అమెరికా టి-20 వరల్డ్‌ కప్‌ 2024కు టికెట్‌ పొందడం ఎలా?
x

అమెరికా టి-20 వరల్డ్‌ కప్‌ 2024కు టికెట్‌ పొందడం ఎలా?

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్.. టికెట్‌ కం టూర్‌ ప్యాకేజీ కోసం ఐసీసీ రెండు వెబ్‌సైట్లను లాంచ్‌ చేసింది. వాటిల్లో వివరాలు ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం..


టీ 20 ప్రపంచ కప్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 29వ తేదీ యూఎస్‌, కరేబియన్‌ దీవులలో మ్యాచ్‌లు జరగనున్నాయి. పోటీలో పాల్గొనే 20 జట్లను జనవరి 5న అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటించింది.

తొమ్మిది చోట్ల ఈ మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపింది. యూఎస్‌లో మూడు, కరేబియన్‌లో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐసీసీ ఈవెంట్లలో ఎప్పటిలాగే ఒకే గ్రూపులో ఉన్న ఇండియా, పాకిస్థాన్‌ జట్లు జూన్‌ 9 (ఆదివారం) న్యూయార్క్‌లో తలపడనున్నాయి.

20 జట్లు - నాలుగు గ్రూపులు..

ఐసీసీ పురుషుల టీ20 ఈవెంట్‌లో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్‌ ఎ: భారతదేశం, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, కెనడా యూఎస్‌

గ్రూప్‌ బి: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్‌. ఒమన్‌

గ్రూప్‌ సి: న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఉగాండా, పాపువా న్యూ గినియా

గ్రూప్‌ డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌

టిక్కెట్ల కోసం..

మ్యాచ్‌లకు సంబంధించిన లెటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌, టికెట్‌ రిలీజింగ్‌ డేట్స్‌ తదితర వివరాలకు దిగువన ఉన్న వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయాలి.

అందులో పేరు, ఈ మెయిల్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, నివసిస్తున్న దేశం నమోదు చేయాలి. తర్వాత ఏ దేశంలో జరిగే మ్యాచ్‌ను చూసేందుకు రావాలనుకుంటున్నారో సెలెక్టు చేసుకోవాలి. ఇలా ఎంట్రీ చేయడం వల్ల నేరుగా నమోదు చేసుకున్న వ్యక్తికి ఈ మెయిల్‌లో సమాచార అందుతుందన్న మాట.

https://icc-cricket-news.com/p/4BST-V3T/mt20wc24-register-interest?.https://thefederal.com/cricket/t20-world-cup-2024-tickets-how-to-register-online-and-where-to-buy-105407&pfredir=3

ట్రావెల్‌, టూర్‌ ప్యాకేజీల కోసం మరో వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

https://www.icctravelandtours.com/icc-mens-t20-world-cup-2024/?utm_id=ICC_Register_T20_PR_2024.https://thefederal.com/cricket/t20-world-cup-2024-tickets-how-to-register-online-and-where-to-buy-105407?infinitescroll=1






Read More
Next Story