రాజకీయ పార్టీని స్థాపించిన హీరో విజయ్.. పార్టీ పేరు..
x

రాజకీయ పార్టీని స్థాపించిన హీరో విజయ్.. పార్టీ పేరు..

తమిళ రాజకీయాల్లోకి మరో తమిళ అగ్రహీరో విజయ్ రంగప్రవేశం చేశారు. అయితే అభిమానుల చేత ఇళయదళపతి గా పిలిపించుకునే విజయ్.. రాజకీయాల్లోనూ దళపతిగా మారతారా?


తమిళనటుడు, ఇళయదళపతి విజయ్ శుక్రవారం రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలనే లక్ష్యంతో పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరు ‘తమిళగ వెట్రి కళగం’ అని వెల్లడించారు. రాజకీయాలంటే అదొక పనో, లేకో ప్రత్యేక వృత్తి కాదు. అదొక పవిత్ర ప్రజాసేవ అని ఆయన ఒక ప్రకటనలో అన్నారు.

తమిళగ వెట్రి కళగం అంటే తమిళనాడు విక్టరీ పార్టీ అనే అర్థం వస్తుంది. తమిళనాడు సినిమా రంగంలో తెరమీద ఒకవెలుగు వెలిగిన ఎంజీ రామచంద్రన్, జయలలిత తరువాత అంతటి పాపులారిటీ, యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ కావడం విశేషం. తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని కొంతకాలంగా ఊహగానాలు వస్తున్నప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

కొన్ని సంవత్సరాల క్రితమే విజయ్ తండ్రి ఆయన పేరు మీద ఓ పార్టీని సైతం ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించారు. అయితే అప్పట్లో దానిని విజయ్ ఖండించారు. తనకు, ఆ పార్టీ కీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే ఈ మధ్య అభిమానులతో సమావేశం అయి పార్టీ పెట్టాలనే ఆలోచన పంచుకున్నట్లు తెలిసింది. కానీ తరువాత పార్టీని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించి వచ్చారు. దీని కోసం స్వయంగా విజయ్ ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. తరువాత చైన్నై వచ్చి తన పార్టీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఇందులో పార్టీ పేరు ను నిర్ణయించే అధికారంతో పాటు, మిగిలిన అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం పార్టీ విజయ్ కే అప్పగిస్తూ తీర్మానం చేశారు. తరువాత జరిగిన జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాల్లో తమ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోదని, ఎవరికీ మద్దతు ఇవ్వదని కూడా విజయ్ చెప్పారు.

"నేను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలపై పార్టీ పెట్టిన ప్రభావం చూపకుండా వాటిని పూర్తి చేస్తాను. అలాగే ప్రజాసేవలో దిగినందుకు రాజకీయాల్లోనూ పూర్తిగా నిమగ్నమవుతాను" అని విజయ్ అన్నారు. ఇది తమిళ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన సదవకాశంగా భావిస్తున్నానని విజయ్ చెప్పారు.

తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు. నన్ను నాసినిమాలను ఆదరించారు. ఏమి ఇచ్చిన మీ రుణం తీర్చుకోలేనని అన్నారు. కాగా విజయ్ పార్టీ పెట్టినట్లు ప్రకటన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇళయదళపతి రాజకీయాల్లోనూ దళపతి అవుతారని బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ సందడి చేశారు.

Read More
Next Story