₹2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే…  ₹21 కోట్లు వసూళ్ళు. కరణ్ జోహార్ రీమేక్ బోనస్
x

₹2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే… ₹21 కోట్లు వసూళ్ళు. కరణ్ జోహార్ రీమేక్ బోనస్

చిన్న సినిమా బ్లాక్‌బస్టర్: ‘Bou Buttu Bhuta’ బాలీవుడ్ దాకా!

స్కేర్ + లాఫ్ కాంబో – మానవ మానసికతలో భయం తర్వాత వచ్చే నవ్వు ఒక బలమైన రియాక్షన్. అలా భయం పుట్టించి వెంటనే నవ్వించే జానర్ ఏదంటే – హారర్ కామెడీ. ఈ ఫార్ములా ఇండియన్ సినిమాల్లో గత దశాబ్దంగా ఒక సేఫ్ బెట్. కాంచన సిరీస్ (తమిళం), స్త్రీ (హిందీ), భూల్ భులయ్యా 2 (హిందీ), రాజుగారి గది (తెలుగు) – ఇవన్నీ రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు అదే మ్యాజిక్ ఒడియా ఇండస్ట్రీలో జరిగింది. అదే ‘Bou Buttu Bhuta’ – చిన్న సినిమా, కానీ బాక్సాఫీస్ వద్ద పెద్ద అద్భుతం!

కరన్ జోహార్ కన్ను పడిన సినిమా!

ఒడియా ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన ఈ హారర్ కామెడీని ఇప్పుడు బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ కరన్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్( Dharma Productions) ద్వారా రీమేక్ చేయబోతున్నాడు. బబుశాన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రైట్స్‌ను కొనుగోలు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. రీమేక్ పాన్-ఇండియా లాంగ్వేజెస్‌లో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్‌గా కూడా రిలీజ్ అవుతుంది.

చిన్న సినిమా, పెద్ద కలలు!

బడ్జెట్: ₹2–3 కోట్లు

వసూళ్లు: ₹21 కోట్లు

ఫస్ట్ డే: ₹51.2 లక్షలు (అన్ని రికార్డుల బ్రేక్)

రన్: 50 రోజులు థియేటర్లలో

మిడ్‌నైట్ రిలీజ్ అనే కొత్త ప్రయోగం యూత్‌లో హైప్ క్రియేట్ చేసింది. “చిన్న సినిమా కదా” అనుకున్న అంచనాలను బద్దలు కొట్టి మాస్ ఫినామినన్ అయ్యింది.

“Small is the new big.” – Seth Godin

(Bou Buttu Bhuta దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ.)

టైటిల్ & కథ

‘Bou Buttu Bhuta’ అంటే “కొత్త పెళ్లికూతురు – భూతం.”

కథలో – చేపల రైతు బుట్టు తన తల్లి రత్నమాల (మాంత్రికురాలు)తో జీవిస్తాడు. ఊరు వదిలి వెళ్లాలని కోరుకున్నా, ఆర్థిక ఇబ్బందులు అడ్డం అవుతాయి. meanwhile, గ్రామ డాక్టర్ కుమార్తె రింకికి బుట్టుపై ప్రేమ ఉంటుంది.

ఒక రాత్రి గ్రామస్థుల చేతిలో చనిపోయిన అమరి ఆత్మ బుట్టుని ఆక్రమిస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు భయం + నవ్వుల కలయికతో సాగుతాయి. క్లైమాక్స్ ఓపెన్–ఎండెడ్‌గా ముగిసి, సీక్వెల్‌కు అవకాశం వదిలిపెట్టింది.

హిట్ కు కారణాలు

జానర్ మిక్స్ – భయం + కామెడీ రోలర్ కోస్టర్ అనుభవం.

లోకల్ కల్చర్ – ఒడియా ఫోక్ ఎలిమెంట్స్, ఊరి ఆచారాలు.

బబుశాన్ పెర్ఫార్మెన్స్ – సినిమా హైలైట్.

బడ్జెట్ vs అవుట్‌పుట్ – చిన్న బడ్జెట్‌లో పెద్ద సినిమా లుక్.

థియేటర్ మూడ్ – కేకలు + నవ్వులు కలిపి ఫెస్టివల్ ఫీలింగ్.

ఎమోషనల్ లేయర్ – ఫ్యామిలీ టచ్.

మొత్తం మీద, ఇది ఎంటర్టైనింగ్ హిట్. కానీ స్క్రీన్‌ప్లే స్ట్రాంగ్‌గా ఉంటే, ఇది “ఆల్‌టైమ్ క్లాసిక్” అయ్యేది.

అసలు హారర్ కామెడీలు ఎందుకు సక్సెస్ అవుతాయి?

తక్కువ బడ్జెట్, ఎక్కువ రిటర్న్స్ – రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. థియేటర్ అనుభవం – గ్రూప్‌గా చూసే మజా, లైవ్ రియాక్షన్స్. రిపీట్ వ్యాల్యూ – కామెడీ వల్ల మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. యూనివర్సల్ అట్రాక్షన్ – యూత్, ఫ్యామిలీ రెండూ కనెక్ట్ అవుతారు.

“Don’t just sell a movie, sell an experience.”

(హారర్ కామెడీ అంటే అదే!)

బబుశాన్ ఆనందం – ఒలీవుడ్ కలల రెక్కలు

“ఇది మా కోసం మాత్రమే కాదు, మొత్తం ఒడియా ఇండస్ట్రీకి గర్వకారణం. క్రియేటివిటీ, కమర్షియల్ రెండింటికీ కొత్త తలుపులు తెరుస్తుంది. యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కి ఇది గట్టి ప్రోత్సాహం” అని బబుశాన్ అన్నారు.

చరిత్రాత్మక ఘట్టం

1976లో Shesha Shrabana హిందీలో Naiyyaగా రీమేక్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు Bou Buttu Bhuta రీమేక్ రైట్స్ బాలీవుడ్ టాప్ హౌస్ చేతికి వెళ్లడం ఒలీవుడ్‌కి మైలురాయి.

* Hindi రీమేక్ మార్కెట్ ₹100 కోట్ల+ వరకు వెళ్లే అవకాశం. అలాగే చిన్న సినిమాలకు OTT బయ్యర్స్ రెడీగా ఉన్నారు.

ఫైనల్ గా..

చిన్న సినిమా సరైన జానర్, సరైన టైమింగ్, సరైన థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటే, అది లోకల్ మూవీ నుంచి నేషనల్ ఫినామినన్ అవుతుంది అనే విషయాన్ని ‘Bou Buttu Bhuta’ రుజువు చేసింది.

హారర్ కామెడీ పవర్, బబుశాన్ పెర్ఫార్మెన్స్, థియేటర్ మూడ్—all combined చేసి ఇది బ్లాక్‌బస్టర్ అయ్యింది. imperfections ఉన్నా, ఒడియా ఇండస్ట్రీని నేషనల్ మ్యాప్ మీద పెట్టిన సినిమా.

‘Bou Buttu Bhuta’ రీమేక్ చేయడం ఈ ట్రెండ్‌కి పాన్-ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లే!

Read More
Next Story