నేనిక ఆగలేనంటున్న జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చేసింది!
x
Photo curtesy Instagram

నేనిక ఆగలేనంటున్న జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చేసింది!

దివంగత మహానటి శ్రీదేవి గుర్తుందిగా.. ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ ‘నన్ను ఆపొద్దు, జూనియర్‌ ఎన్టీఆర్‌ వద్దకు వచ్చేసింది ఎందుకు?


దివంగత మహానటి శ్రీదేవి గుర్తుందిగా.. ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ ‘నన్ను ఆపొద్దు, నేనెళ్లి జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించాల్సిందేనంటూ‘ గోవాకి బయలుదేరింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న దేవర: పార్ట్‌ 1 షూటింగ్‌ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ గోవా బీచ్‌లో షూటింగ్‌ చేస్తున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల జాన్వీ తన షెడ్యూల్‌ను ముగించుకుని ముంబై వెళ్లిపోయింది. ఆ ఫోటోను కూడా జాన్వీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసింది. ముంబైలో పనులు ముగించుకున్న జాన్వీ ఇప్పుడు మళ్లీ తిరిగి సెట్స్‌కి రావాలనుకుంటోంది. దాన్నే ఆమె తన భాషలో ఇలా చెప్పింది.

ఇక నేను ఆగలేను...

గోవాకు చేరిన జాన్వీ తీసిన సూర్యాస్తమయం చిత్రాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్‌ చేశారు. దేవర సెట్స్‌కి తిరిగి రావడానికి ఇక వెయిట్‌ చేయలేనంటూ మెసేజ్‌ షేర్‌ చేశారు. ‘‘తిరిగి రావడానికి ఇంక ఎక్కువ కాలం వేచిఉండలేను.. దేవర చిత్రంలో మళ్లీ తంగమ్‌ (అంటే తన పాత్ర) కావడానికి వేచి ఉండలేను అంటూ మెసేజ్‌ పెట్టారు తాను షేర్‌ చేసిన ఫోటో కింద.
ఈ చిత్రంలో జాన్వీ తంగమ్‌ అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ లాంగా, వోణి డ్రెస్‌లో కనిపిస్తుంది. సినిమా ఫస్ట్‌ లుక్స్‌ బయటకు వచ్చినపుడు ఆమె లంగా, వోణితో ఉన్న చిత్రాన్ని షేర్‌ చేశారు. గత ఏడాది చివర్లో ఈ సినిమా కోసం హీరోను జూనియర్‌ ఎన్టీఆర్‌గా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది.
జూనియర్‌ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలతో కొరటాల శివ తీస్తున్న చిత్రం దేవర: పార్ట్‌ 1 ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. చిత్ర బృందం గోవాలో షూటింగ్‌ చేస్తోంది. షూటింగ్‌ సమయంలో ఒక అభిమాని దూరం నుంచి తీసిన వీడియో కలకలం రేపింది.
ఒక అభిమాని లీక్‌ చేసిన వీడియోలో పెద్దగా ఏమీ లేనప్పటికీ ఈ సినిమా లొకేషన్‌ ఎక్కడో సముద్రం దగ్గర జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఆతర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ గోవాలో జరుగుతున్నట్టు ప్రకటించారు. అక్కడ ఓ పాటను కూడా షూట్‌ చేయనున్నారు నిర్మాతలు. 2023లో చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి హైదరాబాద్, గోవాలలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లలో చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరణ మిగిలి ఉంది. తెలుగు సినిమాలో జాన్వీ, సైఫ్‌ల అరంగేట్రం దేవర సినిమాతో మొదలవుతోంది.
దేవర టైటిల్‌ పాత్రలో జూనియర్‌ ఎన్టీఆర్, భైరాగా సైఫ్, తంగం పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, మతిస్థిమితం లేని వ్యక్తి పాత్రలో అష్రఫ్, నరేన్, కలైయరసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్, శృతి మరాఠే కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తోంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుంది. సెకండ్‌ పార్టీ ఆ తర్వాత విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్‌ రవిచందర్‌ అందిస్తుండగా సినిమాటోగ్రఫీ ఆర్‌ రత్నవేలు, ఎడిటింగ్‌ ఎ శ్రీకర్‌ ప్రసాద్, దర్శకత్వం కొరిటాల శివ వహిస్తున్నారు.
Read More
Next Story