
రీ–రిలీజ్‌కు వారం ముందు OTT నుంచి బాహుబలి తొలగింపు!!
యాదృచ్ఛికమా? లేక స్ట్రాటజీనా?
భారత సినిమా చరిత్రనే మార్చేసిన బాహుబలి(Baahubali) రెండు భాగాలూ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రాలు, ఆ తర్వాత OTTలో కూడా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకున్నాయి. అటువంటి బ్లాక్‌బస్టర్ యూనివర్స్ ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అందుకు కారణం రీరిలీజ్. అయితే ఈ సినిమా రీరిలీజ్ ల కాకుండా.. ఓ స్ట్రెయిట్ మూవీ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాను రీరిలీజ్‌ల కాకుండా.. ఓ స్టాండ్ ఎలోన్ మూవీగా ప్రేక్షకులకు పరిచయం చేయాలి అనుకుని రీరిలీజ్ పనులు చేస్తున్నారు. కొన్ని వందల సార్లు చూసిన ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూసినప్పుడు కూడా.. ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అయ్యేలా చేయబోతున్నారట దర్శకుడు. ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ దీనిని భారీ రేంజ్ లో సెలెబ్రేట్ చేయబోతున్నారు. దాంతో అందరి దృష్టీ బాహుబలి రెండు పార్ట్ లపై పడింది. వారు దాన్ని మరోసారి చూడాలనున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ పడింది.
తాజాగా Netflix నుంచి రెండు బాహుబలి భాగాలు అకస్మాత్తుగా తొలగించబడ్డాయి. ఇదంతా ఎందుకు? అనేది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇది కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీలా అనిపించినా, టైమింగ్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే, ఇదే సమయానికి రాజమౌళి(Rajamouli) బాహుబలి: ది ఎపిక్ అనే రీకట్ వెర్షన్‌ను అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. దాంతో కేవలం స్ట్రీమింగ్ రైట్స్ ఎక్స్‌పైర్ అయ్యాయా? లేక రాజమౌళి ప్లాన్ చేసిన మాస్టర్ స్ట్రోక్‌నా అన్న ప్రశ్న అభిమానులను కుతూహలానికి గురి చేస్తోంది.
ప్లాన్‌డ్ స్ట్రాటజీనా?
ఇండస్ట్రీ వర్గాల విశ్లేషణ ప్రకారం, ఇది కేవలం టెక్నికల్ కారణం కాదని అంటున్నారు. బహుశా OTT నుంచి తొలగించడం ద్వారా థియేటర్ రీ-రిలీజ్ కోసం ఫ్యాన్స్‌లో ఎక్స్క్లూజివిటీని క్రియేట్ చేసే ప్రయత్నం కావచ్చని చెబుతున్నారు.
సినిమాను ఇప్పటికే చూసిన వారు కూడా, కొత్తగా రీకట్ చేసిన విజువల్స్, ఎప్పుడూ చూడని సీన్స్ కోసం థియేటర్‌కి రాక తప్పదు. OTTలో అందుబాటులో ఉంటే, థియేటర్ వెర్షన్‌కి అదే హైప్ రాకపోవచ్చు.
హైప్ బిల్డప్ అండ్ మార్కెటింగ్ మాస్టరీ
రాజమౌళి తన సినిమాలను కేవలం కంటెంట్ కోణంలోనే కాక, ఎలా ఈవెంట్‌గా మార్చాలో బాగా తెలిసిన దర్శకుడు. ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు కేవలం రీ-రిలీజ్ కాదు, మళ్లీ ఒక పెద్ద సినీ ఈవెంట్ గా ప్రెజెంట్ చేస్తున్నారు.
ఇక ఇతర OTT ప్లాట్‌ఫార్ముల నుంచి కూడా బాహుబలి మాయమైతే, ఇది ఒక వెల్ ప్లాన్‌డ్ మార్కెటింగ్ మాస్టర్‌స్ట్రోక్ అని ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ రెండూ అంగీకరించే పరిస్థితి వస్తుంది.
ఇక మరో సీక్రెట్ ఏమిటంటే — రాజమౌళి ప్రస్తుతం బాహుబలి: ది ఎపిక్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ‘ది బిగినింగ్’ + ‘ది కన్క్లూజన్’ కలిపిన స్పెషల్ రీకట్ వెర్షన్ ఈ నెల అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన విజువల్స్, అదనంగా కొన్ని ఎప్పుడూ చూడని సీక్వెన్స్‌లు కూడా ఉండనున్నాయట.
అంటే, OTT నుంచి బాహుబలి మాయమవ్వడమే ఫ్యాన్స్‌ని మళ్లీ బిగ్ స్క్రీన్‌కి లాగడానికి రాజమౌళి వేసిన గేమ్ ప్లానా?... ఇప్పుడు అందరి ఆలోచనలు ఒకే ప్రశ్నపై: "మిగిలిన ఇతర OTTల నుంచి కూడా బాహుబలి మాయమవుతుందా?" అలా జరిగితే ఇది క్లియర్ సిగ్నల్ – రాజమౌళి రీ-రిలీజ్ హైప్ కోసం మాస్టర్ స్ట్రోక్ వేసినట్లే అని!
ఏదైమైనా ఓ సినిమాను పక్కా ప్లానింగ్ తో తీయాలన్నా , ప్రోమోట్ చేయాలన్నా , రికార్డ్స్ కొల్లగొట్టాలన్నా రాజమౌళి తర్వాతే ఎవరైనా అనేది మరోసారి ఈ సంఘటనతో ప్రూవ్ కాబోతోంది. ఇప్పుడు రీరిలీజ్ లోను రాజమౌళి తన మార్క్ ను సెట్ చేసేలా ఉన్నాడు. సహజంగా రీరిలీజ్ లంటే దర్శక నిర్మాతలు ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఇంటర్వ్యూస్ పెట్టి సినిమాను రీరిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళి దానికి కాస్త భిన్నంగా చేస్తున్నారు. క్యాస్టింగ్ , టెక్నీకల్ టీంతో కొన్ని ఇంటర్వ్యూస్ షూట్ చేశారు.
ఘాటీ ప్రమోషన్స్ కే రాని అనుష్క ఇప్పుడు బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కు ఇంటర్వూస్ ఇచ్చిందని వినపడుతోంది. అలాగే ప్రభాస్, రానా, సత్యరాజ్, రామకృష్ణ తదితరుల ప్రోగ్రాంస్ తో పాటు మేకింగ్ వీడియోస్ ను రిలీజ్ చేయనున్నారట. ఇలా దీనికోసం రాజమౌళి అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారట. అక్టోబర్ 31 విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఫైనల్‌గా బాహుబలి తొలగింపును కేవలం యాదృచ్ఛికం అనుకోవాలా? లేక రాజమౌళి ఆడియెన్స్‌ని మళ్లీ బిగ్ స్క్రీన్‌కి లాక్కెళ్లడానికి వేసిన కేలిక్యులేటెడ్ గేమ్‌నా? జవాబు ఏదైనా కావొచ్చు. కానీ ఒక విషయం స్పష్టం — అక్టోబర్ 31న థియేటర్లలో బాహుబలి: ది ఎపిక్ కోసం ఎదురుచూపులు పీక్‌కి చేరిపోయాయి.