అదంతా ఫేక్ న్యూస్..  ఆరోగ్యంగానే  ‘బిగ్ బీ’
x
అమితాబ్ బచ్చన్

అదంతా ఫేక్ న్యూస్.. ఆరోగ్యంగానే ‘బిగ్ బీ’

బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యం పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేలింది. ఆయన కులాసాగానే ఉన్నారు.


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయినట్లు వస్తున్న వార్తలు వట్టి పుకార్లే అని తేలింది. ఆయన ఆరోగ్యం గానే ఉన్నట్లు తేలింది. బిగ్ బీ కాలులో రక్తం గడ్డకట్టడం, గుండె రక్తనాళాలు కూడా పూడుకుపోవడం తో ఆంజియో ప్లాస్ట్ కూడా జరిగినట్లు కొద్ది రోజుల క్రితం నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ సామాజిక మాధ్యమాల్లో అమితాబ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్లు పెట్టారు.

ఇలా ఉండగా అమితాబ్ ఆస్పత్రిలో ఉన్నారని సమాచారం బయటకు వచ్చిన కొన్ని గంటల తరువాతనే థానెలో జరిగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. అందులో అమితాబ్ కనిపించారు. దీనితో ఆయన ఆరోగ్యంపై వచ్చిన సమాచారం మొత్తం వదంతులేనని తేలింది. ఓ అభిమాని ఆయన ఆరోగ్యంపై అడిగిన ప్రశ్నకు బిగ్ బీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అంతా బాగున్నట్లు కూడా చేతుల సంజ్ఞలు చేశారు.
అమితాబ్ అనారోగ్యంతో కోకిలా బెన్ ధీరుబాయ్ ఆస్పత్రికి వెళ్లినట్లు నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వార్తలు రావడం ప్రారంభం అయ్యాయి. కొంతమంది యాంజియో ప్లాస్ట్ చేసినట్లు, మరికొంత సాధారణ తనిఖీల కోసం వెళ్లగా కాలుకి ఇన్ ఫెక్షన్ సోకినట్లు తెలిసిందని.. ఇలా రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వదంతులపై అటూ అమితాబ్ కార్యాలయం, ఇటూ ఆస్పత్రి నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు.
ఇదే నిజమనుకుని ట్విట్టర్ లో పలువురు సెలబ్రిటీలు అమితాబ్ త్వరగా కోలుకోవాలని కూడా ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా అమితాబ్ త్వరగా కోలుకావాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇంకొంత మంది దేవుడిని ప్రార్థించారు.
అమితాబ్ బచ్చన్ చివరి సారిగా టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్ మూవీలో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం కల్కిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే రజనీకాంతో నటిస్తున్న వెట్టయన్ చిత్రంలో కూడా నటిస్తున్నారు.


Read More
Next Story