షారుక్ ఖాన్  డుంకీ మూవీ రివ్యూ
x
డుంకీ చిత్రం

షారుక్ ఖాన్ 'డుంకీ' మూవీ రివ్యూ

రాజ్ కుమార్ హీరాణీ, షారుక్ ఖాన్ కాంబో. పేరు మోసిన నటీనటులు ఉన్న చిత్రం డుంకీ. అంచనాలు అందుకుందా? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి.. ఏదైన సందేశాన్ని అందించిందా?


పఠాన్, జవాన్ తరువాత షారుక్ ఈ సంవత్సరంలో విడుదల చేసిన మూడో సినిమా. డుంకీని బాలీవుడ్ అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హీరాణీ తెరకెక్కించారు. అక్రమ వలసదారులైన తాప్సీ( మను), బుగ్గు( విక్రమ్ కొచ్చర్) బల్లి( అనిల్ గ్రోవర్) ఇక సైనికుడు హర్డీ సింగ్ పాత్రలో షారుక్ కనిపించారు. విక్కీ కౌశల్ పాత్ర నిడివి తక్కువే అయినా ప్రభావవంతంగా తీర్చిదిద్దారు.

ఈ ముగ్గురు వలసదారుల కథనే డుంకీ సినిమా నేపథ్యం. ముగ్గురు తమ కష్టాన్ని, ప్రాణాలను ఫణంగా పెట్టి ఇండియా నుంచి ఇంగ్లండ్ కు దొంగతనంగా వెళ్లాలని అనుకుంటారు. అందుకోసం వారు చేసే పనుల నుంచి కామెడీని సృష్టించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే ఇవన్నీ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది తప్పా.. సహజంగా జరుగుతున్నట్లు అనిపించదు. పైగా ఇవన్నీ హీరాణీ గత చిత్రాల కామెడీ ట్రాక్ ను పోలీ ఉన్నట్లు ప్రేక్షకులు చాలా సులువుగా గుర్తిస్తారు.

సినీ కథారచయితలయినా కనికా ధిల్లాన్, అభిజిత్ జోషి ఇద్దరు పంజాబ్ గ్రామీణ ప్రాంతంలో పెరిగిన యువత విదేశాలకు వెళ్లడానికి కలల కనే కథగా దీన్ని తీర్చిదిద్దాడానికి ప్రయత్నించారు. విదేశాల్లో నివసించడానికి వారు ఎన్నికష్టాలైన భరిస్తారనే విషయాన్ని కథలో వివరంగా చర్చించాలని అనుకున్నారు.

దాబాలో పని చేసే మను తల్లిదండ్రుల ఇంటిని తిరిగి కొనాలని అనుకుంటుంది. బుగ్గు తన ప్యాంటు ధరించిన తల్లి సెక్యూరిటీ గార్డుగా పనికి వెళ్లడం, బుల్లి తన బార్బర్ ఉద్యోగాన్ని అసహ్యహించుకోవడం అనే వాస్తవాలకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

2013లో పాకిస్తాన్ లో విడుదలై ప్రశంసలు పొందిన చిత్రం జిందా బాగ్ వలే పూర్తిగా కాకుండా అదే అక్రమ ఇమ్మిగ్రేషన్ కథాంశంపై ఆధారపడి ఈ సినిమా కథను నడిపే ప్రయత్నం చేశారు. అయితే అవరసరమైనంత లోతుగా అక్రమ వలసదారుల అంశంపై అధ్యయనం చేయలేదని తెలుస్తుంది. కథకు అవసరమైన విషయాలపై సీరియస్ దృష్టి పెట్టి చర్చించడంలో సినిమా విఫలమైందని చెప్పవచ్చు.

అయితే ఇంగ్లండ్ చేరుకున్న తరువాత అక్రమ వలసదారులు ఏం ఆశించారో మాత్రం ఇందులో సరిగా చూపించలేదు. కానీ మను, హర్డీ, బుగ్గుతో పాటు మరో ముగ్గురితో కలిసి ఇంగ్లాండ్ చేరుకోవడానికి డుంకీ మార్గంలో ప్రయాణించే సన్నివేశాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అక్రమంగా పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్గనిస్తాన్, టర్కీ నుంచి ఇంగ్లండ్ చేరుకుంటారు.

కాలినడకన, రైలులో, ట్రక్కు, కంటైనర్లు ఇలా విన్నూత్నంగా దృశ్యాలను మలిచారు. ముఖ్యంగా రాత్రిపూట నీటి అడుగున నడవడం, 27 రోజులు కంటైనర్ లో ఉంచడం, ప్రమాదకర ఎడారి భూభాగాలను దాటడం ప్రభావవంతంగా ఉన్నాయి. అయితే దీర్ఘకాలంలో అక్రమ వలసదారులు ఎటువంటి కష్టాలు పడతారనే విషయంలో ప్రేక్షకుడికి ఆలోచించే వ్యవధి లభించదు. ఒక మహిళ పాకిస్తాన్ పడవ ఎక్కేముందు తిరిగి తన మాతృభూమిని తిరిగి చూసే క్షణం మాత్రం మాటల్లో వర్ణించలేం.

యూరప్, యూఎస్ లలో ప్రవేశించడానికి గతేడాది పది లక్షల మంది భారతీయులు ప్రయత్నించారని యూఎస్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన గణాంకాలను సైతం రాజ్ కుమార్ హీరాణీ ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు. ప్రీతమ్ సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా లట్ పుట్ గయా, ఓ మహి సాంగ్ ఆకట్టుకున్నాయి. మిగిలిన పాత్రల తీరులో మున్నాభాయ్, త్రి ఇడియట్స్ సినిమాలోని పాత్రలను పోలి ఉన్నాయి.

మొత్తానికి డుంకీ మిశ్రమంగా ఉంది. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్స్ మధ్య డుంకి బాక్సీపీస్ పై గణనీయమైన ప్రభావం చూపిస్తుందా.

. ఇంతకుముందు భారీ యాక్షన్ సినిమాలు చూసిన షారుక్ అభిమానులు ఈ పాత్రలో ఆయనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలిక.

Read More
Next Story