హెబ్బా పటేల్‌ ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఓటిటి రివ్యూ
x

హెబ్బా పటేల్‌ ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఓటిటి రివ్యూ

డైరక్టర్ కు కొత్తగా పెళ్లైన జంటలు ఒకరిని ఒకరుని అర్దం చేసుకోలేక విడాకులు దాకా వెళ్లిపోతున్నారనే ఆవేదన కలిగినట్లుంది.


డైరక్టర్ కు కొత్తగా పెళ్లైన జంటలు ఒకరిని ఒకరుని అర్దం చేసుకోలేక విడాకులు దాకా వెళ్లిపోతున్నారనే ఆవేదన కలిగినట్లుంది. వెంటనే తను చూసిన జంటో, విన్న జంటనో దృష్టిలో పెట్టుకునో ఊహించో ఓ కథ రాసేసారు. అందుకు హనీమూన్ ఎక్సప్రెస్ అనే టైటిల్ పెట్టారు. అది సెల్లింగ్ పాయింట్ అని నిర్మాత నమ్మినట్లున్నారు. సినిమా తీసేసారు. మరి సినిమా ఎలా ఉంది..డైరక్టర్ అనుకున్న విషయాన్ని సినిమాలో చెప్పి , ఆ మెసేజ్ ని కుర్రాళ్ళకు అంద చేయగలిగారా

కథేంటి

ప్రేమించి పెళ్లి చేసుకున్న సోనాలి(హెబ్బా పటేట్‌), ఈషాన్‌(చైతన్య రావు) ఎడ్జెస్ట్మెంట్ తక్కువ బ్యాచ్ . వాళ్లకు మొదటి రాత్రి నుంచే గొడవలు మొదలవుతాయి. దాంతో తొలిరాత్రి మధురిమలు ఆనందించలేకపోతారు. సర్దుకుపోయే పరిస్దితులు ఉన్నా గిల్లి కజ్జాలతో తమ మధ్య దూరాన్ని పెంచేసుకోవటమే పనిగా పెట్టుకుంటారు. కొద్ది రోజులుకే తాము కలిసి ఉండలేము అని, పెళ్లి పేరుతో తమ జీవితాలను పాడుచేసుకున్నామనే ఇద్దరూ అనుకోవటం మొదలెడతారు.

ఈ క్రమంలో కౌన్సిలింగ్‌ కోసం థెరపిస్ట్‌లను కలిసినా పెద్దగా కలిసొచ్చేదేమీ అనిపించదు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయవుతుంది. వాళ్లు ఈ యువ జంటకు హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌(రిస్టార్ట్‌) గురించి చెబుతారు. ఒక వారం రోజుల పాటు ఇద్దరూ అక్కడ తామే ఒక ప్రపంచంగా బ్రతకమని సలహా ఇస్తారు. అలా చేస్తే , అప్పుడు వారి మధ్య దూరం తగ్గిపోతుందని చెబుతారు. అలా చేస్తే కనుక ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుని, సంతోషంగా జీవితాన్ని మొదలుపెట్టొచ్చని అంటారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా వాళ్లే చేస్తారు.

వారి మాట విని ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎటువంటి ఎక్సపీరియన్స్ లు ఎదురౌతాయి? అసలు వీళ్లిద్దరని కలిసిన ఈ వృద్ధ జంట ఎవరు? అలాగే వారు చెప్పిన హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ కాన్సెప్ట్‌ ఏంటి? చివరకు ఏమైంది? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో ఏమైనా మార్పు వచ్చిందా? చివరకు ఈ యువ జంట కలిసి ఉన్నారా విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కాన్సెప్టు ఓరియెంటెండ్ సినిమాలు థియేటర్ లో వర్కవుట్ కాకపోయినా ఓటిటిలలో బాగానే నడుస్తున్నాయి. అదే దైర్యంతోచాలా మంది నామ మాత్రంగా థియేటర్ రిలీజ్ చేసి ఓటిటిలకు తమ సినిమాలను సేఫ్ గా చేరుస్తున్నారు. అయితే ఓటిటిలలో వచ్చిన చిన్న సినిమాలన్నీ అద్బుతంగా ఉంటాయని కాదు...కొన్ని ఓటి కుండలా మిగిలిపోతూంటాయి. తాజాగా ఓటిటిలోకి అడుగు పెట్టిన ఈ హనీమూన్ ఎక్సప్రెస్ ఎలా ఉంది... చూసే వాళ్లకు హనీమూన్ ఎక్సపీరియన్స్ కలిగించిందా అంటే లేదనే చెప్పాలి.

