అందరి అప్పుల ఖాతాదారుడు ఈవివి
x

అందరి అప్పుల ఖాతాదారుడు ఈవివి

రామ్ సి చేస్తున్న ఈవీవీ సత్యనారాయణ చిత్రాల పరామర్శ. మూడుభాగాల సీరీస్ లో చివరిది.


రామ్ సి

ప్రస్తుతం చేతనైనంత వ్రాసే ప్రయత్నంలో ఈ వ్యాసాలకు ఇంకొంచం క్లుప్తత అవసరం. కానీ నేను ఏదైనా నేర్చుకునేంత వరకు ఆగి, ప్రయత్నం చేసేవాడిని కాకపోవడంతో ,ఇలా ఓ అర్భకుడి ఉత్సాహంతో రాసుకెళ్తున్నాను. నా తప్పులను 'వీడింతే' అని వదిలేయండి. మీరు చెప్పదల్చుకున్నది

నిర్మొహమాటంగా చెప్పండి. నా అనుభవాలని ఆహ్వానించి చూడండి. ఏవైనా ప్రశ్నలంటే అడగండి.

కుటుంబం అంటే దాగి ఉన్న అజెండాల కోసం దొరికే ఒక అద్భుతమైన వేదిక. 'సంపూర్ణమైన కుటుంబం' అనే భావన మానవ జీవితంలో గొప్ప మోసాల్లో ఒకటని నేను నమ్ముతాను. ఈ సినిమా చూసిన తరువాత నాకొక అభిప్రాయమేర్పడింది, అదేంటంటే, అతి సామాన్య విషయాన్ని కూడా ట్రాజెడీ చేసే షేక్స్ స్పియర్ ఒక వైపైతే, అత్యంత ట్రాజెడీ, అనికైతిక,మోసపూరితే,మింగుడుపడని విషయాలన్నిటిని కూడా ఓ వింత శైలిలో హాస్య చమ్మక్కులతో అద్ది రసవత్తరంగా తీర్చిదిద్దగలడు ఈ. వి. వి. అసంపూర్ణాన్ని సంపూర్ణం చేయడం ఓ ప్రత్యేక సమర్ధతకు చిహ్నం. అది ఈ. వి. వి తెలుగు సినిమా కథలకు తెచ్చిన వన్నె.

అసలు అప్పు చుట్టూ అల్లుకునే కథలో, సులభతరంగా విషయాలని చెప్పటం కుదరదు. ఎందుకంటే, అప్పు బాధ్యత, నమ్మకం మీద ఆధారపడ్డ సంగతి. ఇచ్చే వాడికైనా ,తీసుకునే వాడికైనా. కానీ ప్రేక్షుకుడికి తెలుసు సమాజం ఒప్పుకోదని, అయినా సరే ఈ.వి.వి 'అప్పుల అప్పారావు' తీసి ఎందరిని రుణ న్యూనతా భావం నుండి కొద్దీసేపు విముక్తి చేసాడో చెప్పలేను.

నా అనుభవాల్లో నేర్చుకున్న అతి పెద్ద బోధన ఏమిటంటే, కుటుంబ బంధాలు నిష్కపటమైన ప్రేమ పై కాకుండా, అధికారం, నియంత్రణ, బాధ్యతల ముసుగులో దాగిన స్వార్థంపై ఆధారపడి ఉంటాయి.

ఇది తప్పు కాదు, తప్పులతడక మారితే ,సర్దుకొనే సమయముండదని మాత్రమే సుచిస్తుంధీ. ఈ సినిమా ఈ నిజాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. కథానాయకుడు విభిన్న కుటుంబ వ్యవస్థల విషయాల మధ్య చిక్కుకుపోయి, అవి బయటకు చూపించే మాయ, లోపల దాచుకున్న వ్యూహాలు, అంతులేని కుతంత్రాలు ఎలా పని చేస్తాయో అనుభవిస్తాడు.

ఇందులోని పాత్రలు కుటుంబ సభ్యుల ముసుగులు, వారి నిజమైన స్వరూపాలు ఓ సారి మాట్లాడుకొందాం.

