ధురంధర్ 2 తెలుగు వెర్షన్ విధ్వంసం
x

'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విధ్వంసం

లేటుగా మొదలైనా లేటెస్ట్ గా


ధురంధర్ 2 సినిమాను మొదట మార్చి 18 సాయంత్రం నుండి ప్రీమియర్ షోలతో పాటు, అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియను మేకర్స్ సకాలంలో పూర్తి చేయలేకపోయారు. దీనివల్ల హిందీ మినహా మిగిలిన అన్ని భాషల్లో ప్రీమియర్ షోలు, అలాగే మొదటి రోజు (డే 1) షోలు రద్దయ్యాయి. దీని ఫలితంగా, మొదటి రోజు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్క్రీనింగ్ అవ్వగా, తెలుగు మరియు ఇతర డబ్బింగ్ వెర్షన్ల విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అయితే రెండు రోజుల తేడాలో తెలుగు వెర్షన్ రెడీ అయ్యి థియేటర్లలో దిగిపోయింది. మరి ఓపినింగ్స్ ఎలా ఉన్నాయి తెలుగు వెర్షన్ కు చూద్దాం.

మార్చి 18న రావాల్సిన తుపాను కాస్త ఆలస్యమైందని సంబరపడ్డ వాళ్లందరికీ.. రన్వీర్ సింగ్ మైండ్ బ్లాక్ అయ్యే 'రివెంజ్' తీర్చుకుంటున్నాడు. సెన్సార్ ఫార్మాలిటీస్ వల్ల ధురంధర్ 2 తెలుగు వెర్షన్ ప్రీమియర్లు, డే-1 షోలు క్యాన్సిల్ అవ్వడంతో అంతా అయిపోయిందనుకున్నారు. కానీ, అసలు సిసలైన మాస్ జాతర ఇప్పుడే మొదలైంది! డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని, కంటెంట్ థియేటర్లకు చేరినా సరే.. మేకర్స్ తెలివిగా రంజాన్ పండుగ అడ్వాంటేజ్‌ను వాడేసుకోవాలని ప్లాన్ చేశారు.

సస్పెన్స్ మెయింటైన్ చేసి, బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. శనివారం ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఆదిత్య ధర్ మార్క్ స్పై థ్రిల్లర్ కావడంతో, రన్వీర్ యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

ఇదిలా ఉంటే మొన్నటిదాకా బాలీవుడ్ సినిమాలంటే కేవలం నైజాం ఏరియాకే పరిమితం అనుకున్న వాళ్ళందరికీ రన్వీర్ సింగ్ మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చాడు. సెన్సార్ చిక్కులు దాటుకుని లేటుగా వచ్చినా, లేటెస్ట్ గా బాక్సాఫీస్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' తెలుగు వెర్షన్ శనివారం మార్నింగ్ షో నుంచే థియేటర్ల దగ్గర జాతర మొదలుపెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఎవరూ ఊహించలేదు. మార్నింగ్ షోలకే హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయంటే, మ్యాట్నీ సమయానికి స్క్రీన్ల సంఖ్య డబుల్ అయిపోయింది. ఇక ఈవినింగ్ షోల పరిస్థితి చెప్పక్కర్లేదు, టికెట్ల కోసం ఫైటింగ్ జరుగుతోంది. విచిత్రం ఏంటంటే, హిందీ సినిమాలు అస్సలు ఆడని ఆంధ్రాలోని B, C సెంటర్లలో కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సాటర్డే కలెక్షన్లలో ఈ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' ను సైతం వెనక్కి నెట్టేసింది. ఆదివారం బుకింగ్స్ అయితే నిన్న సాయింత్రానికే దాదాపు 90% క్లోజ్ అయిపోయాయి. ఈ రేంజ్ స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ రికార్డులు గల్లంతవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. స్పై థ్రిల్లర్ లో రన్వీర్ సింగ్ యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ హిందీ డబ్బింగ్ సినిమా విధ్వంసం సృష్టించడం రీసెంట్ టైమ్స్ లో ఇదే మొదటిసారి. ఈ జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో ధురంధర్ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.

‘ధురంధర్‌: ది రివెంజ్‌’ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్‌ పూర్తయ్యింది. హిందీతో పోలిస్తే ఈ మూడు భాషల్లో సినిమా రన్‌టైమ్‌ కాస్త ఎక్కువగా ఉండనుంది. హిందీ వెర్షన్‌ 3 గంటల 49 నిమిషాలు కాగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా నిడివి 3 గంటల 51 నిమిషాలుగా ఉంది.

Read More
Next Story