మార్చి భాక్సాఫీస్ : స్టైయిట్ సినిమాలు vsడబ్బింగ్ సినిమాలు, గెలిచేదెవరు?
x

మార్చి భాక్సాఫీస్ : స్టైయిట్ సినిమాలు vsడబ్బింగ్ సినిమాలు, గెలిచేదెవరు?

మార్చి 2025 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది.

మార్చి 2025 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఓటిటి లో వచ్చాక తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి మారుతూ, కంటెంట్ బేస్డ్ సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలకు ప్రయారిటీ బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువ ఉండటం కలిసి వస్తుంది. ఏ మాత్రం బాగుంది అనిపించుకున్నా ఒడ్డున పడిపోతారు. తెలుగు స్టైయిట్ సినిమాల పరిస్దితి అలా కాదు. పూర్తిగా సూపర్ హిట్ టాక్ వస్తేనే బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయి. ఈ క్రమంలో మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోయే స్టెయిట్ , డబ్బింగ్ సినిమాలపై, వాటి విజయావకాశాలపై, వసూళ్లపై ప్రభావంపై ఇప్పుడు చూద్దాం.

మార్చి 2025 లో తెలుగు సినీ పరిశ్రమలో స్ట్రెయిట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఈ నెలలో విడుదలకు సిద్ధమైన కొన్ని ప్రధాన చిత్రాలు:

(i) రాబోయే స్టెయిట్ తెలుగు సినిమాలు:

14 డేస్ (గర్ల్ ఫ్రెండ్ తో ) మార్చి 7

దిల్ రూబా మార్చి 14

కోర్టు మార్చి 14

పెళ్లి కాని ప్రసాద్ మార్చి 21

రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ మార్చి 28

పాజిటివ్ పాయింట్స్:

తెలుగు నేటివిటీ: స్ట్రెయిట్ సినిమాలు మన తెలుగు వారి నేటివికి అనుగుణంగా ఉంటాయి. దాంతో ప్రేక్షకుల హృదయానికి దగ్గరగా ఉంటాయి.

అయితే బలహీనమైన స్టార్ ఫాలోయింగ్: కిరణ్ అబ్బవరం కు ఓపినింగ్స్ అయితే పెద్దగా రావు. టాక్ ని బట్టి పుంజుకుంటాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమా సీక్వెల్ కావటంతో ఇప్పటికే ఓ ఫ్యాన్ బేస్ ఉంది, కాబట్టి ఓపెనింగ్స్ బాగుంటాయి. కోర్ట్ సినిమాకు, రాబిన్ హుడ్ సినిమాకు బాగానే బజ్ అయ్యింది. అయితే ఓపినింగ్స్ గా మారుతుందో లేదో చూడాలి.

నెగటివ్ పాయింట్స్:

పబ్లిసిటి తక్కువ: ప్రస్తుతానికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు పెద్దగా హైప్ లేదు. ఉన్నంతలో ‘మ్యాడ్ స్క్వేర్’కి రీసెంట్ ట్రైలర్ తో బాగా బజ్ క్రియేట్ అయ్యింది. సలార్ కు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. కానీ మొదటి రోజే రీ రిలీజ్ లకు హంగామా.

తక్కువ బడ్జెట్, తక్కువ రిచ్‌నెస్: మార్కెట్ లో పెద్ద బడ్జెట్ సినిమాలు లేనందున, భారీ వసూళ్లు రాబట్టడం కష్టం.

డబ్బింగ్ సినిమాలతో పోటీ: ఇతర ఇండస్ట్రీల నుండి పెద్ద సినిమాలు రావడం వల్ల పోటీ ఎక్కువ.

డబ్బింగ్ సినిమాలు :

మార్చి 7 న ఛావా , కింగ్‌స్టన్, ఆలంబన, ది డిప్లోమెంట్

మార్చి 14 కేసరి వీర్

మార్చి 21 పింటూ కి పప్పీ

మార్చి 27 వీర ధూర సూరన్ పార్ట్ 2

L2: Empuraan

మార్చి 30 సికిందర్

నెగటివ్ పాయింట్స్:

తెలుగు నేటివిటీ లేదు: డబ్బింగ్ సినిమాల్లో పాత్రలు, ఎమోషన్స్ తెలుగువారికి అంతగా కనెక్ట్ కావు.

స్ట్రెయిట్ సినిమాలతో పోటీ: తెలుగు స్టైయిట్ సినిమాలు బాగుంటే, డబ్బింగ్ సినిమాలు అసలు ఆడవు.

తెలుగు ఇండస్ట్రీ పై ప్రభావం: డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా రావడం వల్ల, తెలుగు సినిమా మార్కెట్ దెబ్బతింటుంది.

స్ట్రెయిట్ vs డబ్బింగ్ - ఎవరికి ఎక్కువ ఛాన్స్?

📌 తెలుగు సినిమా హిట్టవ్వాలంటే:

మన సినిమాల్లో స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. ప్రేక్షకులు కొత్త కథలు, కొత్త యాక్టర్స్‌ను స్వీకరించే మూడ్ లో ఉండాలి. ఈ సినిమాలను బాగా జనాల్లోకి తీసుకెళ్లాలా బాగా ప్రమోషన్ చేయాలి.

📌 డబ్బింగ్ సినిమాలు హిట్టవ్వాలంటే:

‘L2: Empuraan’ లాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. తెలుగు ప్రేక్షకులు న్యూ కంటెంట్‌ని ఓపెన్ మైండెడ్‌గా అంగీకరించాలి. నిక్కచ్చిగా చెప్పాలంటే స్ట్రెయిట్ సినిమాలు ప్లాప్ అవ్వాలి.

👉 ఫైనల్ గేమ్‌చేంజర్:

ఇన్ కేస్ : ‘దిల్ రూబా’ & ‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటే, స్ట్రెయిట్ సినిమాలు తిరిగి లీడ్ తీసుకోవచ్చు.

థియేట్రికల్‌గా స్ట్రెయిట్ సినిమాలకు ఎక్కువ ఓపెనింగ్ వస్తుంది, కానీ డబ్బింగ్ సినిమాలు లాంగ్ రన్‌లో లాభదాయకంగా మారతాయి.

👉 మీ ఆలోచనలు ఏంటి?

స్ట్రెయిట్ సినిమాలకా మీరు ఓటు వేస్తారా?

లేక డబ్బింగ్ సినిమాలు ఈసారి గెలుస్తాయని అనుకుంటున్నారా?

కామెంట్ చేయండి & మీ అభిప్రాయాలను పంచుకోండి! 😃

Read More
Next Story