‘దర్శన్’ అరెస్ట్ పై సినీ పరిశ్రమ ఎందుకు స్పందించలేదు?
x

‘దర్శన్’ అరెస్ట్ పై సినీ పరిశ్రమ ఎందుకు స్పందించలేదు?

ఓ హత్య కేసులో సినీ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన పై సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.


కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కన్నడ స్టార్ ‘ దర్శన్’ తూగుదీప ను పోలీసులు హత్య కేసులో అరెస్ట్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.

'DBoss' దర్శన్ (అతని DBoss టైటిల్, 2011 చిత్రం) అరెస్ట్ పై సిని పరిశ్రమ పెద్దగా స్పందించలేదు. కారణం అతని చిత్రాలపై నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టడం. అందుకే సినీ పెద్దలు దీనిపై నోరు మెదపడం లేదని టాక్. ఈరోజు (జూన్ 11) ఆయన అరెస్టు వార్త దావానంలా వ్యాపించడంతో, అతనితో సినిమాలు చేయడానికి కమిట్ అయిన నిర్మాతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
దర్శన్ రాబోయే చిత్రాలలో ఒకదానికి మద్దతు ఇస్తున్న ఒక నిర్మాత ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, “దర్శన్ ప్రవర్తన, వైఖరిని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఊహించనిది కాదు. కానీ మాకు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, మేము అతని చిత్రాలలో చేసిన భారీ పెట్టుబడులపై ఎలా స్పందించాలనేది. చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దర్శన్ సినిమాలపై సుమారు ₹100 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
దర్శన్ అరెస్ట్
ఇంతకీ, దర్శన్‌పై కేసు ఏమిటి? బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 9న కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్శన్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి అనే యువకుడిని హత్య చేయడంపై విచారణ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన రెండు రోజుల తర్వాత పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేశారు.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8న రేణుకాస్వామిని హత్య చేసి, బెంగళూరులోని కామాక్షిపాళ్యలోని డ్రైన్‌లో మృతదేహం పడవేశారు. వీధికుక్కలు డ్రైన్ నుంచి మృతదేహాన్ని లాగడం చూసి పోలీసులను కామాక్షిపాళ్యం నివాసితులు ప్రమత్తం చేయడంతో నేరం వెలుగులోకి వచ్చిందని తెలిపాయి. దర్శన్ కు సన్నిహితంగా ఉండే నటికి రేణుకాస్వామి సోషల్ మీడియాలో బాధితుడు “అశ్లీల సందేశాలు” పంపారని అందుకే హత్య చేశారని ఆరోపణలు వినిపిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో కొంతమంది అనుమానితులను అరెస్టు చేశారు. వారు దర్శన్ పేరును చెప్పారు. ఈ హత్యలో దర్శన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందా? కుట్రలో భాగం పంచుకున్నారా? అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
వివాదాలు పుష్కలం
ఇటీవలి సంవత్సరాలలో, ఈ 'ఛాలెంజింగ్ స్టార్' ను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఒక సోర్స్ ప్రకారం.. "దర్శన్ సాధారణంగానే నేర స్వభావం కలిగిన వాడనేది వాస్తవం, అయితే అతని స్టార్ డమ్ ఈ అకృత్యాలన్నింటినీ కప్పివేసింది. అతను స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు" అని స్వభావాన్ని చూపడానికి మాటలు లేవు.
గత 14 ఏళ్లుగా దర్శన్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కకుంటేనే ఉన్నాడు. అతని భార్యను వేధించడం, భౌతిక దాడికి పాల్పడటం వంటి గృహ హింస కేసులు కన్నడ ప్రజలకు చిరపరచితం.
క్రాంతి సినిమాను ప్రమోట్ చేస్తూ దర్శన్ మీడియాతో మాట్లాడుతూ, “అదృష్ట దేవత ఎప్పుడూ మీ తలుపు తట్టదు. కాబట్టి, ఆమె వచ్చినప్పుడు, ఆమెను పట్టుకోండి, ఆమెను లాగి, ఆమెకు బట్టలు ఇవ్వకుండా మీ పడకగదిలో లాక్ చేయండి. ఈ వ్యాఖ్య దుమారం రేపడంతో హోస్పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శన్‌పై ఓ అభిమాని చెప్పు విసిరాడు.
గృహ హింస..
2011లో ఆయన భార్య విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. అయితే, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత, విజయలక్ష్మి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో అతను విడుదలయ్యాడు. ఆమెపై కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. వారి సంబంధం తిరిగి యథావిధిగా ట్రాక్ ఎక్కింది. అయితే 2016 లో భార్య విజయలక్ష్మి మరోసారి పోలీస్ స్టేషన్ పై మెట్లు ఎక్కింది. దర్శన్ ప్రవర్తన బాగాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తరువాత 2021లో మైసూరులో వెయిటర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
