
షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్
ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో ప్రమాదం
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్‌ఖాన్ గాయపడ్డారు. ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో స్టంట్ చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో ఈ ప్రమాదం జరిగింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. షారుక్ ఖాన్ ఆయన కూతురు సుహానా ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్ నిలిపేసి..మెరుగైన వైద్యం కోసం షారుక్ ఖాన్‌ను ఆయన టీం అమెరికాకు తీసుకెళ్లారు. షారుఖ్ కండరాలకు తీవ్రంగా గాయం అయినట్లు సమాచారం. అయితే అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. షారుఖ్ గతంలోనే కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డారు. అందుకోసం చికిత్స కూడా తీసుకున్నారు. ఇటీవల పఠాన్, జవాన్, డుంకీ చిత్రాలు షారూఖ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.
Next Story