బొమన్ ఇరానీ  ది మెహతా బాయ్స్ ఓటిటి  మూవీ రివ్యూ!
x

బొమన్ ఇరానీ 'ది మెహతా బాయ్స్' ఓటిటి మూవీ రివ్యూ!

బొమన్ ఇరాని నటుడుగా, దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా 'ది మెహతా బాయ్స్'. ఈ సినిమా ఎలా ఉంది, తొలి చిత్రానికి బొమన్ ఎంచుకున్న కథేంటి తెలుసుకుందాం.

అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కల్యాణ్‌కు తాతగా కనిపించిన బొమన్ ఇరానీ చాలా కాలం గుర్తిండిపోతాడు. బాలీవుడ్ లోనూ ఆయనకు నటుడిగా మంచి వాల్యూ ఉంది. స్ట్రాంగ్ ఫెరఫార్మన్స్ లు ఇస్తూ .. బరువైన పాత్రలను పోషించడంలో అయన్ని మించిన వారు లేరు. అలాంటి బొమన్ ఇరాని నటుడుగా, దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా 'ది మెహతా బాయ్స్'. ఓటీటీలో రిలీజ్ చేస్తూ తెలుగులోను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది, అసలు బొమన్ ఇరానీ తన తొలి చిత్రానికి ఎంచుకున్న కథేంటి వంటి విషయాలు చూద్దాం.

కథేంటి

శివ్ మెహతా (బొమన్ ఇరాని) కి ఇద్దరు పిల్లలు. ఆయన తన భార్యతో కలిసి తనకు ఇష్టమైన క్రికెట్ ఆడుకుంటూ సొంత ఊళ్లో ప్రశాంత జీవనం గడుపుతూంటాడు. ఆయన కూతురు అనూ (పూజ సరూప్) అమెరికాలోనూ, కొడుకు అమయ్ (అవినాశ్ తివారి) ముంబైలో ఒక సంస్థలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఎవరి జీవితాల్లో ,ప్రేమల్లో , ఫ్యామిలీల్లో వాళ్లు బిజీగా ఉంటారు. అయితే ఓ రోజు శివ్ మెహతా భార్య చనిపోతుంది. తల్లి మరణవార్త వినగానే కొడుకు అమయ్ 'ముంబై' నుంచి తన సొంతూరికి వెళతాడు.

అక్కడ దిన కార్యక్రమాలు పూర్తయిన తరువాత ముంబైకి బయల్దేరతాడు. మరో ప్రక్క తండ్రి ఒంటిరి వాడైపోయాడనే ఫీలింగ్ ఉంటుంది. దాంతో తండ్రిని తీసుకుని అమెరికా వెళ్లాలని కూతురు అనూ భావిస్తుంది. ఆ ఏర్పాట్లను పూర్తిచేస్తుంది. అయితే ఆ ఇంటినీ .. భార్య జ్ఞాపకాలను వదిలి వెళ్లడం ఆయనకి ఇష్టం ఉండదు. అలాగే తనకు ఇష్టమైన క్రికెట్ ఆటను వదిలేయనని చెప్తాడు. కానీ తప్పదు.

దాంతో అమెరికా ప్రయాణానికి రెడి అయ్యిన తరువాత, కొడుకు అమయ్ తో పాటు ఆయన ముంబైలో రెండు రోజులపాటు ఉంటాడు. అక్కడ నుంచి జనరేషన్ గ్యాప్ వలన సమస్యలు మొదలవుతాయి. తండ్రి,కొడుకుల ఆలోచనలు, అభిప్రాయాలు ఎక్కడా కలవవు. ఇద్దరూ ఎడ్జెస్ట్ అయ్యే రకాలు కావు. అప్పుడు ఏం జరిగింది. కొడుకు ఏమన్నారు. ఆ తండ్రి అమెరికా వెళ్లాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

