
దీపావళికి థియేటర్లలో ఫుల్ మాస్ మూడ్! రిలీజ్ లిస్ట్
ఈ ఫైర్ ఎవరి సినిమా వెలిగిస్తుంది?
కొన్ని నెలలుగా జస్ట్ ఓకే అన్నట్లు సాగిపోతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కి సెప్టెంబర్ నెలే కొత్త ఊపును తెచ్చింది. విభిన్న జానర్స్‌లో వచ్చిన సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో, ట్రేడ్ సర్కిల్స్‌కి కూడా బూస్ట్ వచ్చింది. దసరా జోష్ మంచి కలెక్షన్స్ కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక అక్టోబర్ మొదట్లోనే “కాంతారా: చాప్టర్ 1” బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ ఇచ్చింది.
కానీ నిజమైన పండుగ వేడి మాత్రం ఇంకా మిగిలే ఉంది — అదే దీపావళి బాక్సాఫీస్ రష్! ఈసారి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు సినిమాలు ఒకే వారం రేస్‌లోకి దూసుకొస్తున్నాయి.
భారతీయ పండుగల్లో దీపావళి అంటే వెలుగుల వేడుక, కానీ సినీ పరిశ్రమకి అది వేల కోట్ల కలెక్షన్‌ల సీజన్. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ “దీపావళి రిలీజ్ ట్రడిషన్” ఇప్పుడు తెలుగులోనూ బలంగా అడుగుపెడుతోంది.
ఒకప్పుడు దీపావళి అంటే తళుక్కుమన్న దీపాలు, బాణాసంచా, కుటుంబ సమాగమం మాత్రమే. కానీ ఇప్పుడు – అది కంటెంట్, స్టార్ పవర్, మార్కెటింగ్, ఆడియెన్స్ బిహేవియర్ అన్నీ కలిసిన సీజనల్ యుద్ధభూమి. సినిమా రిలీజ్ ప్లానింగ్‌లో, దీపావళి అనేది ఇక ఎమోషనల్ సీజన్ కాదు — స్ట్రాటజిక్ సీజన్.
దసరా తర్వాత గ్యాప్ లేకుండా నాలుగు యూత్ డ్రైవన్ సినిమాలు ఒకేసారి థియేటర్లను ఆక్రమించబోతున్నాయి:
కిరణ్ అబ్బవరం – ‘K Ramp’ (అక్టోబర్ 18)
సిద్ధు జొన్నలగడ్డ – ‘తెలుసు కదా’ (అక్టోబర్ 17)
ప్రియదర్శి – ‘మిత్ర మండలి’ (అక్టోబర్ 16)
ప్రదీప్ రంగనాథన్ – ‘Dude’ (దీపావళి వారం)
ప్రతి సినిమా వెనుక వేర్వేరు ట్రేడ్ ఎక్స్‌పెక్టేషన్స్.
‘Dude’ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసింది.
‘K Ramp’ – కిరణ్ అబ్బవరం ఇమేజ్‌కు సరిపోయే మాస్ ఫీల్.
‘తెలుసు కదా’ – సిద్ధు జొన్నలగడ్డ తన అర్బన్ హ్యూమర్‌తో ట్రెండ్ చేయబోతున్నారు.
‘మిత్ర మండలి’ – బన్నీ వాస్ బ్యానర్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూ పెద్ద USP.
వర్డ్ ఆఫ్ మౌత్ — ఈ దీపావళి యుద్ధంలో అసలైన ఆయుధం!
ఈసారి దీపావళి థియేటర్లలో లైట్లు కాదు, ట్రైలర్లు పేలబోతున్నాయి! ప్రతి సినిమా యూత్ టార్గెట్ చేసుకుంటూ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఉంది. కానీ ఒకేసారి రేస్‌లోకి దిగడంతో బాక్సాఫీస్‌లో ఎవరి లైట్ ఎక్కువ వెలిగిపోతుందో చూడాలి. ఎవరి సినిమా టాక్ ఫస్ట్ డే నుంచే పాజిటివ్‌గా ఉంటే, అదే ఫెస్టివల్ వీక్‌ను డామినేట్ చేస్తుంది. దీపావళి రష్‌లో ట్రైలర్లు, మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ అన్నీ ప్రీ-బాటిల్ ఆర్మర్ లాంటివి. కానీ డే-వన్ వర్డ్ ఆఫ్ మౌత్ – అదే ఫైనల్ విన్.
ఏదైమైనా
సెప్టెంబర్ ఊపుతో మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్‌కి దీపావళి అసలు ఫైర్ టెస్ట్. “మిత్ర మండలి” నవ్విస్తుందా, “తెలుసు కదా” కనెక్ట్ అవుతుందా, “Dude” యూత్‌ను దూకిస్తుందా, లేక “K Ramp” మాస్‌లను ఊపేస్తుందా — అదే ఈ పండుగ సీజన్ బాక్సాఫీస్ లైటింగ్ పాయింట్!