బాలీవుడ్ కింగ్ బాద్షానే
x
షారుక్ ఖాన్ బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ కింగ్ బాద్షానే

స్లిమ్ గా ఉండి ట్రిమ్ చేసుకుని డాన్ గా మారి కామెడీ చేశాడు, మీనమ్మ కోసం చెన్నై ఎక్స్ ప్రెస్ ఎక్కి లుంగీ కట్టాడు. ఓ కైక పాన్ బనారస్ వాలా అంటూ ‘ప్యాన్స్’ తో సీటి కొట్టించాడు. హిట్ కోసం జీరోలా మారాడు. చివరకు పఠాన్ తో బాక్సాపీస్ లో షేక్ చేశాడు. జవాన్ తో దుమ్ముదులిపాడు. డుంకీ తో ఇండియానే షేక్ చేయాలనే చూస్తున్నాడు. ఈ ఉపొద్ఘాతాలు అన్నీ ఎవరి కోసమే ఈసరికే మీకు అర్ధం అయి ఉంటుంది. మీరనుకుంటున్నది నిజమే బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ గురించే ఇదంతా.. కింగ్ ఖాన్ గురించి ఇప్పడే ఎందుకు చెప్పుకోవాలి అంటే ...మరోసారి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ యాక్టర్ గా నిలిచి సత్తాచాటాడు కాబట్టి


ఇండియాలోనే మోస్ట్ పాపులర్ యాక్టర్ గా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నిలిచారు. తాజాగా ఐఎండీబీ ప్రకటించిన ర్యాంక్ లలో నెంబర్ వన్ గా నిలిచారు. అలియా భట్, దీపికా పదుకొణె, వామికా లాంటి తారలు ఆధిపత్యం వహించే ఐఎండీబీలో కింగ్ ఖాన్ నెంబర్ వన్ గా నిలవడం గమనార్హం. షారుక్ ఈ సంవత్సరం రెండు సినిమాల్లో నటించారు.

మొదట పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుక్, తరువాత అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ తో హిట్ అందుకున్నారు. ఇలా వరుస విజయాలతో షారుక్ నెంబర్ స్థానాన్ని అందుకున్నారు. ఈ సంవత్సరం చివర బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వంలో రానున్న డుంకీలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తరువాత షారుక్ పాపులారీటి మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ జాబితాలో వరుసగా రెండో సంవత్సరం రెండో స్థానంలో నిలిచారు బాలీవుడ్ నటి అలియాభట్. ఈ సంవత్సరం అలియా‘ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహనీ’తో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే హలీవుడ్ నటుడు గాల్ గాడోట్ తో కలిసి నటించిన థ్రిల్లర్ మూవీ ‘హర్ట్ ఆఫ్ స్టోన్’ తో అలియా గ్రాండ్ గా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇది నెట్ ప్లిక్స్ లో ప్రసారం అయింది.

పఠాన్, జవాన్ సినిమాల్లో సైతం అలియా అతిథి పాత్రల్లో తళుక్కున మెరిసింది. అలాగే కింగ్ ఖాన్ తో జవాన్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి కూడా ఈ జాజితాలో చోటు సంపాదించుకున్నారు. కాగా, ఈ జాబితాలో నయన్ ఐదు , విజయ్ సేతుపతి పదవ స్థానంలో ఉన్నారు.

నయనతార తరువాత వరుసగా తమన్నా, కరీనా, శోభిత ధూళిపాళ్ల ఉన్నారు. వీరు కూడా ఓటీటీ ఫ్టాట్ ఫాం లో మంచి విజయాలు అందుకున్నారు. ఈజాబితాలో అక్షయ్ కుమార్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. అక్షయ్ ఈ సంవత్సరం ఓమై గాడ్ 2, మిషన్ రాణిగంజ్, సెల్పీ లాంటి సినిమాల్లో కనిపించాడు.

రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో కింగ్ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కడం, అలియా భట్ హలీవుడ్ ఎంట్రీతో ఐఎండీబీ 2023 ప్రకటించిన జాబితాలో తిరిగి మొదటి రెండు స్థానాల్లో నిలవడానికి కారణంగా ఐఎండీబీ ఇండియా హెడ్ యామినీ పటోడియా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐఎండీబీ పేజీని అభిమానులు సందర్శించిన సంఖ్య ఆధారం గా ఈ ర్యాంక్ లు ప్రకటించినట్లు వెల్లడించారు.

కాగా, ఐఎంబీడీ జాబితాలో తనకు రెండో స్థానం దక్కడం పై బాలీవుడ్ తార అలియా భట్ స్పందించారు. తన ‘డియర్ జిందగీ ’సహనటుడు షారుక్ తరువాత రెండో స్థానంలో నిలవడంపై తన అభిమానులకు ధన్యావాదాలు తెలిపారు. మీరు నిజమైన నెంబర్ వన్లు అంటూ కొనియాడారు. మీ ప్రేమ, అభిమానం వల్లె నేను ఉన్నత స్థితికి చేరుకున్నాని అన్నారు.

Read More
Next Story