దీపావళి 2024  : తెలుగులో ఏ సినిమా హిట్టు.. ఏది ఫట్టు..
x

దీపావళి 2024 : తెలుగులో ఏ సినిమా హిట్టు.. ఏది ఫట్టు..

ఎప్పటిలాగే దీపావళిని టాలీవుడ్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. నాలుగు సినిమాల రిలీజ్‌లతో థియేటర్ల దద్దరిల్లాయి. మరి వీటిలో ఏ సినిమా ఎలాంటి ఫలితాలనిచ్చాయంటే..

ఎప్పటిలాగే దీపావళిని టాలీవుడ్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. బయట బాణా సంచా వెలుగులతో కళకళాలాడిపోతే, థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళ్లాడాయి. దీపావళి పండగ సందర్భంగా ఏకంగా నాలుగు మూవీస్ రిలీజయ్యాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్'తో పాటు కన్నడ డబ్బింగ్ మూవీ 'బఘీర' స్క్రీన్‌పైకి వచ్చేశాయి. ఈ సినిమాలలో దీపావళి విన్నర్ ఎవరు?

'లక్కీ భాస్కర్'

పేరుకు మలయాళ నటుడు అయినా తెలుగువాళ్లకు బాగా దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. ఆయన తాజా చిత్రం 'లక్కీ భాస్కర్'. టీజర్, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. బ్యాంకింగ్ రంగంలో మోసాలపై లాంటి కాన్సెప్ట్ కావడం ఓ వర్గానికి బాగా నచ్చింది. నిర్మాత నాగవంశీ రిలీజ్‌కు ముందే ప్రీమియర్స్‌తో బజ్ క్రియేట్ చేశారు. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి . కాబట్టి ఈ సినిమా దీపావళిని సినిమాతో సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారికి మంచి ఆప్షన్‌గా నిలిచింది. కట్ చేస్తే తొలిరోజు రూ.12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

కిరణ్ అబ్బవరం ‘క’

హిట్, ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం దూసుకెళ్లాడు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్‌ తీసుకొని ఏకంగా పాన్‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘క’. టైటిల్‌ ప్రకటన నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆ ఆసక్తినికి మరింత పెంచేసింది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా (అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ నే తెచ్చుకుంది. మాస్ ఆడియన్స్ సైతం ఈ సినిమాకు క్యూలు కడుతున్నారు.

సాయి పల్లవి 'అమరన్'

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయి పల్లవి ఉండటంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య దీపావళి రోజు (అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూలు తెచ్చుకుంది. తమిళంలో సాలిడ్ హిట్ టాక్ నడుస్తోంది. తెలుగు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా ఎ, మల్టిప్లెక్స్‌లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు కంటతడి పెట్టుకునేలా సాయిపల్లవి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసిందని అంటున్నారు. దీనికి కూడా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ చెప్తోంది.

'బఘీర'

కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో తెలుగు డైరక్టర్‌గా అనిపించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన కథతో వచ్చిన సినిమా ఇది. ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ఈ చిత్రంతో డాక్టర్‌ సూరి డైరెక్టర్‌గా పరిచమయ్యారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా కన్నడంలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. హీరో పోలీస్. కానీ వ్యవస్థ పనితీరు వల్ల రాత్రి వేళలో ముసుగు వేసుకుని మరీ విలన్లని చెండాడటం అనే కాన్సెప్టు మనవాళ్లకు బాగా పాతది అనిపించింది.

ఫైనల్ గా 'బఘీర'ని ప‌క్క‌న పెడితే.. మిగిలిన‌ మూడు సినిమాల‌కూ మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. అమ‌ర‌న్‌, ల‌క్కీ భాస్క‌ర్‌, క చిత్రాలు దీపావ‌ళిని క్యాష్ చేసుకోగ‌లిగినట్లే. అయితే.. ‘అమ‌ర‌న్‌’ మాత్రం మ‌ల్టీప్లెక్సుల్లో ఎక్కువ మంది చూస్తున్నారు. ఇదో డ‌బ్బింగ్ సినిమా. కిరణ్ అబ్బవరం ‘క’ క్రింద సెంటర్లలలో రన్ బాగుంది.

Read More
Next Story