తెల్లారేసరికి ఇంటి చుట్టూ గోడలు మొలిస్తే? :  బ్రిక్ (2025) రివ్యూ
x

తెల్లారేసరికి ఇంటి చుట్టూ గోడలు మొలిస్తే? : బ్రిక్ (2025) రివ్యూ

జర్మన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా గురించి తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే....


టిమ్ (మథియాస్ ష్వాయ్‌హోఫర్) ఓ వీడియో గేమ్ డెవలపర్. విపరీతమైన పని ఒత్తిడితో ఉంటాడు. ఆఫీస్ Zoom కాల్స్‌లో ల్యాగ్, గతానికి చెందిన కొన్ని ఫ్లాష్‌బ్యాక్‌లు అతన్ని ఇబ్బంది పెడుతూంటాయి. గతంలో అతని భార్య లివ్ (రూబీ ఓ. ఫీ) గర్భస్రావం అవటంతో ఆ సంఘటన వారిద్దరి మధ్య సంబంధాన్ని బలహీనంగా మార్చింది.

వీటిన్నటికీ దూరంగా లివ్ పారిస్‌కి వెళ్లిపోయి కొత్త జీవితం మొదలుపెడదాం అని చెప్తుంది. కానీ టిమ్ ఒప్పుకోడు. "ఇప్పుడు కాదు, తరువాత చూద్దాం" అంటాడు. అదే 'తర్వాత' ఎప్పటికప్పుడూ ఎప్పుడూ రాదు.

ఇదిలా ఉండగా ఓ రోజు తెల్లారి లివ్ బయలుదేరేందుకు తలుపు తీస్తే ఎదురుగా అడ్డంగా – ఒక నల్లని, మెటాలిక్, అద్భుతంగా ఆకారాలు కలిగిన ఇటుకలతో తయారైన గోడ ఆమె ఎదురుగా ఉంటుంది. గోడ కేవలం తలుపుకు అడ్డంగా మాత్రమే కాదు – ఇంటి చుట్టూ ఉంటుంది.ఆశ్చర్యపోయిన ఆమె చెక్ చేసి చూస్తే బాహ్య ప్రపంచంతో పూర్తిగా కనెక్షన్ కట్. నీరు లేదు. Wi-Fi లేదు. తమకేనా ఇలాంటి పరిస్దితి ఇంకెవరికానా అని చెక్ చేయాలనుకుంటారు.

దాంతో గోడకు కన్నం పెట్టి ఆ దంపతులు తమ పొరుగు అపార్ట్‌మెంట్‌కి చొచ్చుకెళ్తారు. అక్కడ మరొక జంట మార్విన్ (ఫ్రెడరిక్ లౌ), అన్నా (సాల్బర్ లీ విలియమ్స్) పరిస్దితి అదే. వాళ్లు భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లకి TikTok లో UFO వీడియోలు కనిపించాయట – ఇది ఏదో పెద్ద కుట్ర అంటున్నారు. ఏం చేయాలో అర్దంకాదు. అక్కడ నుంచి ఎలా బయిటపడాలి, అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అనే డిస్కషన్ చేసినా ఫలితం లేదని అర్దమవుతుంది.

ఇక లివ్ ఓ ఆర్కిటెక్ట్ కావడంతో, పాత భవన నిర్మాణ రహస్యాలు తెలుసు. ఇది 1897లో నిర్మించబడిన అపార్ట్‌మెంట్ అని, దీనికి బాంబు షెల్టర్‌కి దారి తీసే బేస్‌మెంట్ టన్నెల్స్ ఉన్నాయని చెబుతుంది. వెంటనే అందరూ కలిసి బయటపడే ప్రయత్నం మొదలు పెడతారు. వీళ్లకు మరికొంతమంది ప్రక్క ప్లాట్ లు వాళ్లు తోడవుతారు. వాళ్లలో యూరీ (మురథన్ ముస్లు) అనే అనుమానాస్పద వ్యక్తి – ఇతను కాన్సిపిరసీ థియరీలతో నిండిపోయి ఉంటాడు.

