నార్త్ లో రాజాసాబ్ పరిస్దితి ఏమిటి?
x

నార్త్ లో 'రాజాసాబ్' పరిస్దితి ఏమిటి?

ఈ టాక్‌తో రూ. 75 కోట్లు సాధ్యమేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' చిత్రం రిలీజ్ రోజునే మార్నింగ్ షో తో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు ఓపినింగ్స్ అదిరిపోయాయని ట్రేడ్ లెక్కులు చూస్తే అర్దమవుతుంది. ఈ నేపధ్యంలో నార్త్ మార్కెట్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో అక్కడ పరిస్దితి ఏమిటో చూద్దాం.

డిజాస్టర్ ఓపెనింగ్!

భారీ అంచనాల మధ్య నార్త్ లో విడుదలైన 'రాజాసాబ్' హిందీ వెర్షన్ మొదటి రోజు కేవలం ₹6 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. ప్రభాస్ ఇమేజ్‌తో పోలిస్తే ఇది అత్యంత బలహీనమైన ఆరంభం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందీ మార్కెట్‌లో ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే కనీసం ₹75 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుండి సినిమా కలెక్షన్లలో భారీ జంప్ ఉంటే తప్ప ఈ టార్గెట్ చేరుకోవడం అసాధ్యం.

నెగిటివ్ రెస్పాన్స్ , తక్కువ బజ్!

ఈ సినిమాకు హిందీ మార్కెట్‌లో నెగటివ్ రెస్పాన్స్ రావడం అతిపెద్ద డ్రాబ్యాక్ గా మారింది. రివ్యూలు కూడా ప్రోత్సాహకరంగా లేవు, పైగా సినిమాపై అక్కడ ఆశించిన స్థాయిలో బజ్ (Buzz) లేదు.

మిగిలిన భాషల్లోనూ అదే పరిస్థితి!

'రాజాసాబ్' వసూళ్లన్నీ దాదాపు తెలుగు వెర్షన్ నుండే రావాల్సిన పరిస్దితి ఏర్పడింది. తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా వసూళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. నార్త్ ఆడియన్స్‌ను మెప్పించడంలో సినిమా విఫలమవడం ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

మరో ప్రక్క రాజాసాబ్ ఒక్క‌టే తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమా. కాబ‌ట్టి నార్త్ లో రాజాసాబ్ కి పోటీ లేదు. దానికి తోడు… విజ‌య్ ‘జ‌న నాయ‌కుడు’ కూడా వాయిదా ప‌డింది. ఆ ర‌కంగా చూసినా ‘రాజాసాబ్’కు ప్ల‌స్ పాయింటే. తెలుగు రాష్ట్రాల్లో విజ‌య్ సినిమాకు ద‌క్కే కొన్ని థియేట‌ర్లు కూడా… ‘రాజాసాబ్’ ఖాతాలో వెళ్లిపోయాయి. అయితే ఇప్పుడున్న సిట్యువేషన్ లో అదేమీ కలిసొచ్చేలా లేదు.

ఏదైమైనా ‘రాజాసాబ్‌’లాంటి సినిమాకు లాంగ్ ర‌న్ ఉంటేనే నార్త్ లో కలిసి వస్తుంది. బాలీవుడ్ లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ యావ‌రేజ్ గా వ‌చ్చినా, రెండు మూడు రోజుల‌కు ప‌రిస్థితి కుదుట‌ప‌డి, అక్క‌డ వ‌సూళ్లు ఊపందుకొంటాయ‌ని చిత్ర‌ టీమ్ భావిస్తోంది. ఆ రెండు మూడు రోజుల వ‌ర‌కైనా వ‌సూళ్లు నిల‌క‌డ‌గా ఉండాలంటే.. మంచి టాక్ అవ‌స‌రం. అయితే మొదటి రోజు వసూళ్లు చూస్తుంటే బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

Read More
Next Story