
2025లో టాలీవుడ్‌ను కుదిపేసిన చిన్న సినిమాలు
పెద్ద హీరోలకు డేంజర్ బెల్లా?
స్టార్ హీరోలు లేరు… భారీ బడ్జెట్‌లు లేవు… అయినా థియేటర్లలో హౌస్‌ఫుల్స్!
“చిన్న సినిమా పెద్ద విజయం అవుతుందా?” అనే ప్రశ్నకు 2025 స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది సింగిల్ డిజిట్ కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ను షాక్‌కు గురి చేశాయి. ముఖ్యంగా మూడు సినిమాలు మాత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టి టాలీవుడ్ దృష్టిని పూర్తిగా తమ వైపు తిప్పుకున్నాయి.
ఒక మంచి కథ, సరైన టార్గెట్ ఆడియన్స్, స్మార్ట్ ప్రమోషన్ ఉంటే చిన్న సినిమా కూడా ఇండస్ట్రీని షేక్ చేయగలదు అన్న నిజాన్ని 2025 మరోసారి నిరూపించింది. ఈ ఏడాది సింగిల్ డిజిట్ కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూడు తెలుగు సినిమాలు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టి ట్రేడ్‌ను షాక్‌కు గురి చేశాయి.
ఇవి కేవలం హిట్స్ మాత్రమే కాదు… నిర్మాతలకు భారీ లాభాలు, కొత్త టాలెంట్‌కు బలమైన గుర్తింపు, టాలీవుడ్‌కు సేఫ్ బిజినెస్ మోడల్
2025లో “చిన్న సినిమా – పెద్ద విజయం” కి బ్రాండ్‌గా నిలిచిన మూడు సినిమాలు ఇవే… నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ‘Court’ ఈ ఏడాది అతి పెద్ద సర్ప్రైజ్ హిట్‌గా నిలిచింది. ప్రియదర్శి, శివాజీ లాంటి నటుల బలమైన పర్ఫార్మెన్స్‌లు, కోర్ట్‌రూమ్ డ్రామా కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు లాగాయి. మౌత్ టాక్‌తో సినిమా రోజురోజుకీ పుంజుకుని భారీ లాభాలు తెచ్చింది.
1. కోర్ట్ – నాని నమ్మకం వృథా కాలేదు!
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ‘Court’ ఈ ఏడాది అతి పెద్ద సర్ప్రైజ్‌లలో ఒకటి. ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ కోర్ట్ డ్రామా… కంటెంట్ పవర్‌తో థియేటర్లను నింపింది మౌత్ టాక్‌తో కలెక్షన్లను దూసుకెళ్లింది
భారీ బడ్జెట్ అవసరం లేకుండా… బలమైన కథ, పర్ఫార్మెన్స్‌లతోనే బాక్సాఫీస్‌ని జయించవచ్చని ‘Court’ ప్రూవ్ చేసింది. నిర్మాతలకు వచ్చిన లాభాలు ట్రేడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.
2. లిటిల్ హార్ట్స్ – జెన్ జీ గుండెల్లో నిలిచిన చిన్న ప్రేమకథ
ETV Win నుంచి వచ్చిన యూత్‌ఫుల్ అటెంప్ట్ ‘Little Hearts’ అసలు స్లో పాయిజన్‌లా పనిచేసింది. మౌళి, శివాని జంటగా నటించిన ఈ సినిమా…మొదట నిశ్శబ్దంగా రిలీజ్ అయింది. క్రమంగా యువతలో వైరల్ అయ్యింది. చివరికి లాభాల బాట పట్టింది
స్ట్రిక్ట్ బడ్జెట్ + స్మార్ట్ ప్రమోషన్ + కనెక్ట్ అయ్యే కంటెంట్ ఈ మూడు కలిసి ‘Little Hearts’ను విజేతగా నిలబెట్టాయి.
3. రాజు వెడ్స్ రాంబాయి – క్లైమాక్స్‌తో రచ్చ చేసిన సినిమా
ఇంకో ETV Win సర్ప్రైజ్… ‘Raju Weds Rambai’. రియలిస్టిక్ ట్రీట్మెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా… థియేటర్లలో నాలుగు వారాలు స్టెడీగా నడిచింది. క్లైమాక్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరగేలా చేసింది
చిన్న సినిమా అయినప్పటికీ… టాక్ పవర్‌తో కలెక్షన్లు సాధించి, డిస్ట్రిబ్యూటర్లను కూడా లాభాల్లోకి తీసుకొచ్చింది.
