రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ
x

రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ

మరణ తేదీలు కనిపించే హీరో కథ

“ఎవరెప్పుడు చస్తారో ముందే మీకు తెలుస్తూంటే… మీరు ఏమి చేస్తారు? శివ చేసిన పని ఇదే!”

హైదరాబాద్‌ బస్తీల రద్దీలో తిరిగే శివ (రాజ్ తరుణ్) కి ఒకే లక్షణం—దూకుడు. అదే అతన్ని అంబులెన్స్ డ్రైవర్ చేసింది. జీవిత–మరణాల మధ్య నడిచే ఉద్యోగం… ఒక తప్పు, ఒక సెకను ఆలస్యం—ఓ ప్రాణం పోయే బాధ్యత. వీటి మధ్య జీవితం నెట్టుకొస్తున్న శివకు ఒక రోడ్డు ప్రమాదం తర్వాత పూర్తిగా మారిపోతుంది.

ఆ యాక్సిడెంట్ తర్వాత చిత్రంగా అతనికో శక్తి వస్తుంది. అతనికి అందరి తలలపై కొన్ని అంకెలు కనిపించడం మొదలవుతుంది. మొదట అవేమిటో అర్దం కాదు. కానీ తర్వాత తెలుస్తుంది. అవి ‘డెత్ కౌంట్‌ డౌన్’అని. “ఏ రోజు, ఏ నిమిషం వారు చనిపోతారో చూపించే అంకెలు అవి.” మొదట షాక్ అవుతాడు.తర్వాత దానిని మరో కోణంలో చూస్తాడు.

“ఈ పవర్ ని క్యాష్‌కావచ్చు కదా?” అని ఆలోచిస్తాడు. అంతే ఆ తర్వాత అప్పుల ఊబిలో ఉన్న శివ, ఈ డెత్ ప్రిడిక్షన్ పవర్‌ని ఉపయోగించి డబ్బు సంపాదించడానికి కార్పొరేటర్ సత్తు పహిల్వాన్‌తో డీల్ కుదుర్చుకుంటాడు. సత్తు భూకబ్జాలు, బలవంతాలు, సెటిల్మెంట్లలో దేవుడిలా తిరుగుతున్న వ్యక్తి. ఆ డీల్ ప్రాణం — కరెన్సీ అయ్యే ఒప్పందం!

కానీ శివ ఎక్కడైతే డబ్బు కోసం పరుగెడుతున్నాడో అక్కడే అతనికి అర్థమవుతుంది. “మనిషి చావు తేదీని అమ్మడం… ఎంత పెద్ద పాపమో.”

డబ్బుకు మనిషి ప్రాణం తాకట్టు పెట్టడం… ఇదేమి వరం వినియోగం కాదు అనిపిస్తుంది. అప్పుడే కథ టర్న్ అవుతుంది.

ఇదే సమయంలో నగరాన్ని కుదిపేసే ఒక భారీ ప్రమాదం ముందే కనిపిస్తుంది శివకు. వందల మంది ప్రాణాలు ఒక్కసారిగా హ్యాంగ్ అవుతున్నట్టు. ఈ ప్రమాదం వెనుక ఒక సెటప్ ఉంది, ఒక రాజకీయ కవర్ ఉంది. అది ఎవరిదంటే… స్థానిక ఎమ్మెల్యే రాజన్న.

వరం లాంటి శక్తి… పాపం లాంటి తప్పు… వైరంలాంటి పాలిటిక్స్… మరణం లాంటి ఓ డెడ్‌లైన్… ఈ నాలుగు కలిసి శివను ఒకే ప్రశ్న ముందుకు నెడతాయి. “నేను దేవుడి ఆటలో ఆటగాడినా…లేక పరులకు ప్రాణం నిలబెట్టే చిరంజీవనా?” అప్పుడు శివ ఏం చేస్తాడు.

ఆ పెద్ద విపత్తు నుంచి జనాల్ని కాపాడతాడా, చావు తేదీలతో ఆడిన ఈ గేమ్‌లో చివరికి ఎవరు జయిస్తారు? అనేది మిగతా కథ.

