‘రజాకార్లు’పై ఆర్. నారాయణ మూర్తి స్వరం మారిందా?
x
Narayana Murthy

‘రజాకార్లు’పై ఆర్. నారాయణ మూర్తి స్వరం మారిందా?

ఉద్యమాల మద్దతు పాత్ర వహిస్తున్న వాడు. ఇప్పుడు మత రాజకీయాలకు దోపిడీ వర్గాలకు వంత పాడుతాడా?


విప్లవ సినిమాల కధానాయకుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కీర్తిస్తారు. శ్రీకాకుళం రైతాంగ పోరాటాన్ని గానం చేస్తారు. ఆయన గొంతెత్తితే విప్లవం, సినిమా తీస్తే ఆదర్శం.. గద్దర్ మాదిరే ఆయన కూడా బొట్టుపెడతాడు, చేతులెత్తి దండం పెడతాడు, గుళ్లో పూజ చేస్తాడు. అదేమంటే అదంతా మన సంస్కృతి అంటారు. మూలాలు వెతకాలంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన తన సినిమాల్లో, నడతలో, నటనలో ఓశైలిని సృష్టించారు. తనదైన ముద్ర వేశారు. తెలంగాణ సాయుధ పోరాటమంటే ప్రాణమిచ్చే నారాయణ మూర్తి రజాకార్లు సినిమాపై మాట్లాడిన తీరు ఎందుకో.. ఆయన తన పోరాట పంధా నుంచి వైదొలిగారా అనే అనుమానానికి తావిచ్చేలా ఉంది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలోనూ వాదోపవాదాలు, చర్చోపచర్చలు సాగుతున్నాయి. అందులో ఒకటి జంపన్న పేరిట వచ్చిన ఈ వ్యాసం. జంపన్న ఏమన్నారంటే..

‘నారాయణ మూర్తి సినిమా దర్శకుడు నిర్మాతగా మారినప్పటి నుండి అనేక ఆర్థిక సమస్యల మధ్య తనకు తోచిన పద్దతిలో ప్రజా ఉద్యమాలు సాయుధ పోరాటాలు కమ్యునిజం ఇతివృత్తంగా సినిమాలు తీస్తూ మాస్ ను ఆకర్షించే మాస్ సినిమాలు గా సక్సెస్ అయినాడు. ఆ సినిమాలు కమ్యునిస్ట్ లు లేదా నక్సలైట్ల సినిమాలు అని సాధారణ ప్రజలు భావించారు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా దోపిడీ విధానాల పై ప్రజలు ఇష్ట పడ్డారు. కానీ ఆ సినిమాలలో వ్యక్తిగత హీరో వర్షిప్ ను అరాచక పద్దతులను చూపించడం లాంటి విమర్శ గురి అయ్యే విషయాలు అనేకం వున్నాయి.

తర దర్శకులు, నిర్మాతలు ,నటులు సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా లేదా హిట్ అయిన సందర్భంలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఎర్ర సినిమా దర్శకుడుగా నారాయణ మూర్తి కి వచ్చిన ఇమేజ్ ను వాడుకుంటున్నారు. వివిధ ఈవెంట్ లలో నారాయణ మూర్తి చేత ప్రసంగం చేయించడం ద్వారా సినిమా బూస్టింగ్ ను కొనసాగిస్తున్నారు.

నారాయణ మూర్తి ప్రసంగాలలో కమ్యునిజం ఏమి లేదు. వారికి భజన చేయడం వ్యాపార విలువలను పెంచే విధంగా వుంటూ నిర్మాతలను డైరెక్టర్లను నటులను ఆకాశానికి ఎత్తి పట్టడమే వుంటున్నది. అయితే ఇవి ఎప్పుడు సమాజంలో తీవ్ర చర్చ విషయాలుగా ముందుకు రాలేదు.

