
గర్భాశయ క్యాన్సర్ తో ప్రముఖ టీవీ నటీ.. ఆమె సోదరుడు..
ప్రముఖ టీవీ నటీ ఒకరు గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు. అంతకుముందే రోజే ఆమె సోదరుడు కూడా కామెర్ల వ్యాధితో తుది శ్వాస విడిచాడు.
ప్రముఖ టీవీ నటి.. రియాలిటీ షోల ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న డాలీ సోహీ గర్భాశయ క్యాన్సర్ తో శుక్రవారం ఉదయం నవీ ముంబాయిలోని ఓ ఆస్పత్రిలో మరణించినట్లు ఆమె సోదరుడు మన్ ప్రీత్ తెలిపారు. డాలీ ‘ఝనక్’, ‘బాబీ’ వంటి షోలు విశేష ప్రజాదరణ పొందాయి. ఆమె వయస్సు కేవలం 47 సంవత్సరాలు మాత్రమే.
ఆరు నెలల క్రితం గర్భాశయ క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు.
"డాలీ సోహీ ఇక లేరు. తెల్లవారు జామున 4 గంటలకు ఆమె అపోలో ఆస్పత్రిలో మరణించారు. డాలీ కొన్ని నెలలుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతోంది. దీనికి చికిత్స తీసుకుంటూ ఉండగానే అది ఊపిరితిత్తులకు వ్యాపించింది. ఆరోగ్యం క్షీణించడంతో నిన్న రాత్రి అపోలోకి తీసుకొచ్చాం " అని మన్ ప్రీత్ విలేకరులకు చెప్పారు. ఇంతకుముందు రోజు డాలీ సోదరుడు అమన్ దీప్ సింగ్ సోహి కూడా కామెర్లతో మరణించాడు. అతను కూడా నటుడే.
" డీవై పాటిల్ ఆస్పత్రిలో కామెర్ల కారణంగా అమన్ దీప్ గురువారం మరణించాడు" అని మన్ ప్రీత్ తెలిపారు.
డాలీ కొన్ని ముఖ్యమైన ప్రదర్శనలలో " క్కుసుమ్, మేరీ ఆషీకీ తుమ్ సే హాయ్, కుంకుమ్ భాగ్య, పరిణీతి"వంటివి ఉన్నాయి. మధ్యాహ్నం డాలీ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Next Story