మీ కులపోళ్లు సినిమా చూడటానికి వీల్లేదు... థియేటర్‌లోనూ వివక్షే
x

మీ కులపోళ్లు సినిమా చూడటానికి వీల్లేదు... థియేటర్‌లోనూ వివక్షే

తమిళంలో ఈ మధ్య వరుస పెట్టి వివక్షపై సినిమాలు వస్తున్నాయి. వెట్రిమారన్, పా రంజిత్, మారి సెల్వరాజ్ వంటి దర్శకులు సమాజంలో ఓ వర్గానికి..


తమిళంలో ఈ మధ్య వరుస పెట్టి వివక్షపై సినిమాలు వస్తున్నాయి. వెట్రిమారన్, పా రంజిత్, మారి సెల్వరాజ్ వంటి దర్శకులు సమాజంలో ఓ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ సినిమాలు తీస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే.. థియేటర్‌లో ఆ దర్శకులు తీసిన, రాసిన సినిమా చూడటానికి కూడా అణగారిన వర్గం వివక్ష ఎదుర్కొంటోంది. రీసెంట్‌గా తమిళనాడులో జరిగిన ఓ సంఘటన యావత్ సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది.

గ‌తేడాది వ‌చ్చిన విడుతలై పార్ట్‌-1 (Viduthalai Part 1) సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు తమిళ స్టార్ కమెడియన్ సూరి (Comedian Soori). తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌ (Vetrimaran) ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూరి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. కాగా ఈ మూవీ త‌ర్వాత సూరి వ‌రుస మూవీల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే విడుతలై పార్ట్‌-2 (Viduthalai Part 2) లో న‌టిస్తున్న సూరి తాజాగా మ‌రో కొత్త సినిమాను విడుద‌ల‌ చేశాడు.

సూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం గ‌రుడ‌న్ (Garudan). ఈ సినిమాకు కాకీ స‌ట్టై (Kaakisattai), కోడి (Kodi), ప‌ట్టాస్ (Pattas) చిత్రాల ఫేమ్ దురై సెంథిల్‌కుమార్ (Durai Senthil Kumar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. తమిళ నటుడు శశికుమార్, మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రేవతి శర్మ (Revathi Sharma), శివత నాయర్ (Shivatha Nayar), బ్రిగుడ సాగ (Paavi Teacher) మిగతా కీ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మే 31న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి సూపర్ టాక్ తెచ్చుకుంది.

తమిళనాడులోని థేని జిల్లాలోని కోంబై ప్రాంతంలో ఓ ఆలయం చుట్టూ జరిగే కథ ఇది. ఆది (శశికుమార్), కరుణ (ఉన్ని ముకుందన్) ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు. వాళ్లు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూంటారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఒకరకంటే మరొకరు ఇష్టపడతారు. ఇక ఆదికి క్లోజ్ ఫ్రెండ్ సోక్కన్ (సూరి) . అతనో అనాథ. ఎక్కడివాడో..ఏ కులమో కూడా తెలియదు. ఈ ముగ్గరూ అన్నదమ్ముల్లా మెలుగుతూంటే ఓ అనుకోని సంఘటన మొత్తం మార్చేస్తుంది. ఆ ఊళ్లో ఉన్న ఓ గుడికి చెందిన భూమిని ఓ మంత్రి నొక్కేయాలనుకుంటాడు.

ఆ గుడి ట్రస్ట్‌కు ప్రెసిడెంట్ కరుణకు నాయనమ్మ. దాంతో కరుణ ఈ సిట్యువేషన్‌ని డబ్బు సంపాదించుకుని ఎదిగే ఓ అవకాసంగా భావిస్తాడు. అయితే ఆది దీనికి ఒప్పుకోడు. దాంతో వారి మధ్య గొడవలు మొదలవుతాయి. సొక్కన్ పూర్తిగా కరుణకు నమ్మకంగా ఉండేవాడు. కానీ అతని ఐడియాలజీ, నీతి నియమాలు వేరు. అక్కడ నుంచి వరస పెట్టి మారే సంఘటనలతో సొక్కన్ చుట్టూ కథ తిరగడం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది గరుడన్ సినిమా కథ. ఈ కథంతా కూడా ఓ పోలీస్ ఇన్స్‌పెక్టర్ రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వటంతో నేరేట్ చేస్తారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. సూరి కూడా ఇప్ప‌టివ‌రకు ఎన్నడూ చూడని మాస్ అవతార్‌లో కనిపించాడు. ఇక ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ (Lark Studios), గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ(Gross Route film Company) సంయుక్తంగా నిర్మించాయి. సముద్రఖని, మొట్టై రాజేంద్రన్, మైమ్ గోపి త‌దిత‌రులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ ఇవ్వగా.. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ నిర్వహించారు. కాగా ఈ చిత్రానికి వెట్రి మారన్ క‌థ‌ను (Vetrimaran Story) అందించగా.. యువన్ శంకర్ రాజా (Yuvan Musical) సంగీతం అందించారు.

ఇక అసలు విషయానికి వస్తే...ఈ సినిమా చూడటానికి వెళ్లిన వారి విషయంలో వివక్ష చోటు చేసుకుంది. తమిళనాడు రాణిపేట జిల్లాకు చెందిన సుమారు 30 మంది సంచార జాతివారు(నక్కల జాతి) కడలూర్‌ జిల్లాలో వారం రోజులుగా బస చేసి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వంట పాత్రలను విక్రయిస్తున్నారు. వీరంతా కలిసి శనివారం కడలూర్‌ అన్నా వంతెన సమీపంలోని ఓ సినిమా థియేటర్‌కు సూరి నటించిన ‘గరుడన్‌’ చిత్రం చూడటానికి వెళ్లారు. వారికి థియేటర్‌ యాజమాన్యం టిక్కెట్లు ఇవ్వకుండా వెళ్లిపోవాలని చెప్పింది. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో వారు పుదునగర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని పంపించేశారు. దీంతో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆర్డీవో కడలూర్‌ తహసీల్దారు నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. తహసీల్దారు బలరామన్‌ వారిని థియేటర్‌ వద్దకు తీసుకెళ్లి విచారణ జరిపారు. తరువాత వారందరికీ టిక్కెట్లు తీసిచ్చి చిత్రాన్ని చూడటానికి అనుమతించారు. దీంతో ఆ థియేటర్‌ వద్ద కలకలం చెలరేగింది. దీంతో 20కి పైగా పోలీసులతో ఆ థియేటర్‌ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంకా ఈ రోజుల్లో ఇలా థియేటర్స్‌లో సినిమా చూడటానికి కూడా కులం అడ్డు వస్తున్న ఈ సమయంలో మనవాళ్లు ఇంకా కులం నశించాలని సినిమాలు తీస్తూనే ఉంటారు. అవి థియేటర్స్‌లో ఆడుతూనే ఉంటాయి. అయితే ఆ సినిమాలు చూడటానికి కూడా కులాలు అడ్డు వస్తూంటాయి. ఈ సినిమాలు చూసి ఇంకా కుల వివక్ష పెరుగుతోందో.. తగ్గుతోందో అరథం కాకుండా పోతోందని తమిళనాట మేధావి వర్గం అంటోంది.

ఇదిలా ఉంటే గరుడన్ సినిమా తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్నది. ఈ సినిమా తొలి రోజు తమిళనాడులో రూ.3.6 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల, రెండో రోజు తమిళనాడులో రూ.4.85 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.5.5 కోట్లు వసూలు చేసింది. దాంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.9.5 కోట్లు వసూలు చేసింది.

Read More
Next Story