తెలుగువారినీ ఊపేసిన ధర్మేంద్ర హిట్స్
x

తెలుగువారినీ ఊపేసిన ధర్మేంద్ర హిట్స్

రీమేక్‌లు, ఫ్రీమేక్ లుగా వచ్చినవి ఇవే?


భారతీయ సినిమాకు ధర్మేంద్ర అనేది కేవలం ఒక పేరు కాదు — అది ఒక శక్తి, ఒక కాలం, ఒక మనోభావం. ఆయన తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు కేవలం హీరోని చూడలేదు. ఒక మనిషి లోని బలహీనతలు, ధైర్యం, ప్రేమ, విలువలు — అన్నీ కలిసిన జీవన రూపంని చూసారు. 1960లలో ప్రారంభమైన ఆయన ప్రయాణం, 1980ల దాకా సాగిన ప్రభావం, నేటికీ మనసుల్లో ప్రతిధ్వనిస్తుంది.

ధర్మేంద్ర సినిమాలు ఎప్పుడూ ఫార్ములా కాదు. అవి భావోద్వేగం, న్యాయం, మనసు, మానవత్వం అనే నాలుగు స్తంభాల మీద నిలిచినవి. ఆయన పాత్రలు కొన్నిసార్లు రఫ్‌గా, కొన్నిసార్లు రొమాంటిక్‌గా, కానీ ఎప్పుడూ నిజాయితీతో ఉంటాయి. అందుకే ఆయన సూపర్‌హిట్స్ భాషలను దాటి, దేశపు హృదయాన్ని తాకాయి.

హిందీ తెరపై పుట్టిన Phool Aur Patthar, Seeta Aur Geeta, Sholay, The Burning Train వంటి సినిమాలు సౌత్‌లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొత్త రూపాలతో పునర్జన్మ పొందాయి. అవి కేవలం రీమేక్‌లు కాదు — ధర్మేంద్ర ఆత్మను మళ్లీ పలికించిన కథలు. అంతేకాదు దక్షిణాది భాషల్లో కూడా వేర్వేరు రూపాల్లో(రీమేక్ లు, ఫ్రీమేక్ లు, అనుకరణలు) ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. తమిళం, తెలుగు, మలయాళలలో ఆయన సినిమాల రీమేక్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలవడం ఆయన పాన్-ఇండియా ప్రభావానికి నిదర్శనం.

‘ఫూల్ అవుర్ పత్తర్’ నుంచి దక్షిణ రీమేక్‌ల దాకా!

1966లో వచ్చిన ‘ఫూల్ అవుర్ పత్తర్’ చిత్రం ధర్మేంద్రను ఒక్క రాత్రిలోనే స్టార్‌ చేసేసింది. ఆ సినిమా హృదయాన్ని కదిలించే డ్రామా, భావోద్వేగం తో కూడిన సీన్స్ తో సాగే ఈ చిత్రం నిండు మనసులు (తెలుగు, 1967), ఓలి విలక్కు (తమిళం, 1968), పుతియ వెలిచం (మలయాళం, 1979) రూపాల్లో మళ్లీ జన్మించింది. ప్రతి రీమేక్‌ కూడా సౌత్‌లో భారీ హిట్టయింది.

‘సీతా ఔర్ గీతా’ సౌత్‌లో రీమేక్ లుగా కలకలం!

1972లో ధర్మేంద్ర–హేమామాలినీ జంటగా వచ్చిన ‘సీతా ఔర్ గీతా’ — ట్విన్ స్వాప్ కామెడీగా ఇండియాలో కలర్‌ఫుల్ రికార్డ్ సృష్టించింది. దాని రీమేక్‌లు గంగా మంగా (తెలుగు, 1973) మరియు వాణీ రాణీ (తమిళం, 1974) కూడా బాక్సాఫీస్‌ వద్ద మాయచేశాయి. అదే తరహాలో ఇన్సాఫ్ కి పుకార్ (1987) కూడా తెలుగులో గురు శిష్యులు టైటిల్ తో కృష్ణంరాజు, రాజేంద్రప్రసాద్ హీరోలుగా వచ్చింది.

