అంబానీ చేతికి డిస్నీ ఇండియా
x

అంబానీ చేతికి 'డిస్నీ ఇండియా'

డిస్నీ ఇండియాతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన వయకామ్ 18 మధ్య దాదాపు 1.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఇక మనకు తక్కువ ఖర్చుతో ఓటీటీలు అందుబాటులోకి..


గత రెండు రోజులుగా ఒకటే వార్త.. ముఖేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాల్ట్ డిస్నీ కంపెనీల మధ్య బిగ్ డీల్ కుదిరిందని. తమ మీడియా వ్యాపారాలను భారత మార్కెట్లో విలీనం చేసేందుకు రెండు కంపెనీలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసేశాయని.

అయితే అది పెద్ద పెద్ద వాళ్ల మధ్య జరిగిన పెద్ద బిజినెస్ డీల్ . ఈ బిగ్ డీల్ ద్వారా సామాన్యుడుకు ఏమన్నా కొత్తగా ఒరిగేదేమన్నా ఉందా..ఓటిటి రేట్లు ఏమన్నా తగ్గుతాయా..కొత్త ఎంటర్టైన్మెంట్ ని అంబానీ మనకు అందిస్తాడా?

అంబాని చేసే ప్రతీ బిజినెస్ లక్ష్యం మొదటి నుంచి దేశంలోని సామాన్యుడే. తక్కువ రేటుకు సెల్ ఫోన్ ఇచ్చినా , అందులో వేసుకునే నెట్ బ్యాలెన్స్ ని తగ్గించి మిగతా సంస్దలకు షాక్ ఇచ్చినా అంబానీకే చెల్లు. ఒకప్పుడు నెట్ బ్యాలెన్స్ 2 జిబి ఉంటే నెల మొత్తం వాడే స్దాయి నుంచి రోజుకు 2జిబి వాడే స్దాయికి, అదీ అతి తక్కువ రేటుకు ఇచ్చిన ఘనత అంబానీదే. అలాంటిదే ఏమన్నా ఓటిటి వ్యాపారంలోనూ జరుగుతుందా అనేది సామాన్యుడు ఆశ. అయితే ఇది తెలుసుకోవాలంటే అసలు డీల్ లో ఏం జరిగిందో ఓ సారి చూడాలి.
జియో నెట్‌వర్క్‌కు యజమాని ముఖేష్ అంబానీ ఇప్పుడు OTT దిగ్గజం డిస్నీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా తన OTT నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా చర్చలు జరుగుతుండగా, ఇన్నాళ్లకు డీల్ ఖరారైందని తెలుస్తోంది. రిలయన్స్ 61% వాటాలను కొనుగోలు చేసింది, మిగిలిన 39% వాటాను డిస్నీ కలిగి ఉంటుంది.
ఈ మేరకు రిలయన్స్ 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది. అంటే మనదేశ రూపాయలలో దాదాపు 12,400 కోట్లకు సమానం. ఈ ఎగ్రిమెంట్ ఇరువురు వాటాదారులకు లాభం కలిగేలా డీల్ కుదుర్చుకున్నారట. రిలయన్స్ గ్రూప్‌తో పాటు డిస్నీ రెండూ ఈ డీల్‌తో భారీగా లాభపడనున్నాయి. డిస్నీ , రిలయన్స్ భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి బైండింగ్ ఒప్పందంపై సంతకం చేశాయి.
కచ్చితంగా భారతీయ స్ట్రీమింగ్ , మీడియా చరిత్రలో అతిపెద్ద డీల్ అని చెప్పాలి. దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ కంటెంట్ కోసం జాయింట్ వెంచర్ అనేది ప్రముఖ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా ఉంటుందని కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. దీంతో జరిగేది ఏమిటి అంటే ఒకేచోటకు మొత్తం 120 టీవీ ఛానళ్లు వచ్చి చేరతాయి.
సామాన్యుడుకు పైకి కనపడేవి
కలర్స్, స్టార్‌ప్లస్, స్టార్‌గోల్డ్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 వంటి ప్రముఖ బ్రాండ్‌లు అన్ని ఒకే చోటకు వచ్చి విలీనం కానున్నాయి. అలాగే జియో సినిమా, హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మరిన్ని ఈవెంట్‌లకు యాక్సెస్ అందిస్తుంది. రిలయన్స్-డిస్నీ సంస్థ కలిసి (వయోకామ్ 38 ఛానళ్లు, స్టార్ ఇండియా 70 ఛానళ్లు) మొత్తంగా 120 టీవీ ఛానెల్‌లతో పాటు డిస్నీ హాట్ స్టార్, జియోసినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉండనున్నాయి. ఇలా చేస్తే భారత మార్కెట్లో జేవీ ద్వారా 750 మిలియన్ల మంది ప్రేక్షకులను చేరుకోవచ్చని, ప్రపంచ భారతీయ ప్రవాసులకు సేవలందించవచ్చని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అక్కడితో ఆగుతుందా ఈ డీల్ ఓటీటిలో పెద్ద సంస్దలకు పోటీ ఇస్తుంది
సోనీ, నెట్‌ఫ్లిక్స్‌ లకు భారీ కాంపిటేషనే
ఎంటర్టైన్మెంట్, మీడియా రంగంలో జపాన్‌కు చెందిన సోనీ, ఇండియాస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్ వంటి పోటీదారులకు అంబానీ కంపెనీ ఇప్పుడు ఖచ్చితంగా భారీ పోటీ ఇస్తుంది. రేట్లు తగ్గించాల్సిన అవసరం ఇస్తుంది. లోకల్ కంటెంట్ ఇవ్వాలి. అలాగే నిర్మాతలకు తమ సినిమాలు పోటీ గా అమ్ముకునేందుకు అవకాశం ఇస్తుంది. పోటీ తట్టుకునేందుకు రేట్లు తగ్గి చీప్ రేటుకే ఓటిటి సేవలు అందించాల్సిన పరిస్దితి రావచ్చు.
ముఖేష్ అంబానీ కూడా అదే మాటన్నారు. ఆయన మాట్లాడుతూ.. భారతీయ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికే మైలురాయిగా ఈ డీల్ ని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్‌ డిస్నీతో ఈ వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయటంతో చాలా మార్పులు వస్తాయన్నారు. దేశంలోని ప్రేక్షకులకు సరసమైన ధరలకు కంటెంట్‌ను అందించడానికి సాయపడుతుందని అన్నారు.
Read More
Next Story