
తెలుగు సినిమా నిర్మాతలపై ఎగ్జిబిటర్ల వార్!
'షేర్' మల్టీప్లెక్స్‌కి... 'శాపం' సింగిల్ స్క్రీన్‌కా?!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల వ్యవస్థ మరో కీలక మలుపు తీరుతోంది. "సినిమా థియేటర్ల మనుగడ అద్దె కింద కాదుగానీ.. షేర్ పద్ధతిలోనే సాధ్యం" అంటూ తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు. వచ్చే జూన్ 1 నుండి సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ మూసివేస్తామని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు షేర్ పద్ధతిని అంగీకరించని పక్షంలో ఈ నిర్ణయం అమలవుతుందని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం జరిగిన అత్యవసర సమావేశంలో స్పష్టం చేశారు.
మల్టీప్లెక్స్‌లలో ఎప్పటికీ అమలులో ఉన్న పర్సంటేజ్ షేర్ మోడల్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ అమలవ్వాలన్నది ఎగ్జిబిటర్ల గట్టిన డిమాండ్‌గా మారింది. “ఇక అద్దె (రెంటల్) కింద సినిమాలు కాదు… పర్సంటేజ్ షేర్ పద్ధతిలోనే!” అంటూ ఎగ్జిబిటర్లు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
రెంటల్ vs పర్సంటేజ్ – ఎవరి నష్టం, ఎవరి లాభం?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు అధికంగా రెంటల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విధానంలో, నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లు ఒక నిర్దిష్ట అద్దెకు థియేటర్లను బుక్ చేసుకుంటారు. సినిమాకు వచ్చిన కలెక్షన్లపై ఎగ్జిబిటర్లకు లాభం వచ్చినా, నష్టమైనా సంబంధం ఉండదు.
"The First Week Is Goldmine for Producers, But Graveyard for Exhibitors" — ఎగ్జిబిటర్ ఆవేదన
కానీ, ఈ విధానంలో ఓ మెలిక ఉంది. కొంచెం క్రేజ్ ఉన్న సినిమాలు మొదటి రెండు వారాలు రెంటల్ బేస్ మీద ఆడి, ఆ తర్వాత కలెక్షన్లు పడిపోయిన తర్వాత పర్సంటేజ్ మోడల్‌కు మారాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల థియేటర్లు నిలబడలేని స్థితికి చేరుతున్నాయని, ఏరియాలవారీగా పర్సంటేజ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు.
ప్రస్తుత పరిస్థితి
రెంటల్ మోడల్ వల్ల కలెక్షన్లు రాకపోతే, చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు షోలను క్యాన్సిల్ చేయడం, లేదా పూర్తిగా మూసేయడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఇదే సమయంలో, మల్టీప్లెక్స్‌లలో మాత్రం ‘పర్సంటేజ్ షేర్’ పద్ధతి అమలులో ఉంది. దాంతో సింగిల్ స్క్రీన్‌లలోనూ అదే విధానాన్ని తీసుకురావాలి అనే అభిప్రాయాన్ని ఎగ్జిబిటర్లు వ్యక్తం చేస్తున్నారు.
వారంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు –
"నష్టం మాకు, లాభం వారికి – ఇది న్యాయమా?"
అంతేకాదు, స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సమయంలో, థియేటర్ల మనుగడని పట్టించుకోకపోవడమే అసలైన అన్యాయమని వాదిస్తున్నారు.
యాక్టివ్ నిర్మాతల వ్యతిరేకత
మరోవైపు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఈ డిమాండ్‌కు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల వాదన ఇలా ఉంది:
"మేము భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తాం. ప్రమోషన్ కోసం కోట్లల్లో ఖర్చు పెడతాం. మొదటి వారంలోనే మా పెట్టుబడిని తిరిగి రాబట్టాలి. అలాంటప్పుడు ‘పర్సంటేజ్ షేర్’ మోడల్‌లో నష్టాలే మిగులుతాయి."
వాస్తవానికి, ఈ విధానం అమలవితే పెద్ద సినిమాలకు రూ.10-20 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
ఈ క్రమంలో యాక్టివ్ నిర్మాతలు అందరూ ఒక్కటి అయ్యారని తెలుస్తోంది. అంతే కాదు సితార, మైత్రీ సంస్థలు కలసి ఇకపై తమ సినిమాలను మల్టీప్లెక్స్‌లలో మాత్రమే రిలీజ్ చేస్తామని ప్రకటించినట్లు సమాచారం.
సింగిల్ థియేటర్స్ లో అధిక భాగం థియేటర్లు డి.సురేశ్ బాబు, ఆసియన్ సునీల్, దిల్ రాజు-శిరీష్ చేతుల్లో ఉన్నాయి. దాంతో ఎగ్జిబిటర్స్ వెనుక సురేశ్ బాబు, సునీల్, శిరీష్ ఉంటే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ వెనుక మైత్రీ, సితార సంస్థలు నిలబడ్డారని తెలుస్తోంది.
ఎగ్జిబిటర్స్ డిమాండ్ ఇలా ఉంది:
గ్రాసర్ (Gross Collections) 1వ వారం 2వ వారం 3వ వారం & తర్వాత
₹30 కోట్లకు పైగా (హిట్స్) 25% 45% 60% → 70%
₹10-30 కోట్లు 40% 50% 60% → 70%
₹10 కోట్లు లోపు (చిన్న సినిమాలు) 50% 60% 70%
సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత: తాత్కాలిక సమస్య కాదు… దీర్ఘకాలిక సంకేతం!
తెలుగు రాష్ట్రాల్లో 1600కి పైగా థియేటర్లు ఉన్నాయి.
వాటిలో సుమారు 70% సింగిల్ స్క్రీన్స్ — చాలావరకూ నష్టాల్లో ఉన్నాయి.
ఓటిటీల ప్రభావం, ఖర్చుల పెరుగుదల, రెంటల్ ఒత్తిడి… అన్నీ కలిపి ఎగ్జిబిటర్లను తినేస్తున్నాయి.
ఏదైమైనా "Content is King, but Revenue Sharing is Survival" — అనేది నిజం.