సినిమా పైసల పంపకాలు ఖరారు.. ధియేటర్ల సమస్య తీరినట్లేనా?
x

సినిమా పైసల పంపకాలు ఖరారు.. ధియేటర్ల సమస్య తీరినట్లేనా?

తెలంగాణలో శుక్రవారం అంటే ఈ మే 17 నుంచి రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపేస్తున్నామని యాజమాన్యాలు..


తెలంగాణలో శుక్రవారం అంటే ఈ మే 17 నుంచి రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపేస్తున్నామని యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం, నష్టం ఎక్కువ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్ నిర్వాహకులు తెలిపారు.

పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో పాటు.. ఐపీఎల్‌ 2024, ఎన్నికల హడావుడి థియేటర్‌లపై పెను ప్రభావం చూపాయి. అలాగే ఇదే నేపథ్యంలో ఈ సమస్య ఈ స్థాయికి రావడానికి మల్టిప్లెక్స్‌లతో సమానంగా సింగిల్ స్క్రీన్స్‌కు షేర్ ఇవ్వకపోవటమే అని దేవి, సుదర్శన్ థియేటర్ ఓనర్ తెలియజేశారు కూడా. దాంతో అతి తక్కువ రెవెన్యూ షేర్‌తో సింగిల్ స్క్రీన్స్ మెయింటెన్ చేయడం చాలా కష్టమైందని వాపోయారు.

ఈ నేపథ్యంలో ఇదే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ మే 21న తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు నిర్వహించిన మీటింగ్‌లో శిరీష్ రెడ్డి ఫంగారు (శ్రీ. వెంకటేశ్వరా ఫిలిమ్స్, SVC సినిమాస్, సునీల్ నారంగ్ (ఆసియన్ థియేటర్స్, గ్లోబల్ ఫిల్మ్స్ అలాగే పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ సహా ఎగ్జిబిటర్స్ ఈ మీటింగులో ఎక్సహిబిటర్ల మనుగడ కొరకు చర్చలు చేయడం జరిగింది. ఈ విషయమై ప్రకటన విడుదల చేశారు.

సినిమా థియేటర్స్ మూతపడకుండా కాపాడుకోవడానికి తమలో తాము తీసుకున్న నిర్ణయం ద్వారా ఇక నుంచి నైజాం మార్కెట్‌లో సినిమాలకు ఆయా చిత్రాల హక్కుల మొత్తం ఆధారంగా ఈ క్రింది విధంగా మాత్రమే షేర్లు పంచుకోవడం జరుగుతుంది.

1) 30 కోట్ల పైబడి నైజాం హక్కులు కలిగి ఉంటే..

మొదటి వారం: (75 % డిస్ట్రిబ్యూటర్‌కి, 25% ఎక్సిబిటర్.)

రెండవ వారం: (55 % డిస్ట్రిబ్యూటర్, 45% ఎక్సిబిటర్.)

మూడవ వారం: 40 % డిస్ట్రిబ్యూటర్, 60% ఎక్సహిబిటర్. నాలుగవ వారం నుండి 30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎక్సిబిటర్‌కి వచ్చేలా నిర్ణయించడం అయ్యింది.

2) 10 కోట్ల నుండి 30 వరకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఈ క్రింది విధముగా షేర్ అంగీకరించబడినది.

మొదటి వారం: (60 % డిస్ట్రిబ్యూటర్, 40% ఎక్సిబిటర్.)

రెండవ వారం : (50 % డిస్ట్రిబ్యూటర్, 50% ఎక్సిబిటర్.)

మూడవ వారం: (40 % డిస్ట్రిబ్యూటర్, 60% ఎక్సిబిటర్.)

నాలుగవ వారం నుండి (30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎక్సిబిటర్. )

3) 10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు ఈ క్రింది విధముగా % షేర్ అంగీకరించబడినది.

మొదటి వారం: (50 % డిస్ట్రిబ్యూటర్, 50% ఎక్సిబిటర్.)

రెండవ వారం: (40% డిస్ట్రిబ్యూటర్, 60% ఎక్సిబిటర్ )

మూడవ వారం నుండి : (30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎక్సిబిటర్) కి రానున్నాయి.

అయితే ఈ పైన పేర్కొన్న పర్సంటేజ్ విధానము 1వ తేదీ జూలై 2024 నుండి అమలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ… ‘చిన్న పట్టణాల్లో సగటు సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్వహణ ఖర్చు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంటుంది. చాలా థియేటర్లలో రోజుకు రూ. 4,000 కూడా రావడం లేదు. చిన్న సినిమాల వసూళ్లు మరింత పడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో సమీప భవిష్యత్తులో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడంతో.. మేము థియేటర్లను తాత్కాలికంగా మూసివేలని నిర్ణయించుకున్నాం’ అని ప్రకటించారు.

Read More
Next Story