ఆగస్టు 22న ‘ఇంద్ర సేనారెడ్డి’ మళ్లీ వస్తున్నాడా?
x

ఆగస్టు 22న ‘ఇంద్ర సేనారెడ్డి’ మళ్లీ వస్తున్నాడా?

రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న వేళ చిరంజీవి కూడా తన సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటాడా?


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే ని పురస్కరించుకొని 'మురారి ' సినిమాను రిలీజ్ చేశారు. ఇక దీనికి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మరి కొంతమంది స్టార్ హీరోల బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆయా హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది...

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 22 వ తేదీన 'మెగాస్టార్ చిరంజీవి' బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలను రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి 150 పై చిలుకు సినిమాలను చేశాడు. కాబట్టి అందులో ఏ సినిమాని రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీదనే కొన్ని రోజులపాటు ఆలోచనలో ఉన్న మెగాస్టార్ మొత్తానికైతే తను చేసిన 'ఇంద్ర ' సినిమాని రీ రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.




ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఆశివిని దత్ ఈ సినిమాను నిర్మించగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర సినిమా 2002వ సంవత్సరం జూలై 24 వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాతో చిరంజీవి మొదటిసారిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడు. ఇక ఈ సినిమాతో చిరంజీవి తన కెరియర్ లో మొదటి సారి 30 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టాడు. అలాగే అప్పటి వరకు నరసింహ నాయుడు సినిమా పేరు మీద ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్టు కూడా కొట్టాడు.

మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన పోషించిన ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ తన వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అలాగే పెద ప్రజల కోసం తన యావత్ ఆస్తిని సైతం వదిలేసి తన ఐడెంటిటీ మార్చుకొని శంకర్ నారాయణ గా కాశీ కి వెళ్లి బతుకుతాడు. ఇక ఈ సినిమాకి చిన్ని కృష్ణ ఈ కథ అందించగా, పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన మాటలను రాయడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందనే చెప్పాలి. ఇంకా చిరంజీవి నట విశ్వ రూపాన్ని చూపించడం తో ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది...

ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు... ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా గుర్తింపబడుతున్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలను రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి దానికి తగ్గట్టుగానే చిరంజీవి సినిమాలకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలిన చిరంజీవి ఇప్పుడు కూడా రీ రిలీజ్ లా రూపం లో తన మేనియాని భారీ రేంజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు...మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలంటే ఆగస్టు 22 వరకు వెయిట్ చేయాల్సిందే...

(గోపి వేల్పుల)

Read More
Next Story