
బాక్సాఫీస్ : 'కూలీ' సినిమా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్, హిట్టేనా?
ఫ్యాన్స్ కు నచ్చినా, భాక్సాఫీస్ బ్రద్దలవ్వలేదు
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' రిలీజ్ కు ముందు తర్వాత కూడా హాట్ టాపిక్ గా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా లోకేశ్ కనగరాజ్ దర్శకుడు కావటం, చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించటంతో క్రేజ్ మామూలుగా క్రియేట్ కాలేదు. కానీ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్‌లో 520 కోట్ల ఫైనల్ కలెక్షన్స్ తో ముగిసింది. వెయ్యికోట్ల వస్తాయనుకున్న ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది.
ఈ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఇక చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం. ఏరియావైజ్ గా..
తమిళనాడు:152 Cr (సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ, “A” సర్టిఫికేట్ వల్ల 18 Cr కోల్పోయినట్లు తెలుస్తోంది – U/A ఉంటే 170 Cr వరకు వెళ్లేది!)
తెలుగు రెండు రాష్ట్రాలు :70 Cr – డీసెంట్ కలెక్షన్స్
కర్ణాటక :43 Cr – బాగానే ఫెరఫార్మ్ చేసినట్లు.
కేరళ :25 Cr –బాగా నిరాశపరిచింది.
నార్త్ ఇండియా :49 Cr – ఎక్సపెక్టేషన్స్ కు రీచ్ కాలేదు
భారత్ లో మొత్తం :340 Cr
ఓవర్ సీస్ :180 Cr
ఓవరాల్ కూలీ చిత్రం మోడరేట్ సక్సెస్ సాధించింది. ఇది తమిళ పరిశ్రమలో రోబో 2.0, జైలర్, లియో తర్వాత 4వ పెద్ద గ్రాసర్ గా రికార్డు చేయబడింది.
ఇది రజనీ ఫ్యాన్స్ కి ట్రీట్ కానీ బాక్సాఫీస్ అంచనాలకంటే యావరేజ్!
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో బాగా చూస్తున్నారు. అర్ధరాత్రి ( సెప్టెంబర్ 11) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్‌లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందని తెలుస్తోంది.
కథేంటి..?
వైజాగ్ పోర్ట్‌లో కింగ్‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్‌పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్‌లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు.
ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ.