
అనుదీప్ ‘ఫంకీ’ మూవీ రివ్యూ
వన్ లైనర్స్ మాత్రమే ఒడ్డున పడేస్తాయా?
కోమల్(విశ్వక్ సేన్) సగటు తెలుగు సినిమా డైరక్టర్. చాలా మంది లాగే తన మొదట సినిమా నాలుగు కోట్లలో తీస్తా అని చెప్పి నిర్మాతని ఒప్పిస్తాడు. కానీ నలభై కోట్లు అయినా ఈ సినిమా పూర్తవదు. దాంతో ఈ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోలేని ప్రొడ్యూసర్ సురేష్ (నరేష్) అప్ సెట్ అయ్యి గుండె నొప్పి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన కూతురు చిత్ర( కయదు లోహర్) రంగంలోకి దిగుతుంది.
చిత్ర సీన్ లోకి వచ్చిన వెంటనే సినిమా ఆపేస్తానంటుంది. అయితే కోమల్ మహా ముదురు. ఆమెను ఒప్పించి... కేవలం కోటి రూపాయల్లో కోమల్ తో మిగిలిన సినిమా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చి మళ్లీ షూటింగ్ మొదలెడతాడు. అయితే నలభై కోట్లలోనే పూర్తి చేయలేని సినిమాని ఎలైగైనా కేవలం కోటి రూపాయలతో పూర్తి చేయటానికి రకరకాల ప్లాన్స్ వేస్తాడు.
అందుకోసం అవకాసం దొరికిన వాళ్లందరినీ ఫ్రీగా వాడేస్తూంటాడు. లొకేషన్స్, ప్రెండ్స్..ఏది దొరికితే అది. చివరకు మరి మిగతా సినిమా షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేసారా? ఈ క్రమంలో మొదలైన కోమల్, చిత్ర ప్రేమ కథ ఏమైంది? అసలు కోమల్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంటాడు. అందుకు కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎనాలసిస్
జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుదీప్ నుంచి అలాంటి సినిమాలే ఆశిస్తారనటంలో సందేహం లేదు. అనుదీప్ కూడా అలాంటి సినిమానే ఇద్దామనుకుని చేసినట్లుందీ చిత్రం. అందుకు తగినట్లుగానే పూర్తి వన్ లైనర్స్ తో సినిమా కిక్కిరిసిపోయి ఉంటుంది. అయితే ఈ క్రమంలో చాలా వరకూ సీన్స్ బదులుగా డైలాగ్స్ మాత్రమే కనపిస్తూంటాయి. కొన్ని సార్లు డైలాగు బాగుంది కదా అందుకు సీన్ క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. అయితే నవ్వించటమే టార్గెట్ అయినప్పుడు జోక్ అయితే ఏమిటి, పంచ్ డైలాగు అయితే ఏమిటి..ప్రత్యేకంగా సీన్ కావాలా అనిపిస్తుంది. కాకపోతే పూల దండలో దారంలా స్టోరీ లైన్ ఫెరఫెక్ట్ ఉంటే ..పూలు లాంటి జోక్స్,వన్ లైనర్స్ అందంగా తయారవుతాయి. లేకపోతే దారం లేక పూలు అన్ని ఓ చోట కుప్పగా ఉన్నట్లు ఉంటాయి. అదే జరిగింది.
విడివిడిగా చాలా వన్ లైనర్స్ నవ్విస్తాయి. అనుదీప్ లోని డైలాగు రైటర్ కి మరో సారి హ్యాట్సప్ అనేలా చేస్తాయి. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ఎక్కడ మొదలైన కథ అక్కడే ఉన్నట్లుగా ,కదలని కథతో మనం ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ సెటప్ అదీ బాగుంది కానీ కథ పెద్దగా కదలక పోవటంతో కొంత సేపటికి అనీజిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మెయిన్ కాంప్లిక్ట్, అది రైజ్ అవటం, రిజల్యూషన్ వంటివి కామెడీ సినిమాలకు కూడా అవసరమే అని గుర్తు చేస్తుంది. నో కాంప్లిక్ట్స్ నో డ్రామా కదా. ఆ డ్రామా కూడా ఈ సినిమాలో లేదు. మెలోడ్రామా అక్కర్లేదు కానీ డ్రామా మాత్రం అవసరమే. అది లేకపోవటంతో సినిమా ఓ ప్రవాహం లా ముందుకు వెళ్ళదు. ఎక్కడక్కడ అగి,కదులుతున్నట్లు అనిపిస్తుంది. విలన్ (సంపత్ రాజ్) ట్రాక్ అయితే ఎందుకు పెట్టారా అనిపిస్తుంది.