చిన్న సినిమాలు నిలబడితే… ఇండస్ట్రీకి ఎందుకు లాభం?
ఈ మూడు సినిమాల విజయం కొన్ని విషయాలని ఇండస్ట్రీకి క్లియర్‌గా చెబుతున్నాయి.
* భారీ రిస్క్ లేకుండా బిజినెస్ చేయొచ్చు
* కొత్త కథలు, కొత్త నటులకు అవకాశం పెరుగుతుంది
* నిర్మాతలకు సేఫ్ జోన్ ఓపెన్ అవుతుంది
* టాలీవుడ్‌కు కంటెంట్ ఆధారిత గుర్తింపు బలపడుతుంది
చిన్న సినిమాల సక్సెస్… టాలీవుడ్‌ని ఎలా మార్చేస్తోంది?
స్టార్ ఇమేజ్, భారీ బడ్జెట్ లేకుండానే థియేటర్లు నిండుతున్నాయంటే… అది కేవలం ఒక సినిమా విజయం కాదు. చిన్న సినిమాల సక్సెస్ అంటే మొత్తం సినిమా పరిశ్రమ దిశ మారుతోందన్న సంకేతం. మొదటగా, నిర్మాతల ఆలోచనా విధానం మారుతుంది. ఇప్పటివరకు భారీ బడ్జెట్ అంటేనే సేఫ్ అనుకున్న ట్రేడ్… ఇప్పుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఎలా సాధ్యమో చూడటం మొదలుపెట్టింది. చిన్న సినిమాలు హిట్ అయితే రిస్క్ తగ్గుతుంది, ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది.
రెండోది, కొత్త కథలకు, కొత్త దర్శకులకు ద్వారాలు తెరుస్తుంది. స్టార్‌ల డేట్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసే పరిస్థితి లేకుండా, కథ బలంగా ఉంటే వెంటనే సినిమా మొదలుపెట్టే ధైర్యం నిర్మాతలకు వస్తుంది. దీని వల్ల టాలీవుడ్‌లో కొత్త వాయిస్‌లు వినిపించటం మొదలవుతుంది. మూడోది, నటీనటుల ఎంపికలో మార్పు. స్టార్ ఇమేజ్ కన్నా పాత్రకు సరిపడే నటుడిని తీసుకోవాలన్న ఆలోచన పెరుగుతుంది. ప్రియదర్శి లాంటి నటులకు పెద్ద అవకాశాలు రావడానికి ఇదే కారణం. నాలుగోది, థియేటర్ ఎకానమీకి బూస్ట్. చిన్న సినిమాలు తక్కువ స్క్రీన్‌లతో రిలీజ్ అయినా, టాక్ బాగుంటే క్రమంగా షోస్ పెరుగుతాయి. దీనివల్ల ఎగ్జిబిటర్లకు స్థిరమైన ఆదాయం వస్తుంది, ఖాళీ థియేటర్లు తగ్గుతాయి.
ఏదైమైనా చిన్న సినిమాల సక్సెస్ అయితే ఇండస్ట్రీలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది. వివిధ రంగాల వారు ఎందరో ఈ పరశ్రమపై దృష్టి పెడతారు. పెట్టుబడులు పెరుగుతాయి. రిస్క్ తగ్గి, క్రియేటివిటీ పెరుగుతుంది, కంటెంట్ ఆధారిత టాలీవుడ్‌కు బలమైన గుర్తింపు వస్తుంది. స్టార్‌లు హైప్ తెస్తారు… కానీ ఇండస్ట్రీని నిలబెట్టేది మాత్రం కథ ఉన్న చిన్న సినిమాల విజయం.
అందుకే 2025లో ఎన్నో చిన్న సినిమాలు రిలీజ్ అయినా… నిజంగా లాభాలు చూసినవి మాత్రం ‘కోర్ట్’, ‘లిటిల్ హార్ట్స్ ’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే. ఇవి కేవలం సినిమాలు కాదు…టాలీవుడ్ ఫ్యూచర్‌కు దారి చూపిన ఉదాహరణలు. చిన్న సినిమా… కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దది!