“గత ఒక దశాబ్దంలో దర్శన్ ప్రవర్తనలో బాగా మారింది. అభిమానులు అతనిని 'సుల్తాన్ ఆఫ్ బాక్సాఫీస్, 'చాలెంజింగ్ స్టార్', 'డి' బాస్ అని పిలవడం ప్రారంభించిన తర్వాత ఇంకాస్త మార్పు కనిపించింది. దర్శన్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంది. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు అంబరీష్, అతని భార్య సుమలత అంబరీష్‌తో అతని సాన్నిహిత్యం కూడా దర్శన్ ప్రతిష్టను పెంచింది, ”అని ఒక సీనియర్ కన్నడ ఫిల్మ్ జర్నలిస్ట్ పేర్కొన్నారు. అప్పటి నుంచి అతని వైఖరి పూర్తిగా మారిపోయిందని జర్నలిస్టు తెలిపారు.
దర్శన్‌తో కలిసి పనిచేయడం గురించి నిర్మాతలు జాగ్రత్తగా ఉన్నప్పటికీ, అతని బాక్సాఫీస్ ఇమేజ్ అతనిపై పెట్టుబడి పెట్టేలా చేసింది అని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ఆఫీస్ బేరర్ చెప్పారు.
దర్శన్ నేపథ్యం
దర్శన్ నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చారు. ఇతర నటీనటులలాగా కన్నడ సినిమాలో ఆయనకు గాడ్ ఫాదర్లు లేరు. అతని తండ్రి తూగుదీప శ్రీనివాస్ నటుడు, డాక్టర్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్ హౌస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన తండ్రిని చూసిన తర్వాత దర్శన్ సినిమాల్లోకి రావాలని భావించి థియేటర్‌లో శిక్షణ పొందాడు.
శివమొగ్గ సమీపంలోని నీనాసం థియేటర్ శిక్షణా సంస్థలో చేరాడు. కొంతకాలం శిక్షణ పొందాక బయటకు వచ్చాడు. తరువాత దర్శన్, కెమెరామెన్ బిసి గౌరీశంకర్ వద్ద ప్రొజెక్షనిస్ట్‌, అసిస్టెంట్‌గా పనిచేశాడు. అతను మొదటిసారిగామహభారతం కోసం కెమెరా ముందుకు వచ్చాడు. తరువాత 'దేవర మగ' తో పాటు ఇతర చిత్రాలలో కనిపించాడు, అయితే అవి చాలా చిన్న పాత్రలు.
దర్శన్ 2001లో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'మెజెస్టిక్'తో కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కన్నడ సినిమాలో దర్శన్‌ను ప్రముఖ నటుడిగా నిలబెట్టింది. అతని ప్రముఖ చిత్రాలలో కొన్ని కరియ, నమ్మ ప్రీతియ రాము, గజ, సారథి, క్రాంతి వీర సంగొల్లి రాయన్న, బుల్బుల్, యజమాన, కాటేరా వంటి సినిమాలు చేశారు. అతను ప్రస్తుతం ప్రకాష్ వీర్ దర్శకత్వంలో డెవిల్: ది హీరో చిత్రంలో నటిస్తున్నాడు.
మరిన్ని వివాదాలు
ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడతో దర్శన్ ఎఫైర్ ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు. జనవరిలో, దర్శన్‌తో 10 సంవత్సరాలు సహ జీవనం పూర్తయిన సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేయడంతో కలకలం సృష్టించింది. వివాహితుడైన దర్శన్‌తో తనకు సంబంధం ఉందని వీడియోలో సూచించింది.
అతను తన కాటేరా సినిమా విజయం తర్వాత మరో సారి వార్తల్లో నిలిచాడు, నటుడు అంబరీష్ కుమారుడు అభిషేక్ అంబరీష్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, ఇతరులతో కలిసి దర్శన్ బెంగళూరులోని ఒక బార్‌లో అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. అయితే అది కాస్త ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది కలిగించడంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే మరో సంఘటనలో దర్శన్ తన పెంపుడు కుక్కను ఓ మహిళపై విడిచిపెట్టిన సంఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇప్పుడు ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు.
మంచి.. చెడు
దర్శన్ చట్టం బారి నుంచి "అంత తేలికగా" ఎలా తప్పించుకుంటాడని సినీ పరిశ్రమలోని కొందరు విమర్శిస్తున్నారు.
కానీ, దర్శన్‌పై సానుభూతి చూపే వారు ఉన్నారు. ఆయన చూడటానికి మొరటుగా, చిన్నబుచ్చుకునే వ్యక్తిగా ఉన్నప్పటికీ, దర్శన్ చాలా వినయం, మంచి మనిషి అని వాదించే వారు ఉన్నారు.
దర్శన్ తనను తాను జంతు ప్రేమికుడిగా చూపించాడు. మరొక 'స్టార్' సుదీప్‌తో అతని సంబంధం అంత స్నేహపూర్వకంగా లేదు. ఇరు హీరోల అభిమానులు ఒకరికొకరు చాలా సార్లు గొడవపడ్డారు. మరి ఇప్పుడు ఈ మర్డర్ కేసు నుంచి ఆ స్టార్ యాక్టర్ బయట పడతాడో లేదో చూడాలి. మరి సగం సినిమాలను పూర్తి చేసి సెట్స్ పైకి వస్తాడా.
"ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, అవకాశాలు అస్పష్టంగా ఉన్నాయి" అని ఒక సీనియర్ పోలీసు అధికారి కేసు గురించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.


Read More
Next Story