రవిబాబు ఓటిటి మూవీ 'రష్' రివ్యూ
రష్.. టైటిల్ డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమా రవిబాబుని ఫామ్ లోకి తీసుకు వచ్చే కంటెంటేనా, ఎలా ఉంది చిత్రం? అసలు కథేంటి?
అల్లరి వంటి కామెడీ సినిమాతో కెరీర్ మొదలెట్టిన రవిబాబు ఆ తర్వాత థ్రిల్లర్స్ తీస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అనసూయ, అవును, అమరావతి వంటి సినిమాలు ఆయన్ని గుర్తు చేస్తాయి. అదే సమయంలో నటుడుగానూ ఆయన తనదైన మేనరిజంతో పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు తను ఓ కథ రాసి, నటించి, నిర్మించిన ఓ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కు ఇచ్చారు. ఆ సినిమానే రష్. టైటిల్ డిఫరెంట్ గా ఉన్న ఈ సినిమా రవిబాబుని ఫామ్ లోకి తీసుకు వచ్చే కంటెంటేనా, ఎలా ఉంది చిత్రం? అసలు కథేంటి?
స్టోరీ లైన్:
కార్తీక (డైసీ బోపన్న) తన భర్త ఆదిత్య (కార్తీక్ ఆహుతి) తో ఇద్దరి పిల్లలతో జీవితం గడుపుతూంటుంది. ఏ ఇబ్బందిలేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వీళ్లకి ఓ రోజు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆమె భర్త ఆదిత్యకు ఓ ఫోన్ కాల్ వస్తుంది. తమ స్థలాన్ని ఎవరో కబ్జా చేసారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. దాంతో ఆ మేటర్ సెటిల్ చేద్దామనుకుని బయిలుదేరిన ఆదిత్య యాక్సిడెంట్ కు గురి అవుతాడు. దాంతో అక్కడ వాళ్లు హాస్పటిల్ లో జాయిన్ చేస్తే.. కార్తీక ట్రీట్మెట్ కోసం డబ్బులు ట్రాన్సఫర్ చేసి అక్కడకి బయిలు దేరుతుంది.
పిల్లలను తీసుకుని కారులో హాస్పటిల్ కు బయిలుదేరిన ఆమెకు నలుగురు బైకర్స్ వల్ల ఇబ్బంది ఎదురౌతుంది. వాళ్లతో గొడవ అవటంతో వాళ్లు నీ అంతు చూస్తామని బెదిరిస్తూ వెంటబడుతూంటారు. అయితే కార్తీక వాళ్లను గాయిపరిచి తప్పించుకుంటుంది. అయితే ఆ బైకర్స్ మరెవరో కాదని రౌడీ నర్శింగ్ మనుష్యులని తెలిస్తుంది. నర్శింగ్ ఈ విషయం తెలిసి ఆమెతో టచ్ లోకి వస్తారు. ఆమె కొడుకుని కిడ్నాప్ చేసానని చెప్తాడు. వదలలాంటే ఫలానా పోలీస్ స్టేషన్ ఎవిడెన్స్ రూమ్ లో ఉన్న బ్యాక్ తెమ్మంటాడు. అప్పుడు కార్తీక స్టేషన్ కు బయిలుదేరుతుంది.