కానీ రజాకార్లు సినిమా రిలీజ్ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడిన ప్రసంగంలో చరిత్రకు విరుద్ధమైన వ్యాఖ్యానాలు మత రాజకీయ వ్యాఖ్యానాలు వున్నాయి. నారాయణ మూర్తి బిజెపి మత రాజకీయాలకు మద్దతు ఇస్తూ భూస్వాములకు నైజాంకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పటేల్ నాయకత్వంలో యూనియన్ సైన్యాలు అణచివేయడం తెలంగాణ ప్రజల విముక్తిగా చెప్పడం బిజెపి మత రాజకీయంలో భాగమే అవుతుంది

జాకార్ల దుర్మార్గానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ ప్రసిద్ది చెందింది. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ కమ్యునిస్ట్ పార్టీ. ఈ పోరాటంలో వేలాది ప్రజలు కమ్యునిస్ట్ కార్యకర్తలు త్యాగం చేసినారు.నిజాం రజాకార్ల ను మట్టి కరిపించి తెలంగాణ లో శ్రామిక వర్గ అధికారం కోసం ఘర్షణ పడుతున్న సందర్భంగా యూనియన్ మిలటరీ వచ్చి నాటకీయంగా నిజాంను లొంగ తీసుకొని ఒప్పందం చేసుకున్న చరిత్ర కేంద్ర ప్రభుత్వ విద్రోహ కర పాత్రగా చరిత్ర లో నమోదు అయింది. నిజాంతో ఒప్పందం చేసుకొని కమ్యునిస్ట్ యోధుల పై ప్రజల పై కొనసాగించిన మారణకాండ భూస్వాములు తిరిగి ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగ పడింది.

మ్యునిస్ట్ లను దెబ్బతీసి గ్రామ రాజ్యాల అధీనంలో వున్న భూస్వాముల భూములను భూస్వాములకు కట్ట పెడుతూ తిరిగి భూస్వామ్య ఆధిపత్యాన్ని కొనసాగించిన చరిత్రనే పటేల్ నాయకత్వం లో యూనియన్ సైన్యాలు కొనసాగించిన తెలంగాణ ప్రజల పై యుద్ద భీభత్సం, తెలంగాణ సాయుధ పోరాటంలో అన్ని కులాల మతాల ప్రజలు వుంటే ముస్లిం వ్యతిరేక పోరాటంగా చిత్రీకరించడం బిజెపి మత రాజకీయాలలో భాగంగా అనేక సంవత్సరాల నుండి చేస్తున్న ప్రచారం తెలంగాణ ప్రజలు నిరంతరం తిప్పి కొట్టుతున్నారు.

రిత్రను బిజెపి వక్రీకరించడం సాధ్యం కాదు. నైజాం ముస్లింగా వుండి రజాకార్ల గ్యాంగ్ లో హిందువులు వున్న విషయం నైజాంకు గ్రామాల్లో పునాది హిందూ భూస్వాములేనన్న విషయం చరిత్రను తుడిపెస్తే పోయేది కాదు. తెలంగాణ సాయుధ పోరాటం నైజాంకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా కుల మత బేధాలు లేకుండా తెలంగాణ సమాజం అంతా పోరాడిన చరిత్రను ఎవరు మార్చలేరు.

నారాయణ మూర్తి ప్రజా ఉద్యమాల చరిత్ర కు భిన్నంగా భూస్వామ్య మత భావజాలల మధ్య బంధీ అయి బిజెపి ద్వారా ప్రయోజనాలు ఆశిస్తే భంగ పాటే అవుతుంది.

నారాయణ మూర్తి ఎప్పుడు ఎక్కడ కమ్యునిస్ట్ పార్టీ సాధారణ సభ్యుడు కూడా కాదు. అయితే మొదటి నుండి కమ్యునిజం కోరుకునే వ్యక్తి. దానర్థం నిస్వార్థ కమ్యునిస్ట్ ఏమి కాదు. తాను అర్థం చేసుకున్న కమ్యునిస్ట్ రాజకీయాలతో సినిమా అనే వ్యాపార కళా రంగంలో కొంత ఉదర పోషణ కొంత కళా పోషణ కొంత ప్రజా. ఉద్యమాల మద్దతు పాత్ర వహిస్తున్న వాడు.ఇప్పుడు మత రాజకీయాలకు దోపిడీ వర్గాలకు వంత పాడుతాడా?

(రచయిత జంపన్న. హెడ్డింగ్ తప్ప మిగతా వ్యాసం యధాతథం)


Read More
Next Story