ఛీ ఛీ.. ఇదేం ప్రోమో.. ‘టాక్సిక్’ పై విమర్శలు
x
యశ్

ఛీ ఛీ.. ఇదేం ప్రోమో.. ‘టాక్సిక్’ పై విమర్శలు

ఓ మహిళా దర్శకురాలు ఇలా తీశారంటే నమ్మలేకపోతున్నామన్న నెటిజన్లు


కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన రాకింగ్ స్టార్, హీరో ‘యశ్’ తాజాగా కథానాయకుడు నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గ్యాంగ్ స్టర్ తరహలోనే ఉన్న ఈ సినిమా ప్రోమో తాజాగా యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల అయింది.

అయితే ప్రోమో మొత్తం సెక్స్ కంటెంట్ తో అసహ్యంగా ఉండటంతో విమర్శల జడివాన కురుస్తోంది. ఓ మహిళా ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించిందని అనుకోలేదని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

హీరో ఎలివేట్ ను చూపించే ప్రయత్నంలో ఓ కారులో యశ్ శృంగారం చేస్తున్నట్లు చాలా అసభ్యంగా చూపించారు. అలాగే మితిమీరిన రక్తపాతం కూడా ఇందులో కనిపించింది.

‘‘సినిమా అంతర్జాతీయంగా మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. కానీ చూడదగ్గదిగా కనిపించడం లేదు’’ అని ఒక నెటిజన్ విమర్శలు గుప్పించాడు. ప్రగతిశీల భావాలకు పేరుగాంచిన దర్శకురాలు గీతు మోహాన్ దాస్ అలాంటి విజువల్స్ ఎలా తెరకెక్కించారని మరోక వినియోగదారుడు ప్రశ్నించారు.

ప్రోమోలో ఏం ఉంది..
ఇటీవల కాలంలో భారతీయ సినిమా టీజర్ల మాదిరిగానే హీరోయిజాన్ని, రక్తపాతాన్ని ఎక్కువగా చూపించారు. ప్రొమో ఒక అంత్యక్రియలతో ప్రారంభం అవుతుంది. ఒక సాయుధ ముఠా స్మశాన వాటికలో ఉంటుంది.
మరొక వర్గం దాన్నిచుట్టుముడుతుంది. హీరో ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ కారులో వస్తాడు. అతను వచ్చి కారుతో చెట్టును ఢీ కొడతాడు. ఈలోగా అతని సహయకుడు వచ్చి వెనక బంపర్ కింద ఒక బాంబు డిటోనేటర్ అమర్చుతాడు.
కొన్ని క్షణాల తరువాత కారు లో కదలికలు ఉంటాయి. దానిలో హీరో మరో మహిళతో శృంగారం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందులో కనిపించే సీన్లు ఎక్స్ వీడియో తరహాలో కనిపించడం అందరి ఆగ్రహానికి గురైంది.
అయితే ప్రోమో విడుదలైన 24 గంటల్లోనే 4.5 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ప్రోమో మాత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ‘‘టాక్సిక్ టీజర్ నన్ను ఆశ్చర్యపరిచింది. స్టైల్, యాటిట్యూడ్, గందరగోళం. పుట్టిన రోజు శుభాకాంక్షలు యశ్’’ అని రాసుకొచ్చాడు.
టాక్సిక్ గురించి..
టాక్సిక్ చిత్రంలో నయనతారా, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ కీలకపాత్రల్లో నటించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తరువాత యశ్ నటిస్తున్న చిత్రం ఇదే. కేవీఎన్ ప్రొడక్షన్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ల్ పై వెంకట్ కే నారాయణ, యశ్ నిర్మిస్తున్నారు. టాక్సిక్ ఈద్, ఉగాది, గుడి పత్వాల సందర్భంగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు.
Read More
Next Story