ధురంధర్ 2 పై ప్రొపగండా అంటూ ప్రచారం !?
x

'ధురంధర్ 2' పై 'ప్రొపగండా' అంటూ ప్రచారం !?

మామూలు షాక్ కాదు.. అసలేం జరుగుతోంది?


ఒక పక్క బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ.. మరోపక్క ఇంటర్నెట్ లో అంతులేని వివాదాలు! ఐకాన్ స్టార్ లెవల్లో దూసుకుపోతున్న 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాన్ని ఇప్పుడు వికీపీడియా ఏకంగా 'ప్రొపగండా సినిమా' అని ముద్ర వేయడం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది!

వివరాల్లోకి వెళితే...

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధిస్తోంది. రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం, రంజాన్ సెలవులను అందిపుచ్చుకుని కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ భారీ సక్సెస్ వెంటే ఊహించని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. వికీపీడియా వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ ఈ సినిమాను 'ప్రొపగండా ఫిల్మ్' గా వర్గీకరించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ప్రస్తుతం థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఉండటంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఈ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం ముందు 'గదర్-2', 'జైలర్', 'సలార్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డులు కేవలం నాలుగు రోజుల్లోనే కొట్టుకుపోయాయి. ఆదివారం ఒక్కరోజే భారత్‌లో రూ. 114 కోట్లు వసూలు చేయడం దీని జోరుకు నిదర్శనం. సాక్నిల్క్ (Sacnilk) రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రం బుధవారానికల్లా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

కానీ, ఈ వసూళ్ల సునామీ మధ్య వికీపీడియా చేసిన అటాక్ షాక్ ఇస్తోంది. ఆ పేజీలో ఈ సినిమాను "2026 నాటి హిందీ భాషా స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రొపగండా చిత్రం" అని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ వంటి వారు కూడా ఈ సినిమా ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండాతో కూడి ఉందని విమర్శలు గుప్పించారు.

అసలు దీనిని 'ప్రొపగండా' సినిమా అని ఎందుకు అంటున్నారు?

ఈ చిత్రాన్ని విమర్శకులు 'ప్రొపగండా' అని పిలవడానికి ప్రధాన కారణం ఇందులో రాజకీయ అంశాలను వన్-సైడెడ్ గా చూపించడమే అని ఆరోపణ. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిన 'పెద్ద నోట్ల రద్దు' (Demonetisation) వంటి సున్నితమైన అంశాన్ని ఎటువంటి లోపాలు లేని ఒక గొప్ప దేశభక్తియుత నిర్ణయంగా చిత్రించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా అనేది వినోదం పంచడమే కాకుండా, ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండాను లేదా ప్రభుత్వాన్ని సమర్థించే విధంగా ఉంటే దానిని కళగా కాకుండా 'ప్రచార సాధనం' (Propaganda) గా చూడాలని విమర్శకులు వాదిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ వంటి వారు కూడా ఇదే పాయింట్ ని లేవనెత్తుతూ.. వాస్తవాలను పక్కన పెట్టి కేవలం ఒక వైపు కథను మాత్రమే ఉద్వేగభరితంగా చూపడం వల్ల ఇది సినిమాగా కాకుండా పొలిటికల్ మెసేజ్ గా మారిందని విమర్శిస్తున్నారు

వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్నా, 'ప్రొపగండా' ముద్రతో వివాదాల్లో నిలిచినా.. 'ధురంధర్ 2' మాత్రం ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రలో టాప్-5 చిత్రాల సరసన నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వివాదాల ప్రభావం కలెక్షన్లపై పడుతుందా? లేక సినిమా ఇంకాస్త స్పీడ్ అందుకుంటుందా?

విజయానికి వివాదం తోడైతే హైప్ ఎలా ఉంటుందో 'ధురంధర్ 2' నిరూపిస్తోంది. ఒక సినిమాను ఇలా 'ప్రొపగండా' అని ముద్ర వేయడం సరైనదేనా? లేక ఇది కేవలం క్రియేటివ్ ఫ్రీడమా? వికీపీడియా తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి!

Read More
Next Story