కొన్ని నిత్య జీవితంలో చూసే ఎమోషన్స్ కలిపి కథ అల్లుకుని సీన్స్ కలిపి రెడీ చేసిన సినిమా ఇది. భార్య దూరమైన ఒక భర్త ఒంటిరివాడై తన భావాలను ఇష్టపడని కొడుకు దగ్గర ఉండవలసి వస్తే ఎలా ఉంటుందనేది ఈ కథ లో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేసారు. అయితే పాయింట్ గా ఎమోషనల్ గా అనిపించవచ్చేమో కానీ కనెక్ట్ చేయలేకపోయింది. అయినా మొత్తం ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన రిలేషన్ ఏమిటి? అంటే తండ్రి- కొడుకు అనటంలో ఏ సందేహం లేదు. ఒకరికోసమే మరొకరు ఉన్నట్లుంటారు కానీ ఎవరికి వారే ఎమునా తీరే. ఒకరి ఆలోచనలు, అభిప్రాయాల్లో వేలు పెట్టనంతవరకూ ఇద్దరూ హ్యాపీ.

అయితే మొండి పట్టుదలగల తండ్రి, మరింత మొండి కొడుకు మధ్య మాత్రం అభిప్రాయ బేధాలు వస్తే అవి సెట్ అవటం చాలా కష్టం. అదే ఈ కథలో దర్శకుడుగా బొమన్ ఇరానీ చెప్పదలుచుకున్నది. ఎన్నో కుటుంబాల్లో కనపడే కథే ఇది. ఇలాంటి కథలో బొమన్ ఇరాన్ దర్శకుడుగా తెరంగ్రేటం చేయటం గొప్ప విషయమే అయినప్పటికీ ఓటిటి లో చూడటానికి కూడా భారంగా అనిపించేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసి కథను నడిపించారు.

కథలో కాంప్లిక్ట్స్ ఉన్నా అది సన్నని లేయర్ లా ఉంటుంది. ఎమోషన్ తో సినిమాను లాక్కెళ్లాలని దర్శకుడు తాపత్రయం. అయితే సినిమా మొత్తం ఎక్కడా ఎలాంటి కుదుపు లేకుండా ఒకటే విషయం చెప్తూ పోతూ వెళ్తే చూసేవారికి ఎంత ఇబ్బంది. అనుభవం ఉన్న బొమన్ ఇరాని ఇది గ్రహించలేకపోయారు. నేటి మోడ్రన్ ప్రేక్షకుడి పల్స్ పట్టుకోలేకపోయారు. తను చూసిందో, తన కుటుంబాల్లో నడిచేదో చెప్పాలనే తాపత్రయం ఆయన్ను సినిమా టెక్ అనుభవం ఇవ్వనివ్వకుండా అడ్డుపడింది. సినిమా ప్రిమేజ్ సెట్ చేయటానికే టైమ్ తీసుకున్న ఆయన ఆ తర్వత కూడా కథనాన్ని పరుగెత్తించలేక విసుగించేసారు.

టెక్నికల్ గా చూస్తే

దర్శకుడుగా బొమన్ ఇరాని తొలి చిత్రం అనుకున్నంత గొప్పగా లేదు. పరిమిత బడ్జెట్ లో చేసిన ఈ సినిమా కాస్టలీ షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అలాగే మిగతా డిపార్టమెంట్స్ కూడా సోసో గా లాగేసారు. ఏదీ అప్ టు మార్క్, అద్బుతం అన్నట్లు లేవు. స్క్రిప్టు దశలోనే సినిమా నీరశపడటంతో మిగతావేమీ సపోర్ట్ చేయలేదు.

చూడచ్చా

కొంత ల్యాగ్ , స్లోగా నడిచే కథనం భరించగలిగితే ఫ్యామిలీతో కూర్చుని ఓ సారి చూడచ్చు.

ఎక్కడుంది

అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో తెలుగులో ఉంది

Read More
Next Story