ఆ పాత్రలో మమ్ముటి నటించారా?
x

ఆ పాత్రలో మమ్ముటి నటించారా?

దర్శకుడు జీయో బేబీ మళయాళీ చిత్రంలో ఎల్‌జీబీటీ+ కమ్యూనిటీని ఎలా చూపారు. ప్రేక్షకాదరణ పొందిన ‘కాథల్‌ - ‌ది కోర్‌’ ‌(Kaathal The Core) చిత్రంలో నటీనటులెవరు?


మాథ్యూ దేవస్సీ కథ ఆధారంగా తెరకెక్కించిన ఎమోషనల్‌ ‌మలయాళ పిక్చర్‌ ‘‌కాథల్‌ - ‌ది కోర్‌’ (Kaathal The Core) ‌జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌ ‌కాబోతుంది. నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభించింది. మంచి హిట్‌ అం‌దుతోంది. ఇతర దక్షిణాది చిత్రాలకు భిన్నంగా ‘కాథల్‌’ 50 ‌రోజుల విరామం తర్వాత స్ట్రీమింగ్‌ ‌ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో పంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకునే రిటైర్డ్ ‌బ్యాంక్‌ ‌మేనేజర్‌ ‌పాత్రలో మమ్ముట్టి కనిపించాడు. జ్యోతిక మమ్ముటికి భార్య (ఓమనా మాథ్యూ)గా నటించారు. మమ్ముటి లైంగిక ధోరణిని ప్రశ్నిస్తూ ఓమనా మాథ్యూ విడాకులకు అప్లై చేయడంతో షాక్‌ అవుతాడు మమ్ముటి. చాలా ప్రశంసలు పొందిన ‘ది గ్రేట్‌ ఇం‌డియన్‌ ‌కిచెన్‌’‌కి పేరుగాంచిన దర్శకుడు జియో బేబీ స్వలింగ సంపర్కం ఇతివృత్తాలను, భారతదేశంలోని చిన్న ప్రదేశాలలో స్వలింగ సంపర్కుల కమ్యూనిటీని ఎలా చూపారో ఈ చిత్రాన్ని చూస్తేగాని తెలియదు.

Read More
Next Story