1.అమ్మజీ(రమాప్రభ), భర్త బాధ్యతల నుండి తప్పించుకు పారిపోయిన కుటుంబ బాధ్యతల పేరుతో manipulation చేస్తూ తన కూతుర్ల భవిష్యత్తును కాపాడే బాధ్యతగల తల్లిగా కనిపిస్తుంది. కానీ ఆమె వ్యూహరచనలో నిపుణురాలు, అప్పారావును బాధ్యతల ఉచ్చులో బంధించడానికి ఖచ్చితమైన పద్ధతులను అమలు చేస్తుంది.తన కూతుళ్ల వివాహాలను సహజంగా జరిపించలేని స్థితిని కప్పిపుచ్చుకొంటూ, తన భద్రత కోసం వాటిని వ్యాపార లావాదేవీగా అల్లుడని కూడా చూడకుండా, ఖరాకండిగా వాడుకుంటుంది.

2.సుబ్బలక్ష్మి(శోభన) , నీతిని ఆయుధంగా మార్చుకునే కుటుంబ గార్డియన్. సుబ్బలక్ష్మి సత్యనిష్ఠను ప్రదర్శించే ధైర్యవంతురాలుగా కనిపిస్తుంది.కానీ, ఆమె నైతికత ఎంపిక తన స్వార్ధం ఆధారంగా పనిచేస్తుంది. తన కుటుంబ ప్రయోజనాల కోసం అప్పారావును manipulate చేయడంలో వెనుకాడదు. తన లక్ష్యాలను స్వచ్చంగా చెప్పకుండా, అతని బలహీనతలను వినియోగించుకొని తాను రక్షకురాలిగా నిలిచేలా వ్యూహాలు రచిస్తుంది.

3.అప్పారావు(రాజేంద్ర ప్రసాద్) , Master Manipulator తన స్వంత ఆటలోనే చిక్కుకున్న వ్యూహకర్త. అప్పారావు తన స్వార్థాన్ని అణగదొక్కకుండా, ధనం మరియు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వ్యూహాలు రచించుకునే వ్యక్తి. కానీ, నేనే సర్వ వ్యూహకర్త అనుకున్న గేమ్‌లోనే చివరకు తానే ఎక్కువగా మోసపోతాడు. తప్పించుకోవడానికి తాను తీసుకున్న నిర్ణయాలే అతనిని మరింతగా బంధిస్తాయి.

-ఇతర మోసగాళ్లు & అవకాశవాదులు తాతారావు, ఈశ్వర శాస్త్రి, మంగతాయారు, సోనీ. ఒకరు సంప్రదాయాన్ని, ఇతరులు ఆధునికతను, మరొకరు తమ బ్రాండ్ ఇమేజ్‌ను, ప్రేమ పేరుతో ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు.

-ఎంఎల్ఏ నాదెండ్ల అంజయ్య, 'ప్రజా సేవకుడిని' అనిపించుకోవాలని చూసే స్వార్ధ రాజకీయ నాయకుడు, కానీ అవినీతినే నమ్ముకున్నవాడు. తన రాజకీయాలను ఏదొక మోసపూరిత రూపంలో నడిపించేవాడు.

-ఐరోన్లెగ్ & శాస్త్రి, భవిష్యవాణి, మానసిక ఆటల ద్వారా అప్పారావును మోసగించే వ్యక్తులు.

-సుత్తి వేలు తత్వవేత్తలా కనిపించే కుటుంబ బాధ్యతలను తుంగలో తొక్కి తప్పించుకు తిరిగే అమాయకంగా కనిపించే వ్యసనపరుడు, మోసగాడు. పలు సందర్భాల్లో తన తెలివిని ఉపయోగించుకుని ఇతరులపై తన ప్రయోజనాలను సాధించుకునే వ్యక్తి.ఆత్మజ్ఞానం కలిగినట్లు మాట్లాడుతూ, అవసరమైనప్పుడు ఆర్థికంగా లాభపడేలా ప్రవర్తించేవాడు.

-తనికెళ్ళ భరణి ఓ చిలిపి దొంగగా ఆశక్తికరమైన మోసగాడు. ఆ పాత్ర ఒక మాస్టర్ మైండ్ చిలిపి దొంగ.అతని మాటలు వినిపించేంతవరకు సరదాగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక లోతైన వ్యూహం ఉంటుంది.ఆతని పాత్రలో హాస్యం ఉన్నప్పటికీ, అసలు ఉద్దేశం ఎప్పుడూ తన ప్రయోజనాలను రక్షించుకోవడమే.