మరో ప్రక్క అతని ప్లాట్ లో ఓ శవం కనిపిస్తుంది. అయితే అతన్ని ఎవరు చంపారో అర్దంకాదు. ఇక వీళ్లంతా కలిసి గోడలకు కన్నాలు పెట్టుకుంటూ ,పగలకొట్టుకుంటూ ల్యాండ్లోర్డ్ ఫ్లాట్‌కి వెళతారు. అక్కడ అతను మృతదేహంగా కనిపిస్తాడు – చేతులు కోసేసి ఉన్నాయ్. అప్పుడు వీళ్లేం చేసారు. ఎలా బయిడతారు. అసలు ఇలా ఎవరు , ఎందుకు బంధించారు. ఈ కుట్ర వెనక అసలు కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఒక ఉదయం లేవగానే, అపార్ట్‌మెంట్ చుట్టూ నల్లటి ఇటుక గోడలు కనిపించడం అనేది సినిమాకు థ్రిల్లింగ్ టర్నింగ్ పాయింట్. ఈ గోడలు కేవలం అవరోధాలు కావు – ఆవేశాలు, మౌనం, భయాలు అన్నీ బయటపడే సైకలాజికల్ అవరోధాలుగా అనేదే డైరక్టర్ ఉద్దేశ్యం. ఈ సినిమాలో ప్రధాన పాత్రల మధ్య ఒక విడిపోయే సంబంధాన్ని టెస్ట్ చేసుకునేందుకు ఆఖరి అవకాశం గా చూపించే ప్రయత్నం చేసారు. గోడల మధ్య చిక్కుకున్న దంపతులు దాన్నుంచి బయిటపడే సమయం తగ్గిపోతుండగా – ప్రేమ, నమ్మకం, పశ్చాత్తాపం చూపించాలనుకున్నారు. ఇది ఒక ఎమోషనల్ ల్యాబ్‌లో వేసిన ప్రయోగంలా రాసుకున్నారు. కానీ తెరపై అంతలా వర్కవుట్ కాలేదనే అనిపిస్తుంది.

సినిమా ప్రారంభంలో Liv & Tim మధ్య సంక్షోభాన్ని ఎస్టాబ్లిష్ చేయడం చేయటం ఇలాంటి సినిమాలకు కొత్తేమీ కాదు. అలాగే ఆ ఎమోషన్ ని కూడా సరిగ్గా బిల్డ్ చేయలేదు. హీరోకు వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లు ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి . దాంతో చూసే మనం emotionally invest కావడానికి అవకాశమే లేకుండా పోతుంది. ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ తర్వాత... కథ నిలిచిపోయింది. ఒక engaging థ్రిల్లర్‌కి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ (i.e., నల్ల ఇటుక గోడతో ఇంటి చుట్టూ బంద్ అవడం) తర్వాత కథా స్పీడుగా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లి కొత్త మలుపులు ఇవ్వాలి.

కానీ ఇక్కడ... పాత్రలు ఇంట్లో తిరుగుతూ నాన్-ప్రొడక్టివ్ డైలాగ్స్ చెబుతుంటారు. వాళ్లు చూసే మనల్ని తప్పించి వేరే ఏదీ సాధించినట్టే కనిపించరు. కొత్త పాత్రలు (Marvin, Yuri) వచ్చి కథని ఏమీ డ్రైవ్ చేయకుండానే విషయాలను హింసగా మార్చి చెప్తూంటాయి. అలాగే మొత్తం "ఇదంతా ఎవరు చేసారు?" అనే మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. కానీ చివరికి ఆ కారణం మనని ఎక్సైట్ చేయదు. ఒక థ్రిల్లర్‌కి కీలకం అయిన "సంతృప్తికరమైన క్లైమాక్స్" పూర్తిగా గాలిలో మాయమైపోతుంది.

ఫైనల్ థాట్ :

BRICK – ఓ హై కాన్సెప్ట్‌ను తీసుకుని, ఆసక్తికరమైన టేకాఫ్ తర్వాత నిరుత్సాహంగా సాగిపోయిన బోర్ కొట్టే సినిమా.

చూడచ్చా

ఈ జర్మన్ సైక్లాజికల్ థ్రిల్లర్ ని పెద్దగా హోప్స్ పెట్టుకుని చూడకండి..మరీ ఖాళీగా ఉంటే కాలక్షేపానికి ఓ లుక్కేయచ్చు అంతే.

ఎక్కడుంది

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story