తాతా,మనవల ఎమోషన్:  ‘దీపావళి’ ఓటిటి రివ్యూ
x

తాతా,మనవల ఎమోషన్: ‘దీపావళి’ ఓటిటి రివ్యూ

కాన్సెప్టుని నమ్మి తాతా మనవల ఎమోషన్ ని బేస్ చేసుకుని తమిళంలో వచ్చిన చిత్రం ‘కిడ’ . ఈ సినిమాని మన తెలుగులో పెద్ద బ్యానర్ స్రవంతి రవికిషోర్ వారు ‘దీపావళి’ టైటిల్ తో డబ్బింగ్ చేసారు.


కాన్సెప్టుని నమ్మి తాతా మనవల ఎమోషన్ ని బేస్ చేసుకుని తమిళంలో వచ్చిన చిత్రం ‘కిడ’ . ఈ సినిమాని మన తెలుగులో పెద్ద బ్యానర్ స్రవంతి రవికిషోర్ వారు ‘దీపావళి’ టైటిల్ తో డబ్బింగ్ చేసారు. చిన్న సినిమాగా వచ్చిన ఆ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే హీరోలు ఎవరూ లేని ఆ సినిమాని మోసిన వాళ్లు లేరు. చూసిన వాళ్లు బాగుందన్నారు. ఏడాది క్రితం థియేటర్ లో వచ్చిన ఈ చిత్రం ఇన్నాళ్లకు ఆహా ఓటిటిలోకి వచ్చింది. ఆ సినిమా ఎలా ఉంటుంది. అసలు స్టోరీ లైన్ ఏమిటి, చూడదగ్గ సినిమానేనా అనే విషయాలు చూద్దాం.

కథేంటి

తనపల్లి అనే పల్లెటూరిలో జరిగే కథ ఇది. సీనయ్య( పో రామ్) లో మిడిల్ క్లాస్ . అతను ఓ పూరిగుడిసెలో భార్య, మనవడు గణేష్(మాస్టర్ దీపన్) తో కలసి జీవిస్తుంటాడు . వాళ్లకు తోడు ఓ మేక. ఆయన్ని దీపావళికి కోసం మనవడు గణేష్ కొత్తబట్టలు కావాలని అడుగుతాడు. అయితే గణేష్ నచ్చిన డ్రెస్ ఖరీదు రెండువేల రూపాయిలని తెలుస్తుంది. ఆయన దగ్గర అంత డబ్బులు వుండదు. కానీ మనవడు కోరిక తీర్చాలని అనిపిస్తుంది. అప్పు కోసం ట్రై చేస్తాడు కానీ ఎక్కడా దొరకదు.

దాంతో వేరే దారిలేక మొక్కు కోసం పెంచిన మేకని అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే అది మొక్కు మేక కావడం వలన కొనడానికి ఎవరూ ముందుకురారు. అదే టైమ్ లో బాషా మటన్ కొట్టులో పని చేసే వీరయ్య (కాళి వెంకట్) తన బిహేవియర్ తో పని పోతుంది. దాంతో సొంతగా మటన్ కొట్టుపెట్టుకొని బాషా కళ్ళముందే దర్జాగా వ్యాపారం చేయాలని ఫిక్స్ అవుతాడు వీరయ్య. ఈలోగా అతనికి సీనయ్య ఓ మేకను అమ్ముదామనుకుంటున్నాడనే విషయం తెలుస్తుంది.

తనకు ఎలాంటి సెంటిమెంట్ లేవని మొక్క మేక అయినా పర్వాలేదని, పదివేలు ఇచ్చి మేకని కొనుక్కుంటాడు. ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చి, మిగతా డబ్బు ఇవ్వడం కోసం చాలా మంది దగ్గర మటన్ ఇస్తానని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకుంటాడు. అయితే దీపావళి ముందు రోజు రాత్రి మేక దొంగతనం జరుగుతుంది. మరి ఆ మేక దొరికిందా? సీనయ్య మనవనికి కొత్త బట్టలు కొన్నాడా? వీరయ్య మటన్ కొట్టు పెట్టుకోగలిగాడా? చివరికి ఏమైందో తెరపై చూడాలి.

ఎలా ఉంది

ఈ సినిమాని కథగా చెప్పుకోడానికి ఏమీ ఉండదు. కేవలం కొన్ని ఎమోషన్స్, సీన్స్ వాటిని కలిపే స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. పండగ ని అడ్డం పెట్టి చిన్న కుటుంబాల్లో జరిగే విషయాలను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో తాత,మనవల అనుబంధం చూపెట్టాలని దర్శకుడు భావించాడు. ఈ సినిమా ఓ ఇరానీ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. కథ చాలా సహజంగా నడిపారు. కథలో వచ్చే మలుపులు సినిమాని నిండుతనం తేగపోగా డాక్యుమెంటరీ ఫీల్ వచ్చింది.

అయితే ఈ తరహా సినిమాలు చూడటానికి అలవాటు పడినవారికి బాగానే అనిపిస్తుంది. అయితే డైరక్టర్ ఫస్టాఫ్ అసలు విషయంలోకి రావటానికి ఎక్కువ టైమ్ తీసుకోవటంతో కాస్త సాగినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి ఆ పాత్రలు ఎక్కస్తే సినిమా నచ్చుతుంది. సెకండాఫ్ బాగుందనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగానే డిజన్ చేసారు. కొన్ని సీన్స్ కన్నీరు పెడతాయి.

టెక్నికల్ గా ...చూస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. నిర్మాణ బాగున్నాయి. సీన్స్ సహజంగా ఉండాలి అనిపించటం కోసం డైరక్టర్ తీసుకున్న శ్రద్ద మనకు నచ్చుతుంది. నటీ నటులు కూడా తమ స్దాయిలో బాగానే వర్కవుట్ చేసారు. తాతగా పూ రామ్, మనవడిగా దీపన్, వీరస్వామిగా కాళీ వెంకట్ .. తన పాత్రలకు ప్రాణం పోసారు.

చూడచ్చా

ఎమోషనల్ జర్నీగా సాగే ఈ సినిమా చూడటానికి కాస్తంత ఎక్కువ ఓపికే కావాలి. స్లో గా నడిచే ఈ సినిమాని కొద్ది సేపు చూడటం మొదలెడితే చివరి దాకా చూసేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఓ లుక్కేయదగ్గ సినిమానే. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.

ఎక్కడ చూడచ్చు

ఈ సినిమా ఈ టీవి విన్ ఓటిటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story