బ్లింక్ సినిమా ఓటిటి రివ్యూ
x

'బ్లింక్' సినిమా ఓటిటి రివ్యూ

టైమ్ ట్రావెల్ సినిమా అనగానే మనకు ఆదిత్యా 369 సినిమానే గుర్తు వస్తుంది. అది చూసిన వాళ్లు మర్చిపోలేరు. ఇప్పటికి టీవిల్లో వస్తూంటే అతుక్కుపోయి చూస్తూంటారు..


టైమ్ ట్రావెల్ సినిమా అనగానే మనకు ఆదిత్యా 369 సినిమానే గుర్తు వస్తుంది. అది చూసిన వాళ్లు మర్చిపోలేరు. ఇప్పటికి టీవిల్లో వస్తూంటే అతుక్కుపోయి చూస్తూంటారు. అయితే ఆ తర్వాత చాలా టైమ్ ట్రావెల్ సినిమాలు వేర్వేరు భాషల్లో చూసినా అంతగా ముద్ర వేయలేకపోయాయి అన్నది నిజం. అయితే టైమ్ ట్రావెల్ కాన్సెప్టుని కాస్త డీప్ గా తీసుకుని రాసి, తీసిన కథ 'బ్లింక్' మాత్రం ఆలోచనలో పడేస్తుంది. ఓ కొత్త దర్శకుడు తన తొలి చిత్రంలో ఆ స్దాయి ప్రతిభను చూపాడన్నది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా అనే చెప్పాలి. కన్నడంలో వచ్చిన 'బ్లింక్' సినిమా, మార్చి 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కంటెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడా సినిమా ఓటిటిలో రిలీజైంది.

స్టోరీలైన్

అపూర్వ (దీక్షిత్ శెట్టి) డబ్బుకు ఇబ్బంది పడుతూ, చిన్న చిన్న జాబ్ లు చేస్తూ కొత్త జాబ్ లు కోసం వెతుకులాటలో ఉంటాడు.అతని గర్ల్ ప్రెండ్ స్వప్న ( మందార బత్తలహళ్లి) అతనికి సపోర్ట్ గా ఉంటూ ధైర్యం చెప్తూ అప్పుడప్పుడూ డబ్బులు ఇస్తూంటుంది. వాళ్లిద్దరికి ఆర్ట్, థియేటర్ అంటే ఇష్టం. ఆ పోగ్రామ్స్ లో పాల్గొంటూంటారు. అలా ప్రశాంతంగా వెళ్లిపోతున్న అతని జీవితం ఓ నడి వయస్సు వ్యక్తి తనను ఫాలో చేస్తూండటంతో అస్దిరతకు గురి అవుతుంది. ఆ మిడిల్ ఏజ్ వక్తి వచ్చి నీలో కళ్లు ఆర్పకుండా ఎక్కువ సేపు ఉండగలగే అరుదైన క్వాలిటీ ఉంది...నువ్వు సరేనంటే టైమ్ ట్రావెల్ కు చెందిన ఓ చిన్న ఎక్సపరమెంట్ కు సాయిం చేయి. నీకు పది లక్షలు ఇస్తాను అంటాడు. ఆ ప్రయోగంతో ఏ ప్రాణాపాయం లేదని చెప్తాడు.