దానికి తోడు విశ్వక్సేన్ లాంటి జోష్ ఉన్న హీరో ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్సపెక్ట్ చేస్తాం. అదే మిస్సైంది. అలాగే ఎంత కామెడీ సినిమా అయినా ఎమోషన్స్ ఉంటే నెక్ట్స్ లెవిల్ లో ఉంటుంది. ఇందులో తల్లి ఎమోషన్ ని కొంతవరకూ రైజ్ చేయగలిగారు. అక్కడదాకా బాగుందనిపిస్తుంది. ఏదైమైనా మంచి స్క్రిప్టులో ఇలాంటి డైలాగ్స్ పడితే భలేగా ఉంటుంది కదా అని నిట్టూరుస్తాము. ముందే ప్రొడ్యూసర్ "లాజిక్ వెతకకండి, కేవలం కామెడీని ఎంజాయ్ చేయండి" అని చెప్పారు కదా అనొచ్చు. అయితే మనం ఆ మైండ్‌సెట్‌తో వెళ్లినా, ఈ సినిమా మనని పూర్తిగా సంతృప్తి పరచదు.
టెక్నికల్ గా ...
ఈ సినిమాలో కథ మైనస్ అనిపిస్తే వన్ లైనర్స్ పెద్ద ప్లస్. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం జస్ట్ ఓకే. రామ్ మిరియాల సాంగ్ మాత్రం బాగుంది. కెమెరా వర్క్ మాత్రం సోసోగా అనిపించింది. విశ్వక్ సినిమాల స్దాయిలో లేదు. ఎడిటింగ్ గొప్పగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఎవరెలా చేసారు.
విశ్వక్సేన్..పూర్తిగా అనుదీప్ ని అనుకరిస్తూ...చేసుకుంటూ వెళ్లారు. అది నిజానికి కష్టం. వేరే వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని ఓన్ చేసుకోవటం. అయితే విశ్వక్సేన్ కు సొంత బాడీ లాంగ్వేజ్ ఉంది. అందులో ఫన్ ఉంది. అది వదిలేసారు. హీరోయిన్ కయాదు చూడ్డానికి బాగుంది. సంపత్ నంది కుదరలేదు. నరేష్ ఈ మధ్య సినిమాల్లో ఇరగదీస్తున్నారు. అయితే ఆ స్దాయి పాత్ర ఆయనకు దొరకలేదు. మిగతావాళ్లు ,గెస్ట్ గా చేసిన సినిమావాళ్లు అందరూ ఆ పాత్రలకు తగినట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ప్రత్యేకంగా గుర్తుండిపోరు.
ఫైనల్ థాట్
సాధారణంగా సినిమా నేపధ్యంలో వచ్చే సినిమాలంటే మన వాళ్లకు ఓ రకంగా చిన్న చూపు. సినిమావాళ్లకు నఛ్చినంతగా,అర్దమైనంతగా బయిట వాళ్లకు ఆ ప్రపంచం పెద్దగా ఎక్కదు. తమకు ఆ ప్రపంచం సంభందం లేదని అక్కడ కామెడీలు, బాధలు ఎక్కవు అని మరోసారి రుజువు చేస్తారనిపించింది. సినిమా నేపధ్యం అయినా అంతర్గంతంగా వేరే కథ నడిస్తే తప్పించి ఇలాంటివి ఒడ్డున పడవు.

