కూలీ ని ఫ్యాన్స్‌నే చంపేసారా?
x

'కూలీ' ని ఫ్యాన్స్‌నే చంపేసారా?

లోకేష్ కనగరాజ్ షాకింగ్ కామెంట్


రజినీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ ఎనౌన్స్ చేయగానే ఒక సెలబ్రేషన్ మూడ్ క్రియేట్ అయ్యింది. కూలి టైటిల్ బయిటకు రాగానే సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆ సినిమా సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అలాగే ట్రైలర్ తోనే సినిమా ఏదో భారీ ఎక్స్‌పెరిమెంట్ అవుతుందనుకుని భావించారు అభిమానులు. లోకేష్ సినిమాటెక్ యూనివర్స్ లో కొత్త లేయర్ ఊహించుకున్న సినీప్రేమికుల. అంతేకాదు మాస్ & క్లాస్ రెండింటికీ కనెక్ట్ అయ్యే గ్యాంగ్‌స్టర్ డ్రామా వస్తుందనుకున్నాయి ట్రేడ్ సర్కిల్స్.

అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, సౌబీర్,శ్రుతి హాసన్ ఇలా చాలా మంది నటులను ఒకేసారి చూసేసరికి, రకరకాల ఊహాగానాలతో ‘కూలీ’పై భారీ బజ్ ఏర్పడింది. రిలీజ్ ముందు ఈ సినిమాను ఒక గేమ్ ఛేంజర్ గా చూడాలనుకున్న అంచనాలు, రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ క్రమంలో ఎందుకు సినిమా వర్కవుట్ కాలేదన్న దానికి మీడియాలోనూ , అభిమానుల్లోనూ, సోషల్ మీడియా జనంలోనూ ఎవరి ఎనాలసిస్ లు వారు చేసుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ... కూలీ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవడమే సినిమా ఇలాంటి రిజల్ట్ కారణమన్నట్లు చెప్పుకొచ్చారు. ట్రైలర్ చూసి కొందరు టైమ్ ట్రావెల్ స్టోరీ అనుకున్నారని తెలిపారు. మరికొందరు తన యూనివర్స్ లో పార్ట్ అని కూడా అన్నట్లు చెప్పారు. కానీ అవే నిజం కాదని తాను విడుదలకు ముందే క్లారిటీగా చెప్పినట్లు, తన తప్పేమీ లేదని గుర్తు చేశారు. అయినా అవేం పట్టించుకోకుండా ఆడియన్స్ ఏవోవో అంచనాలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

వారికి తోచిన అంచనాలు,ఊహలు తోనే థియేటర్స్ కు వచ్చారని తెలిపారు. తప్పుడు అంచనాలతో సినిమాను చూసినప్పుడు తప్పకుండా నిరాశ చెందుతారని తెలిపారు. ఆ విషయంలో తానేం చేయలేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు తాను క‌థ రాయ‌లేన‌ని తెలిపారు. తనకు వచ్చిన కథ రాస్తానని, కూలీ సినిమాతో ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయానని అంగీకరించారు. కానీ నెక్స్ట్ టైమ్ మ‌రింత గ‌ట్ట‌ిగా ప్ర‌య‌త్నిస్తాన‌ని పేర్కొన్నారు.

ఇలా లోకేష్...ఈ సినిమా రిజల్ట్ ని మొత్తం ప్రేక్షకుల అంచనాలకు మీదకు తోసేసి తప్పుకున్నారు.

అయితే ఇక్కడే ఓ ప్రశ్న... ఎందుకు అంచనాలు పెరిగాయి? పెరగటం తప్పా

1. లోకేష్ ట్రాక్ రికార్డ్: ఖైదీ , మాస్టర్ , విక్రమ్ – ప్రతి సినిమాకి స్టైల్, నేరేషన్, మాస్ ట్రీట్మెంట్ అన్నీ వర్క్ అవ్వడం.

2. రజినీకాంత్ ఫ్యాక్టర్: 70+ వయసులో కూడా మాస్ క్రేజ్, ఫ్యాన్ బేస్ వల్ల రజిని సినిమా అంటే వేరే లెవెల్.

3. ట్రైలర్ హైప్: ట్రైలర్‌లో చూపించిన యాక్షన్, గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్స్ – యూనివర్స్‌లో కొత్త లేయర్ అన్నట్టుగా అంచనాలు ఏర్పడటం.

రిలీజ్ తర్వాత ఎందుకు కూలిపోయాయి?