విశ్లేషణ

ఫాంటసీ జానర్‌కు చెందిన కథలు సాధారణంగా “మనిషికి మానవాతీత శక్తులు వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు” అనే క్లాసిక్ ట్రాక్ మీద నడుస్తాయి. భవిష్యత్తు తెలుసుకోవడం, మనసులు చదవడం, మరణం ముందే కనిపించడం వంటి కాన్సెప్ట్స్‌కు మన సినిమాల్లో ఎప్పటినుంచో ఉంటూ వస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే లైన్‌ని తీసుకుంది — “ఎవరికి ఎంత ఆయుష్షుుందో తెలుసుకునే శక్తి హీరోకి వస్తే?” అనే ఆసక్తికరమైన ప్లాట్.

పాయింట్ మాత్రం కొత్త కాదు, కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే హీరోకి వచ్చిన ఈ ‘డెత్ ప్రిడిక్షన్ పవర్’ను కథ ఎలా ఉపయోగించింది? ఇదే స్క్రిప్ట్ మొత్తం మీద పెద్ద ప్రశ్న. ఇది డ్రామా, సస్పెన్స్, హ్యూమన్ ఎక్వేషన్లు, ఎమోషన్స్, మోరాలిటీలకు స్కోప్ ఉన్న స్టోరీ లైన్. కానీ డైరెక్టర్ అభినయకృష్ణ ఈ కథని ప్రధానంగా కామెడీ టచ్ తో చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఇదే ఎగ్జిక్యూషన్‌లో బిగ్ ఫాల్ట్.

ఫాంటసీ & కామెడీ కలయిక ఇది వరకూ పనిచేసిన సందర్భాలున్నా (ఉదా: SV కృష్ణారెడ్డి ఫాంటసీ సిరీస్), ఈ కథలో కామెడీ ప్లేస్‌మెంట్స్ లైట్‌గా, సీన్‌లీడింగ్ లేకుండా, ఎప్పటికప్పుడు టోన్ కి వదిలేసి ముందుకు వెల్తూ ఉన్నాయి. ఎక్కడ కథ సీరియస్ అవుతోందో అక్కడ ‘జోక్ ఓకే చెయ్యండి’ అన్నట్టుగా ముందుకు వెళ్లింది. ముఖ్యంగా ఫాంటసీ ఎలిమెంట్‌ను ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు కంట్రోల్‌లో పెట్టాలి అనే రిథమ్ స్క్రిప్ట్‌లో కనిపించదు.

ఎవరెలా

రాకేశ్ నారాయణ్ సినిమాటోగ్రఫీ మొత్తం సినిమాలో ఓ మాదిరి స్టాండర్డ్‌ను పెట్టింది. గ్రాండ్ విజువల్స్ కాదు కానీ, ఫాంటసీ థీమ్‌కు కావాల్సిన “మూడ్ ఫ్రేమ్స్” మాత్రం అందించారు. అచ్చు రాజమణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్—సీన్ ఏ లెవెల్ లో ఉందో… అదే లెవెల్‌లోనే ఉంటుంది. ఎక్కడా బూస్ట్, ఎక్కడా కిక్ లేదు. “పవర్ వచ్చిన హీరో” థీమ్‌కు కావాల్సిన లేయర్ మిస్ అయింది. సాయి మురళి ఎడిటింగ్—ఒకేఒక్క మాట: సేఫ్ గేమ్. కథకు లైఫ్ ఇచ్చే రిత్మ్, పేస్… కొన్ని చోట్ల బ్లాంక్‌గా ఫీలవుతుంది.

“రాజ్ తరుణ్—తన మార్క్ యాక్టింగ్ చేశాడు… కానీ అతని చుట్టూ సెట్ చేసిన క్యారెక్టర్స్? పూరీ స్టైల్ ‘పేపర్ క్యారెక్టర్స్’ లా కనిపిస్తాయి!”

ఫైనల్ థాట్

‘చిరంజీవ’ ఎమోషనల్ & ఫాంటసీ డ్రైవ్ తో పరుగెత్తాల్సిన కథ… కానీ హాఫ్ హార్ట్ స్క్రిప్ట్ వర్క్, లోపించిన విజన్ వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. ఒక మంచి రైటర్ లేదా అనుభవం ఉన్న స్ట్రాంగ్ డైరెక్షన్ చేతుల్లో, ఈ కాన్సెప్ట్ పూర్తిగా మరో లెవెల్ లో ఉండేదేమో.

ఎక్కడ చూడచ్చు

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది

Read More
Next Story