మొదట అపూర్వ ఒఫ్పుకోడు. కానీ వ్యక్తి ...అపూర్వ గతం గురించిన కొన్ని భయంకరమైన నిజాలు కు చెందిన హింట్స్ ఇస్తూంటాడు. అంతేకాకుండా నీ చనిపోయాడనుకున్న తండ్రి బ్రతికే ఉన్నాడు నేను చూపిస్తాను అని చెప్తాడు. ఇదిలా జరుగుతూంటే అపూర్వకు అచ్చం తనలాగే ఉన్న మరో వ్యక్తి కనపడతాడు. ఆ ప్రయోగంలో పాల్గొనవద్దని హెచ్చరిస్తాడు. అసలు ఆ నడివయస్సు వ్యక్తి ఎవరు...అపూర్వ పుట్టుక గురించి అతనకి ఏం తెలుసు.. అలాగే అపూర్వకు తనలాగే కనపడే మరో వ్యక్తి ఎవరు... చివరకు అపూర్వ ఆ ప్రయోగంలో పాల్గొన్నాడా..ఆ ప్రయోగం ఏమిటి, తండ్రి గురించి అపూర్వకు తెలిసిన రహస్యమేంటి? అతడు టైమ్ మిషన్‍ను ఎందుకు వినియోగించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కన్నడ సినిమా ఈ మధ్యన కాన్సెప్టు ఓరియెంటెడ్ ఫిల్మ్ ల వైపు దృష్టి పెట్టింది. థ్రిల్లింగ్ గా ఉండే సైన్స్ ఫిక్షన్స్ ను సైతం అందిస్తోంది. రీసెంట్ గా కన్నడంలో టైమ్ ట్రావెల్, లూప్ కాన్సెప్ట్‌తో ఆరంభం అనే సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్లీ మళ్లీ టైమ్ ట్రావెల్ బేస్ చేసుకుని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో బ్లింక్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో నటించింది తెలుగువారికి పరిచయం అయిన దీక్షిత్ శెట్టి. నాని 'దసరా' సినిమాలో కీర్తి సురేశ్ కి లవర్ గా కనిపించిన కుర్రాడు. అతను ఇప్పుడు కన్నడలో హీరోగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ప్రారంభం పికప్ అవటానికి టైమ్ పట్టినా ఆ తర్వాత పరుగెడుతుంది. అయితే ఓ టైమ్ వచ్చేసరికి స్లో అయ్యిపోతుంది. రెండు గంటల పైన సాగే ఈ సినిమా ప్రెజెంట్, పాస్ట్ మధ్య కంటిన్యూగా షిప్ట్ అవుతూంటుంది. చాలా జాగ్రత్తగా చూస్తే కానీ ఫాలో కాలేము. ఎప్పటిలాగ మధ్యలో సెల్ ఫోన్ మెసేజ్ లు చూస్తూ ఈ సినిమాని చూడటం కష్టం. టైమ్ ట్రావెల్, కథలో సస్పెన్స్ , ఎమోషన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసారు. సినిమా సింపుల్ గా ప్రారంభమైనా కథ ముందుకు వెళ్లే కొలిదీ కాంప్లికేటెడ్ అయ్యిపోతుంది. కన్ఫూజ్ కాకుండా జాగ్రత్తగా చూస్తే మంచి కిక్ ఇస్తుంది.

టెక్నికల్ గా చూస్తే ..

బ్లింక్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాత్రం కాదు. బ్రిలియెంట్ రాసుకున్న స్క్రిప్టు. చాలా హాలీవుడ్, కొరియన్ ప్రేరణలు కనపుడుతున్నా , సినిమాలో బలమైన ఎమోషన్ మనని కట్టిపారేస్తుంది. అలాగే సినిమాకు మ్యూజిక్, నాటకాలు నేపధ్యం, కవిత్వం అన్ని కలిసి ముందుకు తీసుకెళ్తాయి. డైరక్టర్ తో పాటు టెక్నిషీయన్స్ పెట్టిన ఎఫెర్ట్ మాత్రం మనకు స్పష్టంగా ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. అయితే VFX వర్క్ మాత్రం అంత ఫెరఫెక్ట్ గా అనిపించదు. ప్రసన్న కుమార్ ఎంఎస్ సంగీతం, అనివాశ్ శాస్త్రి సినిమాటోగ్రఫీ చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మాత్రం స్పెషల్ గా చెప్పుకోవాలి. నటుడుగా దీక్షిత్ శెట్టి ఫెరఫెక్ట్. అలాగే మిగతా పాత్రలో చైత్ర జే ఆచార్, మందార బత్తలహళ్లి, గోపాలకృష్ణ దేశ్‍పాండే, వజ్రధీర్ జైన్, సురేశ్ అంగాలీ, కిరణ్ నాయక్, సౌమ్యశ్రీ మర్నాడ్ తమ పాత్రలకు ఫెరఫార్మన్స్ తో ప్రాణం పోసారు.

చూడచ్చా

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి బ్లింక్ మూవీ ఒక మంచి ఛాయిస్ . అలాగే ఫ్యామిలీతో కలిసి చూడదగ్గదే. కాకపోతే కాస్తంత కాన్సర్టేటెడ్ గా చూడాలి. ముఖ్యంగా సెకండాఫ్ ని అర్దం చేసుకుంటూ చూస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది

ఎక్కడ చూడచ్చు

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story