్చు. థియేటర్లు ఓపెన్ అయ్యే సమయానికి ప్రేక్షకుల మూడ్, ట్రావెల్ సేఫ్టీ, స్క్రీన్ అందుబాటు — ఇవన్నీ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతాయి.

సాధారణంగా సైక్లోన్ లు వచ్చి వెళ్లిన తర్వాత థియేటర్లు తిరిగి తెరవబడతాయి. కానీ ప్రేక్షకుల మైండ్‌సెట్, బాక్సాఫీస్ మొమెంటం తిరిగి వెనక్కి రావటానికి కొంచెం సమయం పడుతుంది. ఈ గ్యాప్‌ లో కొన్ని సినిమాలు రన్‌ లాస్ అవుతాయి,

ఏదైమైనా “మన జీవితాన్నే కాదు... సినిమాకూడా నడిపేది పరిస్థితులే.”ఈ తుపాన్‌ వల్ల ఏపీ బాక్సాఫీస్ ఒక్కసారిగా నిలిచిపోయింది! ఈ సైక్లోన్‌ ప్రభావం సినిమా రంగంపై ఎంతటి దెబ్బ కొడుతుందో చూడాలి!

Read More
Next Story