12న ఘాటెక్కనున్న గుంటూరు కారం
x

12న ఘాటెక్కనున్న 'గుంటూరు కారం'

ఊహించినట్టే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు


మహేశ్‌ బాబు సినిమా ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఊహించినట్టే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను ఆయన షేర్‌ చేశారు. ‘‘ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. కంటెంట్‌ విషయంలో నేను నమ్మకంగా ఉన్నా’’ అని చెప్పారు. తాజాగా ఈ వీడియో క్లిప్‌ను షేర్‌ చేసిన ఆయన.. ‘‘మీకు మళ్లీ చెబుతున్నా. మేము అదే మాట మీద ఉన్నాం.‘గుంటూరు కారం’ను భారీగా విడుదల చేస్తాం. రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

అతడు తర్వాత అంత ఫేమ్‌...

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్‌ చేయాలని కోరుతూ పలువురు అభిమానులు వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నాగవంశీ తాజాగా ట్వీట్‌ చేశారు.

Read More
Next Story