చీరకట్టుతో ప్రేక్షకులను ఫిదా చేసిన ‘దీపికా’
x
బాలీవుడ్ నటీ..దీపికా పదుకొణే

చీరకట్టుతో ప్రేక్షకులను ఫిదా చేసిన ‘దీపికా’

వాహ్ ఏమందం, మనకే సొంతమైన చీరకట్టులో. అవార్డు తీసుకున్న వారు, ఇచ్చిన వారు, అభిమానులు ఆదివారం బాలీవుడ్ నటి దీపికా పడుకొణే అందాన్ని చూసి రెప్ప వాల్చడం మర్చిపోయారు.


లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్ లోఆదివారం జరిగిన BAFTA అవార్డ్ వేడుకల్లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణే పాల్గొన్నారు. నాట్ ఇన్ ఇంగ్లీష్ కేటగిరిలో పోలీష్ భాషకు చెందిన హిస్టారికల్ డ్రామా ‘ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ బాప్టా అవార్డు గెలుచుకోగా, దర్శకుడు జోనాథన్ గ్లేజర్ కు దీపికా చేతుల మీదుగా అవార్డు అందజేశారు.

ఇంతకుముందు ఏ భారతీయ నటులకు కూడా బాప్టా అవార్డు వేడుకల్లో పాల్గొనే అవకాశం రాలేదు. దీపికా పదుకొణేనే మొదటిది. ఇంతకు ముందు దీపికా ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ‘నాటు నాటు’ పాటకు ముందు జరిగిన కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు.

అవార్డు కంటే ముందు దీపికా ధరించిన చీర ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. వెండి, బంగారు కలయికతో ఉన్న సబ్యసాచి చీరలో మెరుస్తున్న దీపికను చూసి జనాల కళ్లు జిగేల్ మన్నాయి. క్లిష్టమైన సీక్విన్ వర్క్, స్ట్రాపీ స్లీవ్ బ్యాక్ లేస్ బ్లౌజ్ తో అందం రెట్టింపు అయింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో దీపిక నువ్వు దేవకన్యా.. సింపుల్ చీరతో చక్కని చుక్కలా ఉన్నావని.. ఇలా అభిమానులు తమదైన శైలిలో పోస్టులు పొడుతూ సందడి చేశారు.

అవార్డు అందించడంలో దీపికా, ఇద్రిస్ ఎల్బా, దువా లిపా, హగ్ గ్రాంట్, ఆండ్రూ స్కాట్ వంటి పెద్ద స్టార్ల సరసన చేరినట్లయింది. నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో పలు చిత్రాలు కూడా పోటీ పడ్డాయి. వాటిలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, 20 డేస్ ఇన్ మారిపోల్, సొసైటీ ఆఫ్ దీ స్నో, ఫాస్ట్ లైవ్స్ వంటివి ఉన్నాయి. వాటిలో హృదయానికి హత్తుకునేలా ఉన్నా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవార్డు గెలుచుకుంది.

నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోల్లో కొంతమంది ఇలా రాసుకొచ్చారు. ‘ మీరు చూస్తున్న వీడియోల్లో దీపికా అవార్డు అందజేస్తున్నారు. ఇది చాలా అరుదైన కేటగిరి. వాస్తవిక కథలు, లేదా మేధస్సుతో ఆవిష్కరించిన ఊహా ప్రపంచాల కథా వస్తువులు మాత్రమే ఇందులో ఉంటాయి. ఆల్ప్స్ నుంచి ఆండీస్ వరకూ, పోలాండ్ నుంచి సియోల్ వరకూ జరిగినవన్నీ ఇక్కడ ఉంటాయి. వాటిల్లో బాప్టా అవార్డ్ మాత్రం " ది జోన్ ఆఫ్ ది ఇంట్రస్ట్" దక్కించుకుంది’

Read More
Next Story