విజయ్ ఆంటోని భద్రకాళి (2025) రివ్యూ
x

విజయ్ ఆంటోని భద్రకాళి (2025) రివ్యూ

రాజకీయాల మర్మాన్ని ఛేదించే కథ!

ఖమ్మం జిల్లాలో అనాథగా పెరిగిన కిట్టు (విజయ్ ఆంటోని) చిన్న వయసులోనే జీవితాన్ని తన పద్ధతిలో మలుచుకున్నాడు. సచివాలయం ముందు కాఫీ అమ్మే స్దాయి నుంచి ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత ప్రభావవంతమైన పవర్ బ్రోకర్ గా ఎదుగుతాడు.

ట్రాన్స్‌ఫర్స్ నుంచి టెండర్లు వరకు, రాజకీయ నేతల వద్ద ఇరుక్కున్న డబ్బుల వరకు – అసాధ్యాన్ని సులభం చేసే శక్తి కిట్టుకే. ఇంతవరకు కేవలం ఒక మధ్యవర్తి మాత్రమే అనుకున్న అతడు, ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని బయటపడినప్పుడు, రాష్ట్ర రాజకీయాలే కదిలిపోతాయి.

ఇదే సమయంలో ఎంట్రీ ఇస్తాడు పారిశ్రామికవేత్త, వ్యూహకర్త అభయంకర్ శంకర్ (సునీల్ కృపాలనీ). రాష్ట్రపతి కావాలనుకున్న అతడి కలలపై కిట్టు నీడలా మారతాడు. కానీ ఈ ఇద్దరి మధ్య పగ ఎందుకు మొదలైంది? అక్కడ నుంచి ఏమైంది... కిట్టు నిజంగా ఎవరిని కాపాడుతున్నాడు? ఎవరికోసం ఈ పవర్ గేమ్ ఆట ఆడుతున్నాడు? అతను సంపాదించిన వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి?

అసలు కిట్టు లక్ష్యం ఏమిటి..అతను కేవలం ఒక బ్రోకరేనా? లేక అతడే మొత్తం రాజకీయ ఆటను నియంత్రిస్తున్న అసలు మాస్టర్‌మైండా? అభయంకర్‌ – ఒక వ్యూహకర్తనా? లేక ఒక పెద్ద యత్నానికి బలి అయిపోయిన వాడా? ఆ 6,000 కోట్ల రూపాయల వెనకున్న కథ ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

“పాలిటిక్స్ ఈజ్ షోబిజ్ ఫర్ అగ్లీ పీపుల్” – పాల్ బేగాలా (అమెరికా పొలిటికల్ స్ట్రాటజిస్ట్)

అన్న ఈ కామెంట్ ను గుర్తు తెప్పించే విధంగా అరుణ్ ప్రభు తెరకెక్కించిన భద్రకాళి , ప్రస్తుత రాజకీయాల వెనుక నడిచే సీక్రెట్ లాబీయింగ్ గేమ్‌ని చూపించే డ్రామా లా అనిపిస్తుంది.

కేంద్ర మంత్రి భూముల వ్యవహారం, ఓ ఎమ్మెల్యే హత్య, టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు – ఇవన్నీ కలిపి ఫస్ట్ హాఫ్‌కి సరైన టెన్షన్‌ని ఇస్తాయి. ఫస్టాఫ్ చివరలో పెట్టిన ట్విస్ట్ – “కిట్టు చేతుల్లో నిజంగా ఎంత శక్తి ఉంది?” అనే ప్రశ్నను రేపుతుంది. ఇక్కడ వరకు సినిమా బాగానే ఇంటెన్స్ తో నడుస్తుంది.

కథ మొదలయిన 15 నిమిషాల్లోనే కిట్టు ఎంత పవర్ ఉన్నాడో చూపడం బలంగా ఉంది. కిట్టు చేసే ప్రతి డీల్ అతని అసలు శక్తిని చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కాన్ఫ్లిక్ట్ క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు – కిట్టు vs అభయంకర్. కానీ సెకండ్ హాఫ్‌లో ఈ కాన్ఫ్లిక్ట్ డిబేట్ కన్నా మెలోడ్రామా వైపు వెళ్లినట్లు కనిపిస్తుంది.

అలాగే ఫస్ట్ హాఫ్ రాపిడ్ ఫైర్‌లా నడుస్తే, సెకండ్ హాఫ్‌లో లీనియర్ నారేషన్ వల్ల పేస్ తగ్గింది. అలాగే కిట్టు క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా ఆర్క్ కలిగి ఉన్నప్పటికీ, అభయంకర్ లక్ష్యం – రాష్ట్రపతి కావడం – కాస్త ఓవర్ సింప్లిఫైడ్‌గా అనిపించింది.

ఇంటర్వెల్ వరకు ఉన్న పాలిటికల్ చెస్ గేమ్ ‌ని, సెకండ్ హాఫ్ కొనసాగిస్తుందా అన్న అంచనాలు పెరుగుతాయి. కానీ ఇక్కడే అరుణ్ ప్రభు కొంచెం “రొటీన్ ప్యాటర్న్” వైపు మళ్ళాడు. కిట్టు ఫ్లాష్‌బ్యాక్ ఊహించిందేలా ఉంటుంది. అభయంకర్‌ (సునీల్ కృపాలనీ) రాష్ట్రపతి కావాలనే ఆతృత, కిట్టు అడ్డుకోవాలనుకున్న ఉద్దేశ్యం – ఇవన్నీ ప్రెజెంట్ చేసిన తీరు లోతు ఉన్నా, కొత్తదనం కొంచెం తక్కువగా అనిపిస్తుంది.

క్లైమాక్స్‌లో సుదీర్ఘ సీక్వెన్స్‌తో థ్రిల్ ఇచ్చినా… “ఎడిటింగ్‌లో కాస్త టైట్‌గా కుదించి ఉంటే మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది” అనిపిస్తుంది.

టెక్నికల్ గా..

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పొలిటికల్ టెన్షన్‌ని రీన్‌ఫోర్స్ చేసింది., సినిమాటోగ్రఫీ – ముఖ్యంగా సచివాలయం లోపల తీసిన లైటింగ్ షాట్స్, రాజకీయాల వెనుక సీక్రెసీని విజువల్‌గా ఎస్టాబ్లిష్ చేశాయి. ఎడిటింగ్ – ఫస్ట్ హాఫ్ పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేసినా, సెకండ్ హాఫ్‌లో డ్రాగ్ ఫీల్ ఇచ్చింది.

చూడచ్చా

పొలిటికల్ థ్రిల్లర్స్ ఆసక్తి ఉన్న వాళ్లు ఓ లుక్కేయచ్చు. కొత్తగా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.

ఫైనల్ ధాట్

భద్రకాళి ఒక విభిన్నమైన పొలిటికల్ థ్రిల్లర్. ఇది సాధారణ మాస్ కమర్షియల్ కాదు , ఇది రాజకీయాల వెనుక ఉన్న డీల్స్, లాబీయింగ్, మరియు “బ్రోకర్ పాలిటిక్స్” ని సంక్లిష్టంగా చూపించే ప్రయత్నం. కానీ ఈ క్లిష్టత వల్లే కొంతమందికి ఇది గందరగోళంగా అనిపించవచ్చు. థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే, పొలిటికల్ సబ్‌టెక్స్ట్‌లలో మునిగిపోవాలనుకునే ప్రేక్షకుల కోసం ఇది ఒక మంచి అనుభవం. కానీ సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్లేవారికి రెండో అర్థం ఛాలెంజ్ గా అనిపించవచ్చు.

Read More
Next Story