‘షోలేని ఎవరూ తాకలేరు — కానీ..!

1975లో వచ్చిన షోలే— భారత సినిమా చరిత్రలో లెజెండ్‌గా నిలిచింది. ధర్మేంద్ర పోషించిన “వీరు” పాత్ర సౌత్‌లోనూ క్రేజ్ క్రియేట్ చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే — డైరక్ట్ గా రీమేక్ రాలేదు కానీ ఈ చిత్రం ఛాయిలు చాలా పాత సినిమాల్లో కనిపిస్తాయి. అలాగే ఆ తర్వాత 2011లో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ క్లాసిక్‌కు తెలుగు రీమేక్‌గా ప్రభాస్, గోపిచంద్‌తో ప్లాన్ చేశారని చెప్తారు. కానీ ఒరిజనల్ దర్శకుడు రమేష్ సిప్పీ “క్లాసిక్‌ని తాకొద్దు” అని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

1980లలో కూడా ధర్మేంద్ర ప్రభావం కొనసాగింది!

ది బర్నింగ్ ట్రైన్ (1980) — ధర్మేంద్ర, హేమామాలిని, వినోద్ ఖన్నా నటించిన ఈ యాక్షన్-థ్రిల్లర్‌ అన్ని చోట్లా సూపర్ హిట్ . సౌత్‌ స్టేట్ ల్లోనూ బాగా ఆడింది. దీన్ని రీమేక్ చేద్దామనుకుని, ఆ ప్లేవర్ మళ్లీ తేలేమని ఆగిపోయారని చెప్తారు. అయితే రీసెంట్ గా హిందీ నిర్మాత జాగీ భగ్నానీ ఇప్పటికాలం విఎఫ్ ఎక్స్ లతో ఈ సినిమా రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Rajput (1982), Ghazab (1982) వంటి మరికొన్ని సినిమాలు వేర్వేరు భాషల్లో అనువదించబడి ప్రేక్షకులను కదిలించాయి. వాటి కాన్సెప్టులు కొద్దిపాటి మార్పులతో ఇక్కడ ప్రీమేక్ లు అయ్యాయి.

ధర్మేంద్ర లెగసీ — భాషల్ని, తరాల్ని దాటి నిలిచిన సినీ వారసత్వం!

ధర్మేంద్ర సినిమాలు కేవలం కథలు కావు — అవి భావోద్వేగాల ప్రయాణం. భాషలు మారినా, ఎమోషన్ మారలేదు. ప్రతి రీమేక్ లేదా డబ్బింగ్ ఆయన చిత్రాల సారాన్ని సౌత్ ఆడియెన్స్‌కు అందించి, మనసుల్ని కట్టిపడేసింది.

హిందీ తెర నుంచి తెలుగు మనసుల దాకా ఒక ఎమోషనల్ బ్రిడ్జ్

ధర్మేంద్ర సినిమాలు మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్పాయి. సినిమా అనేది కేవలం వినోదం కాదు; అది భావనను పంచే వేదిక.

ఆయన తెరపై పోరాడిన యుద్ధాలు కేవలం విలన్లతో కాదు — అవి మన అంతర్మనస్సుతో. అందుకే ఆయన సినిమాలు తెలుగులో రీమేక్ అయినా, తమిళంలో పునర్జన్మ పొందినా, వాటి హృదయం మాత్రం ఒకటే.

ధర్మేంద్ర అనే పేరు కేవలం గతానికి సంబంధించినది కాదు. అది భారతీయ సినిమాకి ఒక జీవించే విలువ, ఒక భావోద్వేగ సంపద.

ఆయన చెప్పిన కథలు భాషల్ని దాటి మనసుల్ని కలిపాయి. అదే ఆయన గొప్పతనం.సినిమా ద్వారా మనిషిని మళ్లీ గుర్తు చేసిన నటుడు... ధర్మేంద్ర.

1958లో దిల్ బీ తేరా హ‌మ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్‌లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్‌పై తన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్‌తో ఆయనకు అభిమానులు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అనే బిరుదు ఇచ్చారు.

ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం ‘ఇక్కీస్‌ (Ikkis)’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్‌ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.

Read More
Next Story