-అలీ, 'ఇద్దరు తండ్రుల ముద్దుల కొడకా' అనిపించుకొంటూ, నవ్వుల వెనుక ఉన్న వ్యంగ్యం తన సొంత తల్లికి ఇద్దరు భర్తలని, ఆవిడా ఆడో టైపు అని చెప్పుకొని, హాస్యం సృష్టించే వ్యక్తిలా కనిపించినా, అతనిలో తన ఉనికి కోసం చేస్తున్న పోరాటం కనిపిస్తుంది. ఇది చాలా ట్రాజెడీ. ఆయన కామెడీ ద్వారా చూపించేది కుటుంబ సభ్యులలో ఉన్న అసలైన ఆత్మరక్షణ వ్యూహాలు. తనను ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోవడం, కానీ అతని మాటల్లోని నిజాలు కుటుంబ వ్యవస్థలో లోతైన సందేశాన్ని అందించడం ఈ పాత్రకు ప్రత్యేకతను ఇస్తాయి.

సినిమా ఎటువంటి సందేశం ఇవ్వదు, ఎందుకంటే ఇదో paradoxical narrative 'అప్పును' 'కుటుంబానికి' పోలిక తెచ్చి ఒకే తాటికి కట్టేసిన సినిమా. కుటుంబం నుండి తప్పించుకోలేరు, కేవలం దాన్ని తట్టుకోవాలని, సర్దుకుపోవాలని, అదే మీ మోక్ష మార్గమని చెబుతూ, దాన్ని తప్పించుకోలేక పడే ప్రయత్నాలను, అవస్థలను చూపే సినిమా ఇది. సినిమా చివరిలో, అప్పారావు గెలవడు, అతను కుటుంబ వ్యవస్థలోని గందరగోళాన్ని అర్థం చేసుకుని, దాన్ని తట్టుకోవడం నేర్చుకుంటాడు.

ఈ సినిమా పరిచయం చేసే కొన్ని కఠినమైన సత్యాలు,

-'సంపూర్ణమైన కుటుంబం' అనేది ఒక భ్రమని, అందరూ కేవలం గందరగోళాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సిందే అని నొక్కివక్కాణించే సినిమా.

-ప్రేమ ఎప్పుడూ నిష్కల్మషమైనది కాదు, దాని వెనుక ఎప్పుడూ ఏదో ఒక ఆశ, లావాదేవీ, లేదా మోసం, బాధ్యతారాహిత్యం దాగి ఉంటుందని, ఎవరైనా ఎంత మంచివాళ్లలా కనిపించినా, నిజానికి అందరూ తమ స్వంత ప్రయోజనాల కోసం ప్రయత్నించేవారే అని , కొన్ని సందర్భాల్లో పోరాడేవారని దీర్ఘ ముగింపు సన్నివేశాల్లో చేర్చడంతో దర్శకుడు మానవ సంబంధాల జీనీస్ అని తెలిసిపోతుంది. ఈ సినిమా కేవలం వినోదం కోసం తీసిన కుటుంబ గందరగోళపు కథ కాదు, ఇది మానవ సంబంధాల అసలు స్వరూపాన్ని తెరపై ప్రదర్శించే అద్భుతమైన అధ్యయనం.

-నిజానికి ఎవరూ నిస్వార్థులు కారు, కానీ ప్రతిఒక్కరూ ప్రేమ, నైతికత, బాధ్యతల్ని ఒక సాధనంగా వాడుకుంటూ, తమ స్వార్థాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంటారు.ఆచరణ సాధ్యం కానీ సంగతిని చూపే ప్రయత్నం తెలుగు సినిమాకు ఓ నజరానా.

ఇంతకీ నా చివరి ప్రశ్న, మనం నిజంగా ఈ పాత్రల కంటే మంచివాళ్లమేనా? లేక మనం కేవలం మన స్వార్థాన్ని మరింత తెలివిగా దాచుకుంటున్నామా?

Read More
Next Story