ఈలోగా ఈ క్రైమ్ సీన్ లోకి పోలీస్ అధికారి శివ (రవిబాబు) వస్తాడు. కార్తీక వల్లే ఇదంతా జరిగిందని ఆమెను ట్రేస్ చేయటం మొదలెడతాడు. ఈ లోగా ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి విధ్వంసం సృష్టించి మరీ ఆ బ్యాగ్ తెస్తుంది. ఆ బ్యాగ్ లో హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇదంతా సీసీటివి ఫుటేజ్ లో గమనించిన శివ... కార్తీక ఫేస్ చూసి షాక్ అవుతాడు. ఇంతకీ కార్తీక ఎవరు... ఆమెను చూసి అంత పెద్ద పోలీస్ అధికారి ఎందుకు షాక్ అయ్యారు. ఇంతకీ హార్డ్ డిస్క్ లో ఏముంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్స్ ఎంత సహజంగా అనిపిస్తే అంతలా జనాలను ఆకట్టుకుంటాయి. నిజంగా ఈ కథ జరిగిందేమో అనిపించగలిగాలి. ఆ విషయం ఈ సినిమా పాక్షికంగానే విజయం సాధించింది. సినిమాటెక్ ఎలిమెంట్స్ భాషా టైప్ స్క్రీన్ ప్లే.. నేచురాలిటీని వెనక్కి లాగేసింది. అయితే ఈ కథలో ఫలానా హీరో అంటూ లేకపోవటంతో ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా పాత్రలని పరిచయం చేసిన తీరు, తర్వాత మెల్లమెల్లగా కథలోకి తీసుకెళ్తాయి. ఎప్పుడైతే కిడ్నాప్ తెరపైకి వస్తుందో.. అక్కడి నుంచి ప్రేక్షకుడిని తన గ్రిప్ లోకి లాగేసుకుంటాడు దర్శకుడు. ఈ కేసు సంగతి ఏంటో చూద్దామనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరిగిపోతుంది. అయితే ఎక్కువ సేపు ఆ డ్రామాని సస్టైన్ చేయలేకపోయారు. సన్నివేశాలు రొటీన్ గా అనిపించినప్పటికీ.. కొత్త ట్విస్ట్ లు, కార్తీక ఎవరనేది తెరపైకి వస్తుందో అక్కడి నుంచి ఆసక్తిగా మారుతుంది.
క్రైమ్ యాంగిల్ ని, ఫ్యామిలీని స్క్రీన్ ప్లేలో నీట్ గా బ్లెండ్ చేసే ప్రయత్నం చేసారు రవిబాబు. కానీ చీప్ గా చుట్టేసే ప్రయత్నంలో ఆ బ్యూటీ కనపడలేదు. అప్పటికీ ఫస్టాఫ్ లో కొన్ని పోర్షన్స్ డ్రామాని బాగానే క్రియేట్ చేసాయి. సెకండాఫ్ ఈ సినిమాకు మెయిన్ స్టోరీ. ఈ సినిమాకు రియల్ ఇంట్రస్ట్ ప్రొసీడింగ్సే. అవి ప్రీ క్లైమాక్స్ దాకా కనపడలేదు. అయితే పెద్దగా షాకింగ్ గా కానీ, అదిరిపోయే ట్విస్ట్ లు కానీ లేవు, ఉన్నంతలో ఇంట్రస్ట్ ని హోల్డ్ చేయాలనే తాపత్రయమే చివరిదాకా చూడగలిగేలా చేసింది. కానీ థ్రిల్లర్ కు సరిపడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు అనేది నిజం.
ఎస్సై పాత్రలో రవిబాబు కొంచెం కొత్తగా కనిపించారు. తన గెటప్ లో చేసిన మార్పులు బావున్నాయి. పాత్ర పరిధి దాటకుండా చివరి వరకూ ప్రేక్షకులని ద్రుష్టి మరలకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరా పనితనం బావుంది. రాకేష్ అందించిన నేపధ్య సంగీతం కథలోని మూడ్ ని ఎలివేట్ చేసింది. దర్శకుడుకి బడ్జెట్ పరిమితి వల్లనేమో కానీ లో క్వాలిటీలో చుట్టేసారు.
చూడచ్చా:
సినిమా ఓటీటీలో వుంది కాబట్టి ఓ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే ఆడియన్స్ కు ఈ సినిమా మంచి ఆప్షనే.
ఏ ఓటిటిలో ఉంది:
ఈటీవి విన్ లో తెలుగులో ఉంది