వేర్వేరు నేపధ్యంలోంచి వచ్చిన , వేరు వేరు మనస్తత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒకటై కలిసి మెలిసి జీవించాలి. ఆ కొత్తల్లో ఇద్దరి మనస్సులు కలిసేదాకా కొన్ని ఎడ్జెస్ట్ మెంట్స్ తప్పవు. ఒకరినొకరు భరించుకోవాలి. ప్రేమలో పడాలి. అయితే అందుకు తగ్గ పరిస్దితులు గతంలో వివాహ వ్యవస్దలో సంప్రదాయంగా వచ్చేవి. ఏమన్నా సమస్యలు ఉన్నా సర్దిచెప్పటానికి పెద్దలు వెనకే ఉండేవారు. ఇప్పుడు ఆ సిట్యువేషన్ లేదు. దాంతో చిన్న విషయాలకే గొడవలు పడి విడాకులు వెళ్లిపోతున్నారు.

అయితే ఒకరికి నచ్చినట్లుగా మరొకరు ప్రవర్తిస్తే గొడవలు తగ్గుతాయనే విషయాన్ని డైరక్టర్ చెప్పాలని ప్రయత్నించారు. అది మంచి విషయమే. అయితే దాన్ని మంచి ఎంటర్టైన్మెంట్ గా చెప్పాల్సి ఉంది. అంతే కాని విసుగ్గా,బోరింగ్ స్క్రీన్ ప్లే తో దాన్ని డీల్ చేయాలనుకున్నారు. దాంతో ఈ సినిమా లో ఎంగేజ్ అయ్యే క్షణాలు చాలా తక్కువగా ఉండటం మొదలైంది. అతి తక్కువ లొకేషన్స్ లో అతి తక్కువ ఖర్చుతో సినిమాని నడపాలనే ప్రయత్నం చేసారు. అందుకు తగినట్లు సీన్స్ రాసుకున్నారు. దాంతో చూసేవాళ్లకు అదొక సమస్యగా మారింది. కామెడీ కూడా పండలేదు.

టెక్నికల్ గా చూస్తే పెద్ద గొప్పగా ఏమీ అనిపించదు. ఏదో లాగేసినట్లు చాలా చోట్ల చుట్టేసినట్లు అనిపిస్తుంది. కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ సోసో గా ఉంది. పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా అంద గొప్పగా లేదు. అక్కడక్కడా కొన్ని విజువల్ గా అప్పీలింగ్ సీన్స్ ఉండటం తప్పిస్తే సినిమాలో ఏమీ లేదు. ఉమా శంకర్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. నటీనటులు గురించి మాట్లాడాలంటే హెబ్బా పటేల్ బాగానే చేసింది. చైతన్యా రావు కొంత కామెడీ చేద్దామని చూసాడు కాని స్క్రిప్టు సహకరించలేదు.

చూడచ్చా

మరీ ఖాళీగా ఉంటే ఓ లుక్కేయవచ్చు. అంతకు మించి పెద్దగా ఎక్సపెక్ట్ చేయటానికి ఏమీ లేదు. టైటిల్ చూసి ఏదో ఊహించుకుంటే మరీ నిరాశ అనిపిస్తుంది.

ఎక్కడ చూడచ్చు

అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story