1. స్టోరీ లోపం: రజిని స్టార్డమ్ కు సరిపోయే ఎమోషనల్ ఆర్క్ లేకపోవడం.

2. స్క్రీన్‌ప్లే ఇష్యూస్: లోకేష్ సినిమాలా పేస్, టెన్షన్, కట్టిపడేసే నేరేషన్ కనిపించకపోవడం.

3. లాజిక్ గ్యాప్స్: కొన్ని సీన్స్ అసంపూర్తిగా, కొన్ని సన్నివేశాలు కన్విన్స్ చేయకుండా ఉండటం.

4. ఎక్స్‌పెక్టేషన్స్ – రియాలిటీ క్లాష్: యూనివర్స్ కనెక్షన్ ఉంటుందని నమ్మిన అభిమానులకు డైరెక్ట్ డిసప్పాయింట్.

లోకేష్ వ్యాఖ్యలు సరైనవేనా?

దర్శకుడు లోకేష్ చెప్పినట్లుగా “ప్రేక్షకులే ఎక్కువగా సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు, అది నా తప్పుకాదు” అన్న మాటలో కొంత వాస్తవం ఉంది. కానీ అది పూర్తి సమాధానం కాదు. ఎందుకంటే: సినిమా మిస్సింగ్ కోర్: రజినీ సినిమాల్లో సాధారణంగా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రైవ్ ఇందులో కనిపించలేదు. ఇది లోకేష్ ఫెయిల్.

స్క్రీన్‌ప్లే లోపాలు: ఎంగేజ్‌మెంట్ లేకుండా లాజిక్ లేని సన్నివేశాలతో పొడవు పెరగడం – ఇది కూడా డైరెక్టర్ బాధ్యత.

ప్రేక్షకుల తప్పు కాదేమో: ట్రైలర్ స్టైల్, మార్కెటింగ్ వే లోకేష్ యూనివర్స్ టచ్ ఉందని అభిమానులకు ఫీల్ కలిగించింది. అలా మిస్‌లీడింగ్ జరిగితే ప్రేక్షకులను పూర్తిగా నిందించడం సరైంది కాదు.

అసలు కూలీ ఎక్కడ పూర్తిగా డిసప్పాయింట్ చేసింది?

1. రజినీ క్యారెక్టర్: మాస్‌గా ఉన్నప్పటికీ, అతని ప్రయాణంలో కిక్ తగ్గింది.

2. లొకేషన్ – యాక్షన్ ప్యాకేజింగ్: పెద్ద బడ్జెట్ ఉన్నా, విజువల్ స్పెషల్‌గా గుర్తుండేలా లేకపోవడం.

3. స్క్రీన్ ప్లే : లోకేష్ సినిమాల్లో ఉండే ఎమోషనల్ హైస్ – సైలెన్స్ తో వచ్చే టెన్షన్ – ఇవన్నీ కనిపించలేదు.

ఫైనల్ గా ఒకటే మాట..

లోకేష్ “ప్రేక్షకులే తప్పుగా అంచనాలు పెట్టుకున్నారు” అనడం, వాస్తవానికి సినిమా లోపాలను దాటవేయడానికి ఒక సేఫ్ ఎగ్జిట్ లైన్ లాగా కనిపిస్తోంది. అసలు సమస్య మాత్రం కూలీ లోని స్టోరీ లోపం, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం, బోరింగ్ స్క్రీన్‌ప్లే .

ప్రేక్షకులు ఎప్పుడూ డైరెక్టర్ మాటల కంటే ట్రైలర్, బజ్, గత సినిమాల ఆధారంగా అంచనాలు పెంచుకుంటారు. అలాంటప్పుడు డైరెక్టర్ బాధ్యత – ఆ అంచనాలను సరైన రీతిలో మేనేజ్ చేయడం. కూలీ విషయంలో అది జరగలేదు.

లోకేష్ స్వయంగా అంగీకరించినట్టు – ఈ సినిమా వర్కౌట్ కాలేదు. ఆయన నిజంగా నేర్చుకోవాల్సింది “ఎక్స్‌పెక్టేషన్స్ మేనేజ్‌మెంట్” మాత్రమే కాదు, కథలోని హార్ట్ ని బలంగా ప్యాక్ చేయడం. లేదంటే భవిష్యత్తులో మరిన్ని కూలీలు వస్తే, ప్రతీసారి ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్ కూడా వర్క్ అవ్వవు.బ్రాండ్ నేమ్ ఇమేజ్ ఇంక పని చెయ్యదు.

Read More
Next Story